23 ఏప్రి, 2015

పరోపకారాయ ఫలంతి వృక్షాః

ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చేవాడు..
మౌనంగా కూచునే వాడు..
పిలిస్తే పలికే వాడు
అయ్య ఎక్కడికి వెళ్ళినా తోడు
పట్టుకుని తీసుకు వెళ్ళటం 

వెంటే వుండటం 
తీసుకు రావటం.
అతనికి పుట్టపర్తి గురించి ఎంత తెలుసో తెలియదు
కాలేజీకి వెళ్ళి వచ్చేవరకూ మాత్రమే 

కనబడేవాడు కాదు
అంతే..
అలా రోజులు గడిచాయి
క్రమక్రమంగా అయ్యకు అతను కుడిభుజమైపోయాడు..
అతని డిగ్రీ.. అయిపోయింది..
వెంటనే APPSC పరీక్షలు రాసాడు..
పరీక్ష పాసయ్యాడు..
ఇంటర్వ్యూ కడపలోనే..
ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలుసుకున్నాడు
నన్ను రెకమెండ్ చేయమని ప్రాధేయపడ్డాడు..
సరే అన్నారు అయ్య..
రిక్షా ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు..
ఒరే వీడు నా వాడు వీణికి ఉద్యోగం ఇవ్వరా.. అని
అక్కడి సంబంధిత అధికారికి చెప్పారు పుట్టపర్తి..
సరే నన్నారు 

ఆ సంబంధిత అధికారి అయ్యపై గౌరవంతో..
కొద్దిరోజులు గడిచాయి..
అతనికి కడప కలెక్టరాఫీసులో ఉద్యోగం వచ్చింది.. క్లర్క్ గా..
అతనికీ ఆనందం.
అయ్యకూ అనందం..
కొద్దిరోజులకు అక్కడే ఉద్యోగం చేసే పిల్లను 

పెళ్ళి చేసుకున్నాడు..
అతని జీవితం కుదుటపడింది..
తర్వాత అతనికి అయ్య దగ్గరికి రావటానికి టైం లేదు..
అయ్య కనీసం బాధైనా పడలేదు..