12 నవం, 2013

భాగవతం ఎలా చదవాలి ?

చీకటి పడిందంటే చాలు
ఊరిజనాలు రాత్రి భోజనాలు ముగించుకొని

 ఏ గుడిలోనో కట్టపైనో చేరేవారు
అక్కడ కథో కాలక్షేపమో జరిగేది
అందరూ శాలువాలు దుప్పట్లు గొంగడీలు కప్పుకుని కూర్చొని శ్రధ్ధగా వినేవారు
వారిలో యే పంతులో పురోహితుడో భాగవతాన్నో రామాయణాన్నో కథలు కథలుగా చెప్పేవాడు
మిగతా అందరూ ఆ క
ను వింటూ తాదాత్మ్యం చెందేవారు
అప్పుడప్పుడూ మధ్యలో వెలిగించిన ఆముదపు దీపం వత్తిని పైకెగదోసేవారు
ప్రహ్లాదోపాఖ్యానం
గజేంద్ర మోక్షం
కృష్ణలీలలు
పదే పదే విన్నా వారికి విసుగయ్యేది కాదు
ఎంత బాగుంది కదూ
టీవీలు ఇంటర్నెట్లూ సినిమాలూ సెల్ ఫోన్ లూ  లేని ప్రశాంత వాతావరణం
వీటి మత్తులో పడి ఎన్నిటినో వదిలేస్తున్నాం
మనిషికీ మనిషికీ మధ్య నిశ్శబ్దం

 మనసుకూ మనసుకూ నడుమ అవగాహనారాహిత్యం




భాగవతమును  జదువుటకు 
పాఠకుడు మనస్సుతో బాటు 
బాహ్యముగను గొంత తయారుగావలెను. 

ప్రొద్దుటినుండి రాత్రివరకు 
నింటిపనులలో గొరతలేక చక్కబెట్టుకొని 
రాత్రి భుజించి ..
పదిమంది తీరికగా కూర్చొనవలయును.
వారి గోష్టిలో మధ్య మధ్య 

లౌకిక విషయముల గొడవ నేనున్నానని ప్రవేశింపరాదు. 
నడుమ ..
ప్రమితలో నాముదము బోసి యంటించిన దీపము కొడిగట్టక యాత్మ జ్యోతివలె వెలుగుచున్నది. 
అపుడు వయసు మళ్ళిన ..
రాగద్వేషాదుల యుద్వేగము తగ్గిన యొకానొక పెద్ద నాటరాగములో..

సీ. ఒక వేయి తలలతో నుండు జగన్నాధు
బొడ్డు దమ్మిని బ్రహ్మ పుట్టె మొదల
నతనికి గుణముల నతనిబోలిన దక్షు
డగు నత్రి సంజాతుడయ్యె నత్రి
కడగంటి చూడ్కుల కలువల సంగడీ
డుదయించి విప్రుల కోషడిలకు
నమర దారాతతి నజుని పంపున నాధు
డై యుండి రాజసూయంబుచేసి
తే. బూడు లోకంబులను గెల్చి మోదకమున
జని బృహస్పతి పెగ్డ్లాము జారుమూర్తి
దార నిలుసొచ్చి కొనిపోయెతన్ను గురుడు
వేడు నందొక నయ్యింతి విడువడయ్యె..

 

యని తిన్నగ నారంభించును..
వాని చుట్టునున్న వారందరు చక్కని పాటకు 
పడగ తాడించు పాములవలె 
హాయిగ దలలాడించుచు వినుచుందురు. 
వారికి నిజముగ భాగవతర్థమైనది. 

ఆ శయ్యలోని సౌలభ్యమును ..
ఆ కథలోని హృదయమును ..
దెలియునదా పుణ్యాత్ములకే 
అంతేగాని ..
పొగగొట్టపు భూంకారధ్వనులలో ..
నానా భావ పంకులములై ..
చిల్లరంగడులబోలు మనస్సులతో ..
భాగవతమును జదివినచో ..
దాని రుచి యర్థము గాదు..
 

ప్రొద్దున లేచిన వెంటనే 
ముఖము కడుగుకొనుమాట యెట్లున్నను 
కాఫీ త్రాగుటకు మనమలతాటు పడితిమి. 

వేడివేడిగా నది కడుపులలోనికి దిగజారినప్పుడు 
కొంత బాధయే యగును 
కాని దానిని మనము గుణించుటలేదు. 
గడ్డపెరుగు వేసికొని హాయిగ చల్ది భుజించినచో కడుపులో నెంతయో చల్లగనుండునే ..
మీకీ శిక్ష యేమని ..?
వయసు మళ్ళీన ముసలమ్మలు
 మాయింటలేరు గాని -
పిల్లలను కసరించుచునే యుందురు. 
దాని చల్వను మనమూహింపగలము. కాని మనయలవాటును మార్చుకొందుమా..?
పిల్లలు మానుకొందురా ..?
 అట్లే భాగవత పఠనముగూడ..
 

ఇది మనకు చక్కగ నర్థము గాకపోయెనే యని యొక్కొకసారి యాసక్తితో జదువనారంభింతుము. 
కాని మన దురదృష్టము..
అది యెంత యర్థము గావలెనో అంత గాదు..
ఎట్లు కావలెనో అట్లు గాదు.
కారణమేమి..?
మన బ్రతుకులలో భావములలో ..

దానికి పూర్వాంగములు లేవు.

భక్తుల దాసుండ -భక్తుల లెంక