30 ఆగ, 2015

ప్రేమయననేమి

1967 ప్రాంతాల్లో 
పుట్టపర్తి కంచి పీఠం వారి 
కామకోటి  ధర్మ ప్రచార పక్ష పత్రికకు 
సంపాదకత్వం వహించారు
అందులోని ఒక అంశమిది


28 ఆగ, 2015

ఊగిసలాటలో పుట్టపర్తిఆదికవి నన్నయ కాదు..పాల్కురికి! (14-Mar-2015)


దేశీ తెలుగుకు గుడి కట్టిన సోమనాథుడిదే ఆ స్థానం
డిగ్రీ కోర్సుల్లోని తెలుగు సిలబస్‌లో సమూల మార్పులు
భాష-సాహిత్యంలో తెలంగాణ కవులకే అగ్ర పీఠం
ఈ సవరణలపై పరిశీలనకు రివ్యూ కమిటీ ఏర్పాటు
తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం
ఆంధ్ర కవుల పేర్లు పూర్తిగా తొలగింపుపై చర్చ
మరో సమావేశంలో నిర్ణయిస్తాం : వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌
హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఆది కవి నన్నయ కాదు.. పాల్కురికి సోమనాథుడని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బసవ పురాణం రచనతో దేశీ తెలుగు నుడికారానికి తొలి గుడి కట్టిన పాల్కురికి ని ప్రాచీన ఆదికవిగా గుర్తించింది. ఈమేరకు తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు బోధించే ఆధునిక తెలుగు భాష- సాహిత్యంలో మార్పులు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. శుక్రవారమిక్కడ జరిగిన మండలి సమావేశంలో ఈ అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. డిగ్రీలోని అన్ని జనరల్‌ కోర్సుల్లో సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఉన్న తెలుగు సిలబస్‌లో సమూల మార్పులు చేయాలని మండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య ఎస్‌ మల్లేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తీర్మానించింది. అదే సమయంలో తెలుగు సాహిత్యాన్ని బీఏలో ఒక సబ్జెక్టుగా ఎంచుకునేవారు చదివే సిలబస్‌లోనూ మార్పులూచేర్పులూ చేయాలని నిశ్చయించింది. డిగ్రీ తెలుగు సిలబస్‌ రివ్యూ కమిటీని ఆచార్య మల్లేశ్‌ ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
డిగ్రీ స్థాయిలో ఏ కోర్సు తీసుకునేవారికైనా సెకండ్‌ లాంగ్వేజ్‌.. తెలుగు. ఈ సబ్జెక్టు సిలబస్‌ను చివరి సారిగా 2008-09 విద్యా సంవత్సరంలో సవరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపఽథ్యంలో ఇప్పు డు తిరిగి సిలబస్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణ సంస్కృతి, ఆర్థిక, చారిత్రక అంశాలను పొందుపరచనున్నట్టు ప్రొఫెసర్‌ మల్లేశ్‌ తెలిపారు. ఈ సమయంలో ఆదికవిగా ఎవరిని పరిగణించాలనే చర్చ ముందుకొచ్చిందని చెప్పారు. నన్నయ అనువాద రచనలు చేస్తే.. పాల్కురికి సోమనాథుడు స్వతంత్ర కావ్యం రచించారని సమావేశం అభిప్రాయపడిందని చెప్పారు. కాబట్టి పాల్కురికి ని ప్రాచీన ఆదికవిగా తెలుగు పాఠ్యాంశాల్లో స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
శ్రీశ్రీ, జాషువా మాటేమిటి?
డిగ్రీ మొదటి సంవత్సరం సిలబస్‌లో ప్రాచీన కవుల రచనలు ఉన్నాయి. నన్నయ, తిక్కన, సోమనాథుడు, తరిగొండ వెంగమాంబ తదితరుల సాహిత్యాన్ని చదువుతున్నారు. ఇప్పుడిక తెలంగాణ కవుల రచనలను మాత్రమే బోధించనున్నారు. ఆఽధునిక కవుల జాబితాలో గరిమెళ్ల, శ్రీశ్రీ, జాషువా, పుట్టపర్తి నారాయణాచార్యులు తదితర మహాకవుల రచనలు ఉన్నాయి. శ్రీశ్రీ, జాషువా కవుల రచనలు సిలబస్‌లో చేర్చాల్సిన ఆవశ్యకతపై కమిటీ చర్చించింది. డిగ్రీ సెకండియర్‌లో పాలగుమ్మి పద్మరాజు, కొలకలూరి ఇనాక్‌, పొట్లపల్లి తదితరుల రచనలు ఉన్నాయి. ఆధునిక కవుల్లో కుసుమ ధర్మన్న, పింగళి, కాటూరి, కాళోజీ, అందెశ్రీ, చెల్లూరి శ్రీనివాసమూర్తి వంటివారి సాహిత్యం ఉంది. ఇందులోంచి ఆంధ్ర కవుల రచనలు తొలగించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు మల్లేశ్‌ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో తొలగించాలా లేక 80శాతం తెలంగాణ కవుల రచనలు, 20శాతం ఆంధ్ర కవుల రచనలు చేర్చాలా అనేది మరో సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోనుంది. తెలుగు భాషను మెయిన్‌ సబ్జెక్టుగా బీఏ లిటరేచర్‌ కోర్సును తీసుకునే వారికి ‘తెలుగు సాహిత్యం’ సిలబస్‌ మార్చనున్నారు. ఆంధ్ర కవుల రచనలు తొలగించి తెలంగాణ కవుల సార్వస్వతాన్ని అందించనున్నారు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో (తెలుగు సాహిత్యం) నాలుగో పేపర్‌గా ‘ఆంధ్ర భాషా చరిత్ర’ ఉంది. పూర్తిగా తొలగించి ‘తెలంగాణ భాషా చరిత్ర’గా మార్చనున్నారు.
సిలబస్‌ రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఆచార్య గోపి
మాజీ ఉప కులపతి, ప్రముఖ కవి ఆచార్య ఎన్‌ గోపిని సిలబస్‌ రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఉన్నత విద్యా మండలి నియమించింది. డిగ్రీ స్థాయి తెలుగు భాష- సాహిత్యంపై గల సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసేందుకుగాను మండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య మల్లేశ్‌ శుక్రవారమిక్కడ సిలబస్‌ రివ్యూ కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీలో సభ్యులుగా నిత్యానందరావు, గోనానాయక్‌, వెంకటేశ్వర్లు, శ్రీదేవి, కనకయ్య, బాల శ్రీనివాసమూర్తిని నియమించారు

