Leaves in the Wind of Puttaparthi Narayana charya does give us an insight into the soul,heart and mind of a genuine poet. It is a book of sensitive poetry - Harindranath Chattapadhyaya New Delhi 10.4.1953
నారాయణాచార్యుడు కవితాసృష్టిలో సామగ్రీ పూర్ణత్వమును సంపాదించిన వ్యక్తి. నారాయణచార్యుని అర్ధాంగి శ్రీమతి సౌభాగ్యవతి శ్రీ కనకమ్మ పూర్ణతా సిధ్ధి ధాత్రి. శ్రీమతీ శబ్దము .. నారాయణాచర్యుడు అర్థము.. ఇద్దరు శబ్దార్థములు.. వారు వాని ఆత్మలను ఏకీకరించుకుని శబ్దార్థశ రీరమైన ఈ కావ్యమునకు (అగ్నివీణ )ఆత్మ సంపత్తిని ఇచ్చినారు.. స్త్రీల కవితా శ్రధ్ధ ప్రశంసాపాత్రము.. శ్రీ రాజశేఖరుని వామార్థము అవంతీ సుందరి.. సాహిత్య వాదములలో స్వసంవాదమిచ్చి సాహితికి సౌరభము సంపాదించినట్లు కావ్య మీమాంస మనకు చెప్పినది.. అటు తర్వాత ఇట్టివారు లేరు.. ఇప్పుడు వీరు తాదృశులు .. ఈ మధుర దంపతులు ఈ విధముగా నిత్య సాహిత్య నిర్మాణ చతురమతులు కావడము శుభము. రూపు కట్టిన ఈ శబ్దార్థములకు శుభమస్తు.. జమ్మలమడక మాధవరాయ శర్మ అగ్నివీణ వాకోవాక్యము..
నేనీ మధ్య డా. రేవూరి అనంత పద్మనాభరావు గారు కడప ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ (రిఠైర్డ్) కొమండూరి శేషాద్రి గారు ప్రముఖ వయొలినిస్ట్ ఇంకా పుట్టపర్తి వారి జనప్రియ రామాయణం పై పరిశోధన చేసిన శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గార్లతో సంభాషించాను అందరూ చక్కని విశేషాలు చెప్పారు అద్భుతమైన అనుభవాలను ముచ్చటించారు మంచి ఆదరాన్ని చూపారు ఆనాళ్ళలో పుట్టపర్తి వారి జనప్రియ రామాయణాన్ని నాటి కలెక్టర్ సంజీవరెడ్డి గారు ముద్రించడానికి సహాయమందించి పుట్టపర్తి వారి షష్టిపూర్తి మహోత్సవాన్ని కనులపండువగా ప్రముఖులందరితో కలిసి జరిగేలా చూసారు. కారణం సంజీవ రెడ్డి గారి తండ్రిగారయిన శ్రీ పైడి లక్ష్మయ్య గారు పుట్టపర్తి వారి తండ్రిగారయిన పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేసారట.. ఆనాటి అభిమానంతో గురుపుత్రులనే ప్రేమతో లక్ష్మయ్య గారి కొడుకైన సంజీవరెడ్డిగారితో పుట్టపర్తి వారికి తగిన సహాయ మందేలా చూసారు సంజీవ రెడ్డిగారుకూడా తన తండ్రి గారి మాటను మన్నించి పుట్టపర్తి వారి యెడల ఎంతో గౌరవ మర్యాదలను చూపటం సంతోషకరమైన విషయం సంజీవ రెడ్డి గారినీ ఇంటర్వ్యూ చేద్దామని వారి నంబరుకు ఒకసారి కాంటాక్ట్ చేసాను నిద్రపోతున్నారు నాలుగ్గంటలకు చేయమని వారి మనుమరాలు కాబోలు చెప్పారు నాలుగ్గంటలకు నేను మరిచే పోయాను
ఇంటిపని బ్లాగు పని పూజ వీనితో కొంత మరుపుకు పడ్డ ఆ విషయం మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొనే లోగా ఒక పిడుగు లాంటి వార్త విజయదశమినాడు పూజ చేసుకుంటూ పేపరులో పోసిన పూలను పళ్ళెంలోకి వంపుకుంటూండగా సంజీవ రెడ్డి గారి ఫోటో పేపరులో కనిపించింది.
సంజీవ రెడ్డి గారు దివంగతులై అయిదురోజులయింది నాకు కలిగిన షాక్ కు అంతులేదు జగమంతా శూన్యమైనట్లు అనిపించింది జనప్రియ రామాయణం పీఠికలో పుట్టపర్తి వారు ఆ తండ్రీ కొడుకులను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ వ్రాసినవీ పద్యాలు మీరూ చదవండి..
కం. మా నాయన మీ నాయన యేనాడో గురువు శిష్యులీ బంధముతో నీ నిండు మనసునిచ్చితి నేనెఱి బోద్రోసికొందు నీ యీ ఋణమున్..:!
మ. రస సామ్రాజ్య ముదార రామకథ నీ ప్రత్య ప్రయత్నంబుకై వలమై తెంగున నేలలన్ దిరుగు భాస్వద్విద్వదాస్థాన కీ ర్తి సమున్మేషము, పేర్ల వంశపు శివారెడ్డీ!భవచ్చిత్త వీ ధి సుమించె న్నొకనాటి రెడ్డికుల నీతి త్యాగ విస్మేరముల్..!