క్రీస్తు పూర్వం పదకొండో శతాబ్ది..
పర్షియా రాజు గజినీ..
భారదేశంలోని అపార ధనరాశులను కొల్లగొట్టి ..
తన దేశానికి తరలిస్తాడు..
తన వంశ చరిత్ర చిరస్థాయిగా నిలిచేటట్లు
కావ్యం వ్రాయమనీ
అందుకు బదులుగా
తాను ఒక్కో పద్యానికీ ఒక్కో బంగారు నాణెం ఇస్తానంటాడు.
దానికి అల్లా ప్రమాణమని నమ్మబలుకుతాడు..
ముఫైయ్యేళ్ళపాటు శ్రమించిన
అరవై వేల పద్యాల ఆ కావ్యానికి
బంగారు నాణాలకు బదులు వెండి నాణాలను ఇవ్వబోతాడుగజినీ..
కానీ ..
కవి వానిని తిరస్కరించి..
నిరసన పూర్వకంగా రాజుకు లేఖ వ్రాసి పంపిస్తాడు
అందుకు కోపించిన గజినీ
ఫిరదౌసిని చంపమని సైనికులకు ఆఙ్ఞ ఇస్తాడు..
''అల్లా తోడని పల్కి..
నా పసిడి కావ్య ద్రవ్యంబు..
వెండితో చెల్లింపగ దొరకన్న టక్కరివి ..
నీచే పూజితుండైనచో అల్లకున్ సుఖమే..??"
అని కొన్ని పద్యాలు మసీదు గోడలపై వ్రాసి
తన కుటుంబంతో సహా వేరొక దేశానికి పారిపోతాడు ఫిరదౌసి..
అక్కడ
దుర్భర దారిద్ర్యం తో మరణిస్తాడు..
గుర్రం జాషువా ఫిరదౌసిని అద్భుతంగా చిత్రించి
ప్రజల మనసుల్లో శాశ్వతమైపోయాడు
మరి..
పుట్టపర్తి వారు
తన మేఘదూత కావ్యంలో
మేఘం తో చెప్పిన పంక్తులలోని ఫిరదౌసి ఇదిగో..