18 డిసెం, 2014

ధృతరాష్ట్రుని వంటి ప్రతినాయకుడు..


"పాశ్చాత్య వాఙ్మయంలో 
ఇలియట్ ..ఒడిస్సీ ..గ్రంధాలే 
అతి పెద్ద గ్రంధాలని పరిగణిం పబడతాయి..
ఈ రెం డింటినీ కలిపినా .. 

దానికంటే ఎనిమిది రెట్లు మహా భారతం పెద్దది.."

"భారతదేశం యొక్క రాష్ట్రాభిమానమును నాశనమొనర్చుటకే పాశ్చాత్యులు ప్రయత్నించిరి..
మన ధర్మము సంస్కృతి అభిమానము వీనిని నిందించుటే వారి పని..
ఈ కార్యమునకు వారేవేవో నిరాధారములైన యూహలల్లుదురు.."

"సంస్కృత కావ్యములలో 

యనేకులు బ్రతినాయకులు వర్ణింపబడినారు.. 
కాని.. 
ధృతరాష్ట్రుని వంటి ప్రతినా యకుడు వేరొక్కడు కని పింపడు"
''శిశుపాలుడిట్లయినాడనగా యానాటి గణ రాజ్యముల స్థితి యట్లుండెనని యర్థము, పతితమైపోయిన రాజ్యసత్త యొక్క స్థితికి బ్రతీకముగ వేదవ్యాసుడు తన ప్రతిభా సృష్టితో నొక వ్యక్తిని నిర్మించెను.. వాని పేరు మీకు దెలిసినచో యాశ్చర్య పడుదురని తలంతును..
ఆ వ్యక్తియే రాజైన దుర్యోధనుడు"

"మార్క్స్ .. లెనిన్ .. 

మహాశయులన్న రాష్ట్రతంత్రము లేని స్థితి.. కృతయుగమందే సిధ్ధించును.. 
కాని యిట్టి సమాజమును స్థాపించుటెట్లు..?? 
అను విషయమున మాత్రము 
సామ్యవాదులతో మనకు బొత్తులేదు.. 
ఆర్థికముగ.. మానవుడు బాగుపడినంతనే ప్రపంచమున సర్వ క్షేమములు సమకూరుననుట పాక్షిక దృష్టి"

ఈ వ్యాఖ్యలను ఆచార్య జి.వి. సుబ్రమణ్యం గారేమని విశ్లేషించారంటే ..

పుట్టపర్తి వారు రెచ్చగొట్టే విమర్శలు చేసేవారు.. 

వారి విమర్శ .. 
ఆలోచించే విస్ఫులింగాలను సహృదయులకందిస్తుంది.. 
వారి విమర్శ 
ఆనందంకోసం.. గాని.. ఆహ్లాదం కోసం గాని.. చదువుకోము..
ఒక క్రొత్త చూపుకోసం వాటిని చదువుకొంటాం..
నిద్రపోయే జాతిని మేల్కొలుపుతున్నట్లు విమర్శ చేయటం వారికే సరిపోయింది.. ''