ఒకసారి ఒక సభలో విశ్వనాధ రామాయణాన్ని గురించి
పుట్టపర్తి యేంచెప్పారో పై వీడియో చెబుతుంది
పుట్టపర్తీ విశ్వనాధ ఇద్దరూ రామయణం వ్రాసారు
విశ్వనాధ వ్రాసాడని
పుట్టపర్తీ రామాయణం వ్రాసాడని అనేవాళ్ళూ
విశ్వనాధ రామాయణం పండితులకే ననీ
పుట్టపర్తి రచన అందరికీ అనీ యేవేవో మాటలు
ముందు రామాయణమనే పేరు పెట్టారనీ తరువాత జనం దానికి జనప్రియ జోడించారనీ కొందరి వాదన
కానీ పుట్టపర్తి మాత్రం
తులసిదాసు రామచరిత మానసమటువంటిది
తెలుగులో రావాలని చేశానన్నారు
మాత్రాఛందస్సులో వ్రాయటానికి
సంగీతమంటే ఉన్న పిచ్చే కారణమనీ చెప్పుకున్నారు
''పద్యాలు కూడా సంగీతంగా చదవవచ్చు..
కన్నడదేశంలో గమక ప్రక్రియలోనే కావ్యాలను చదువుకౌంటూ
జీవితం గడుపుకుంటూ వుండేవాళ్ళు..
శఠగోపాచార్యులని ఒకాయన..
ఆయన యేమీ చేయడు
కుమార వ్యాసుని భారతం
గమక ప్రక్రియలో మాత్రమే చదువుతాడాయన
పోయిన చోటల్లా జనాలు ఉదారంగా చందాలు ఇస్తారు
ఆయన బతికినాడు ''
అంటారు పుట్టపర్తి
రామాయణాలు ఎన్నో
మళ్ళీ రామాయణమెందుకు
అన్న వాదానికి
ప్రతీ రోజూ తిన్న అన్నమే
అని తినడం మానేయడం లేదు.
సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని
మనం మానేయడం లేదు.
మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా.
అలాగే ఎవరి అనుభూతులు వారివి.
ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన
ఇది విశ్వనాధ భావన
పుట్టపర్తికి సన్నిహితుడైన v.p రాఘవాచార్యులేమంటారో విందాం..
1954 లో నేనొక నెల రోజులు మైసూరులో ఉన్నాను
అక్షరాస్యులైన వయోజనులకు పనికివచ్చే
పుస్తకాలు వ్రాయాలనే ఒక పథ కం ప్రకారం
యునెస్కో వారి ఆర్థిక సహాయంతో
కేంద్ర ప్రభుత్వం వారు
మైసూరులో ఒక రచయితల వర్కు షాప్ నిర్వహించారు
తెలుగువా రిలో హైద్రాబాదు రాష్ట్రం నుండి
నన్ను మరొక ఉపాధ్యాయుని ఎన్నుకొని
ఈ వర్కుషాప్ కు పంపారు
ఆనాటి మైసూరు రాష్ట్రంలో వయోజన విద్యా కార్యక్రమం ఒక స్వచ్చంద సంస్థ చక్కగా నిర్వహించేది
దానిపేరు వయస్కరణ శిక్షణ సమితి అని జ్ఞాపకం
ఆ సమితి కోరికపై పుట్టప్ప గారు
జనప్రియ వాల్మీకి రామాయణం సంగ్రహంగా వచనంలో వ్రాశారు
అక్షరాశ్యులైన వయోజనులు
తమ జన్మ సఫలం కావడానికి తాము చదువగలిగిన రామాయణం కావాలని కోరారట.
ఆ కోరికని పురస్కరించుకొని
పుట్టప్పగారు రామాయణం వ్రాసారు
నేనెపుడో 1956 ప్రాంతాలలో అనుకుంటాను
శ్రీ పుట్టపర్తికి చెప్పాను.
ఆయన జనప్రియ రామాయణం అనే పేరు
నేను చెప్పినాక పెట్టారో
అంతకు పూర్వమేపెట్టారో నేనెరుగను
పుట్టప్ప అప్పుడు వ్రాసినది ఒక చిన్న పుస్తకం
పుట్టపర్తి వ్రాసినది అద్భుతమైన మహా కావ్యం
ఆయన ఎన్నుకున్న ఛంధస్సు
పాడుకోవటానికి అనుకూలమై
కావ్యానికి ఎంతో శోభను చేకూర్చింది
అచ్చు అయిన తరువాత ఆ పుస్తకాలను నేను తెప్పించుకొని చదివాను.