18 ఫిబ్ర, 2013

......
వ్యాస వాల్మీకం లోని ఈ ఫోటో నాకు నచ్చిన ది
ఇందులో రాళ్ళపల్లి వారి అభిప్రాయం వుంది
ముఖ్యంగా
పుట్టపర్తి వారి పాదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయ్
ఎందరో ప్రతిరోజూ మా ఇంటికి వచ్చి మొక్కిన పాదాలు
పరీక్షకు 

ఇంటర్వ్యూకు 
వుద్యోగంలో చేరడానికి 
ఒక్కటేమిటి
అష్టాక్షరి నాకు తెలిసి డెభయ్ కోట్లకు పైగా చేసిన పునీతుని పాదాలు ఇవి.
నాకు భగవత్సాక్షాత్కారమవుతుందా 

కృష్ణ దర్శన మవుతుందా అని
పుట్టపర్తి సాయిబాబా దగ్గరినుంచీ గల్లీ లో సాధువనిపించిన వాని వరకూ
ఆర్తి గా అడిగి అడిగి అలసిన వాని పాదాలు
జీవితంలో ధనము వెంటకాక పరమార్థం కొరకు 

శంకర నారాయణ డిక్షనరీ ప్రకారం 
the highest truth, 
spiritual knowledge, 
the real secret, 
the solemn fact. 
కోసం పరుగెత్తిన వాని పాదాలు
బుధ్ధిపుడితే నమస్కరించుకోండి 

మనసుపుడితే పూజా మందిరం లో పెట్టుకోండి
మీకు సద్గురువు ఎక్కడా దొరకడు
ఇదిగో 

నిజమైన సద్గురువు ఇక్కడ వున్నాడు
ఎవ్వడైతే 

తన మనస్సును భగవంతుని మందిరంగా చేస్తాడో
ఎవ్వడైతే 

తన గమనం ద్వారా దారిని ఏర్పరచి 
ఇతరులకు మార్గదర్శకుడౌతాడో
వాడే నిజమైన సద్గురువు
తెలుపు నలుపుల గురించి మంచి చెడుల గురించీ పట్టించుకోకండి
ఒక ప్రయత్నంలో తప్పుచేస్తేనే ఆ తప్పులోంచీ దానికి భిన్నమైన ఒప్పు మనకు గోచరమవుతుంది.