17 డిసెం, 2013

రసోవైస్సః


తండ్రి బాధ్యత..

శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర ఎడమ వేపున 

సాయి కృష్ణ యాచేంద్ర గారు 
 సంగీతావధానంలో పేరుపొందాడు
ఆయన సంగీత నిర్వహణలో 
బాలసుభ్రమణ్యం వాణీ జయరాం 
తదితరులు పాడుతుంటారట

త్వరలో మనం శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర గారి నిర్వహణలో రూపొందిన పుట్టపర్తి శివతాండవాన్ని మార్కెట్లో చూడబోతున్నాము..
 

అలానే
ప్రాచ్య లిఖిత గ్రంధాలయం వారు పుట్టపర్తి కృతులను శతజయంతి సంవత్సరంలో భాగంగా 

ముద్రించటానికి ముందుకు వచ్చారు
 

ఆ కృతులను మంచి వారితో పాడించి 
పనిలో పనిగా CD లను కూడా తేవాలని 
శ్రీ మండలి బుధ్ధప్రసాద్ గారు 
నిర్ణయించడం కూడా సంతోషకరం.
 

మండలి వెంకట కృష్ణారావ్ గారు 
విద్యాశాఖామంత్రిగా వున్నప్పుడు 
పుట్టపర్తితో మంచి స్నేహ సంబంధాలు నెరపేవారు
 

పుట్టపర్తి మందలి ఇంట్లో బసచేయటం జరిగేది
ఆ చుట్టరికంతో తమ తండ్రి బాధ్యతను 

పవిత్రంగా భుజాన వేసుకొని కార్యం  నిర్వహిస్తున్న బుధ్ధప్రసాద్ గారిని 
నేను అభినందించటం కూడా జరిగింది
అక్కయ్య మా అయ్యగారి కార్యాన్ని దీక్షతో చేయటం బహుశా ఆయనను ప్రేరేపించి వుండవచ్చు..

పోతన్నా ..యెంతపని చేసావయ్యా ..


 రచయిత  జీవితం పాత్రల్లో ప్రతిఫలిస్తుందా..?
అతని ఆలోచనల ప్రకారం పాత్రలు నడచుకుంటాయా..
 

ఒకవేళ రచయిత మృదుస్వభావి అయితే భయంకరమైన సన్నివేశాలనెలా వర్ణించగలడూ..
క్రూర మైన మనస్తత్వం వున్న 

పాత్రల చిత్రణ ఎలా చేయగలడు..?
కదా..
ఒక సినిమాలో రాద్దామని పుస్తకం తెరవగానే
పాత్రలన్నీ వచ్చి మాట్లాడతాయి రచయితతో
(అల్లు రామలింగయ్య )
 

నేను 'ధరణికి గిరి భారమా'
కథ రాసినప్పుడు అక్కడ ఆ సంస్థ నిర్వహణ చూడవలసి వచ్చింది
అప్పుడు ఆ ముసలివారి వ్యధలూ భాధలూ పరిస్తితులూ తెలిసాయి
అంతే ..
ఆ ఘోరాలు చూడలేను బాబోయ్ అని పారిపోయొచ్చాను..
 

ఇంకొకటి 
తనకెదురైన వ్యక్తుల్ని పరిశీలిస్తూ వారి నడకా మాటతీరు గమనిస్తూ వారినే
కలంతో దింపేయటం
 

ఒకసారి కోటేశ్వరరావు గారు చెప్పారు
వారు ఎవరింటికెళ్ళినా ..

'మా పూజామందిరం చూడండి ..'
అని బ్రతిమలాడి తీసుకెళ్ళి చూపించేవారట
ఆయన యేవైనా చెబితే దిద్దుకొనేవారు
 

ఇక ఆయన తన ఉపన్యాసాలలో
అన్యాపదేశంగా 

వారి ఇంటి తీరును.. పూజా విధానాన్ని.. వగైరాలను ఉటంకించటం మొదలెట్టేసరికి ఖంగుతిన్నారు
 

మీ పూజామందిరం చూపించండి ..
అని యీనే అడిగినా..
వద్దులెండి .. 

మీ ఉపన్యాసాలలో మా ప్రస్తావనలు వస్తున్నాయి .. 
అంటూ మాట తప్పించే వారట..
 

అలా ..
వారు చూచినవీ విన్నవీ.. కథలూ కాకరకాయల్లో రాకుండా వుంటాయా..
అందులో వారి స్వవిషయాలకు భావాలూ బాధలూ  ఎక్కడో ఒకచోట దూకుతూనే వుంటాయి
 

సరే..
పోతన్న విషయానికొస్తే..
ఆయన రైతు ..
దరిద్రం ఆయన వెంటే ..

