18 జన, 2014

మంత్రాలకు చింతకాయలు


           

                       

మంచి సంగీతం, విషాద గీతాలు కాదండోయ్... 
హుషారెత్తించే సంగీతం వింటుంటే మీలోని మానసిక ఒత్తిడి చాలా రకు దూరమవుతుంది.
సంగీతం వింటే 
శరీరంలో సంతోషానికి సంబంధించిన రసాయనం సిరోటిన్ శాతం పెరుగుతుందంటున్నారు వైద్యులు.

సంగీతంతో వైద్యం ..
అంటే అందరూ
ఆ.. యేవో అలానే చెబుతూ వుంటారు..

అవన్నీ జరిగేవా పెట్టేవా..
అనుకుంటూ వుంటారు..
కానీ నా కొద్దిపాటి పరిశీలనలో నే 
ఎన్నో విషయాలు తెలిసాయి
అవేమంటే
రాధిక అనే ఆరేళ్ళ అమ్మాయి
ఏదో ప్రమాదంలో కోమాలోకి వెళ్ళిపోయింది
ఆమె తిరిగి బయటికి వస్తుందని డాక్టర్లు కూడా అనుకోలేదట..
వెంటిలేటర్స్ పెట్టారు
నరాల రీహాబిలిటేషన్ చేద్దామని డాక్టర్లకు ఆలోచన వచ్చింది
అంతర్జాలంలో వెదకితే కొన్ని ఆసక్తి కరమైన వ్యాసాలు వాళ్ళకి దొరికాయి
సరే.. ప్రయత్నిద్దాం అనుకొని
ఆపిల్లకి ఇష్టమైన ఒక మళయాళీ కృష్ణ భక్తి గీతాన్ని హెడ్ఫోన్ ద్వారా ఆ పిల్లకి వినిపించారు
ఆశ్చర్యం
ఆపిల్ల కోమాలోంచీ బయటికి వచ్చి
అందరినీ చూసి గుర్తు పట్టి.ంది
తరువాత గ్రామఫ్9ఎన్ ద్వార వినిపించారు
మెల్లిగా నడవడం మాట్లాడటం కూడా చేసింది..
ఇదీ మధ్య సంఘటన

మ్యూజిక్‌ థెరపీ అనేది 
క్లినికల్‌ థెరపీ, బయో మ్యూజికాలజీ, మ్యూజికల్‌ అకౌస్టిక్స్‌, మ్యూజిక్‌ థీరీ, సైకో అకౌస్టిక్స్‌, కంపే రిటివ్‌ మ్యూజికాలజీల మధ్య సంబంధా లను అధ్యయనంచేసే శాస్ర్తీయ పరిశోధన. 
ఈ చికి త్సా క్రమంలో సుశిక్షితుడైన మ్యూజిక్‌ థెర పిస్టు 
భౌతిక, భావాత్మక, మానసిక, సామా జిక, సౌందర్య, ఆధ్యాత్మిక కోణాల్లో 
సంగీతాన్ని ఉపయోగించి వ్యక్తులు ఆరోగ్యాన్ని పొంద డానికి సహాయపడతాడు. 


చూశారా ..
ప్రపంచమంతా ఇది నిజమని చెప్పిన తరువాత 
మనకు నమ్మబుధ్ధి వేస్తుంది..
అలానే మంత్రాలకు యే మహిమలూ సిధ్ధులూ లేవని
టీవీల్లో గొంతు చించుకొనే మనం
యే అర్జెంటైనావాడో మంత్రాలన్నీ నిజాలే అంటే మనమూ అవునవునని  తలాడిస్తాం..

మన త్యాగరాజులూ దీక్షితులూ శ్యామశాస్త్రులూ యేనాడో
రాగాలతో రోగాలను నివారించి
గ్రహస్థితులకు శాంతి చేశారు..
పుట్టపర్తి వారి వాగ్గేయకారులూ పదకృతి సాహిత్యం లోని యీ విషయం
మనకు అదే చెబుతుంది..
 

త్యాగరాజు వలెనే దీక్షితులును మహా తపస్వులు
అలానే శ్యామ శాస్త్రులును
వారి సంగీత సాహిత్యములు 
వినయ గౌరవములతో చూడదగినవి
మువ్వురును ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోనుధావతి కోటికెక్కినవారు

దీక్షితులకు మృదంగ విద్వాంసుడు 
తంబియప్పన్ అను శిష్యుడుండెనట..
అతనికి కడుపునొప్పి రోగము వచ్చెను
మందుమాకులతో అది మాయలేదు
ఎవరో ఒక పురోహితునడుగగా జాతకము చూచి
నీకు గురు శని గ్రహములు చాలలేదు
వానికి వేదోక్త రీతి శాంతి చేయవలెను
వేదాధికారములులేని నీకది సాధ్యము కాదు కదా..
వేరు విధమైన శాంతి క్రియలు నేనెరుగను యేమి చేయవచ్చును అన్నాడట..

తంబియప్పన్ దుఃఖముతో నీ గాధ 
తన గురువుతో చెప్పుకొనెను
వారు 'బృహస్పతే ' యను కృతిని
'దివాకర తనూజం' అను శని స్తుతియు రచించి

యీ రెంటిని ఒక్క వారము భక్తి తో పాడుకో నీకు క్షేమమగును అని ఉపదేశించిరి
అతడట్లే చేసెను ఉదరశూల తగ్గినది

ఇట్టి సన్నివేశములలో 
ననాధ ననాధ భక్తులకెందరికో ఉపయోగకరమగు
నవగ్రహ స్తుతులు రచించుటకై 
తంబియప్ప దీక్షితులను ప్రార్థించెను
వా రట్లే యొనర్చిరి

తంబియప్ప వానిని భక్తితో పునశ్చరణ చేసికొనుచుండెను..
నవగ్రహవేధలలో నతడు భస్మము 
నా పాటలతో మంత్రించి ఇచ్చెడువాడట..

ఒకసారి యనావృష్టి యేర్పడినది
జనులు నీటికై వేకారు చుండిరి
దీక్షితులకు దయ కల్గినది
వారం ఋతవర్షిణి రాగములో నమ్మవారిని ప్రార్థించుచు 'వర్షయ.. వర్షయ.. '' అన్నారు
అంతే.. 
వాన వానకాళ్ళు గట్టికొన్నది

మరల వాన నిల్చుటకు వారే 
''స్తంభయ..  స్తంభయ.. '' 
అనవలసివచ్చినది

దీక్షితులు ప్రధానముగ శ్రీచక్రోపాసకులు
వారి దైవము సోమాస్కందమూర్తి
అనగా పార్వతి షణ్ముఖుడు
వీరితో చేరుకొన్న పరమ శివుడు..

కాని వీరి ఉపాసన తాంత్రికము
వామాచారమును చేరినట్లున్నది
కేవల సాంకేతికమగుటచే 
వారి మూర్తి భూలోక పరిధులకు దిగిరాలేదు

త్యాగయ్యకీ గొడవలు దెలియవు
వారిది హార్దికమైన భక్తి మార్గము మరుగులేని నామజపము