అందుకాయనకు బాధకూడా లేదు..
 

ఇది చూడండి..
''గొల్లవారి బ్రదుకు గొరతన వచ్చునె
గొల్ల రీతి బాలకుప్ప ద్రచ్చి
గొల్లలైరి సురలు ; గొల్లయ్యె విష్ణుండు
చే
టులేని మందు సిరియు గనిరి...''


గోపాలకుల జీవితం కొంచెమైంది కాదు. 
దేవతలు గొల్లవారివలె పాల సముద్రాన్ని చిలికినారు. విష్ణువు సైతం గొల్ల అయినాడు. 
అమరత్త్వాన్ని అందించే అమృతాన్నీ శ్రీలక్ష్మినీ పొందగలిగాడు. 
 అని ఎంత అందంగా చెప్పాడో ..చెప్పాడు కానీ..

మరి దరిద్రానికతి చేరువలో వుండే పోతన 
తెలిసో.. తెలియకో.. ఆ లక్ష్మీ నాధుణికీ 
తన లేని తనాన్ని అంటించకుండా వుంటాడా ..
 

అదే చెబుతున్నారు ఆచార్యులవారు
వ్యాసుడు కృష్ణుని అంతఃపురాన్ని 

'సర్వకాంతా.. అనుత్తమా..'
 అని ఊరుకుంటే
 

పోతన్న కాస్త ముందుకు పోయి 
కృష్ణునికి సువర్ణ సౌధమునే కట్టినాడట..
పోనీలే
పాపం.. కల్పనే కదా..
 కడితే కట్టాడు..    అనుకుంటారేమో
తరువాత పోతన్న యేం చేసాడో తెలిస్తే ..

మీరూ ముక్కున వేలేసుకుంటారు..
మనమూహించుకున్న  దంతయు 

పోతనామాత్యుల యూహా చిత్రము..
అంతేగాని ..
చారిత్రకముగా నాతని గురించి
 

మన కేమియు దెలియదు
ఒక్క విషయము మాత్రము గట్టిగ చెప్పవచ్చును
అతడు దరిద్రుడు..
ఇది మాత్రము నీకెట్లు తెలియునందురా..
అందున కుపస్ఫోరకమిది..
కృష్ణ భగవానుడు ద్వారకకు  వచ్చినాడు
ఆ సందర్భమున వ్యాసులిట్లు వర్ణించిరి.

''పత్న్యః పతిం ప్రాప్య గృహానుపాగతం
విలోక్య సంజాత మనో మహోత్సవాః
ఉత్తస్థురారా త్సహసాసనాశయైః
సాకంవ్రతైః వ్రీడితలోల లోచనాః
తమాత్మ జైర్దృష్టి భిరంతరాత్మనా
దురంతభావా, పరిరేఖ రేపతిం
నిరుధ్ధమ ప్యాస్రవ దంబునేత్రయో
ర్విలజ్జితానాం భృగు వర్య ! విక్లబాత్ !!
 

వ్యాసుడు కృష్ణుని యంతః పురమును 
'సర్వకాంతా'  యనియు 'అనుత్తమా'
 యనియు బలికిరి
పోతన్నయును 

పురుషోత్తమునకు సువర్ణ సౌధమునే గట్టినాడు..
కాని యంతతో నూరకున్న బాగుండెడిది.
అతడు 

భార్యల యోగక్షేమముల విచారింప మొదలు పెట్టెను
అందులో మొదటి పద్యమిది

''కొడుకుల్ భక్తి విధేయు లౌదురుగదా కోడండ్రు మీ వాక్యముల్
గడవంజాలక యుందురా ! విబుధ స్త్కారంబు గావింతురా
దొడవుల్ వస్త్రములున్ పదార్థ రస సందోహంబులున్ జాలునా
కడమల్గావు గదా ! భవన్నియముల్ ! కల్యాణ యుక్తంబులె..!!''
 

దీనిని జదివినప్పుడు ..
'వైభవావతారుడైన కృష్ణుని భార్యలకు గూడ 
కూడు గుడ్డల కొరత దప్పక పోయెగదా..' యని 
నాకు మాత్రము పట్టరానంత నవ్వు వచ్చినది
 

ఇందులో నున్న దారిద్ర్యము.. 
నిశ్చయముగ పోతన్నదే..
అది వాసుదేవుని యంతః పురమున గూడ తొంగిచూచినది...