23 ఆగ, 2015

మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu | తెలుగు పరిశోధన teluguthesis.com

మహాభారత విమర్శనము 2 Mahabharata Vimarshanam 2 | తెలుగు పరిశోధన teluguthesis.com

17 ఆగ, 2015

పుట్టపర్తి వారిని గురించి సామవేదం


ఇది పుట్టపర్తి స్వరం .. 
ఇది పదిల పరిచిన అక్కయ్యకు ఎన్ని జోతలో .. 
ఈ స్వరామృతాన్ని తనవద్ద దాచి 
మాలో  పరిపక్వత పాకానికి వచ్చిన తరువాత
 మాకు అందించిన
 శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు అన్నకు 
వేల వేల కృతజ్ఞతలు .. 
సామవేదం గారు ఎంత ఆర్ద్రంగా చెప్పారో చూడండి.. 


ఇది ఈమాట


16 ఆగ, 2015

పుట్టపర్తి వారిని గురించి ద్వానా శాస్త్రి గారు..

ద్వానా శాస్త్రి గారికి ఫోన్ చేశాను..
ఇలా పుట్టపర్తి వారిపై మీరు కొంచెం మాట్లాడాలండీ.
అని
అందుకు ఆయన నేను మా గురువు గారైన చేకూరు రామారావ్ గారి ఇంటిలో ఉన్నాను
తొమందికి గంటలకు చేయమ్మా.. అన్నారు
సరేనండీ అన్నాను సంతోషంగా..
కానీ తొమ్మిదికి వంట ఇంటిలో పని వలన ఒక అరగంట లేటైంది
మిమ్మల్ని తొమ్మిదికి కదా చేయమన్నాను..

కొంచెం పని వలన చేయలేక పోయానండీ .. 
ఇప్పుడు నేను వేరే వ్యాసం రాసుకుంటున్నాను.. 
మీరు రేపు తొమ్మిది న్నరకు చేయండి..

తప్పకుండానండీ..
గబ గబా పని చేసుకుని సరిగ్గా తొమ్మిదిన్నరకు భయపడుతూ చేశాను..
నేను టిఫెను చేస్తున్నానమ్మా 
పదిహేను నిమిషాల తరువాత చేయమ్మా..
అన్నారు
సరే.. మళ్ళీ చేసినప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఇవి..

ఆయనన్నారు..

జ్ఞానపీఠం రాలేదని పుట్టపర్తి అలా బాధపడకూడదు..
అది నాకు చాలా బాధకలిగించింది..
పుట్టపర్తి అంటే 'సత్య నిష్ట' కలవారు..
అసలైనసరస్వతీపుత్రుడు..

ఆయనలా అంటూంటే నా గుండె గొతుకలోకి వచ్చింది అంటారు చూశారా అలా అనిపించింది..
కన్నీళ్ళపర్యంత మయ్యాను అనటం మామూలు మాట.. 
ఎంత మంది హృదయాలలో పుట్టపర్తి నిలిచివున్నారు..
ఆ స్థానం ఎవ్వరూ చెరుపలేనిది..
అంటున్నారు .. 

పుట్టపర్తిని తప్పుగా అర్థం చేసుకోనే పరిస్థితులు వచ్చినా
అప్పటికి చిన్న వారైనా పుట్టపర్తిని చక్కగా అర్థం చేసుకోవడం..

అలా పుట్టపర్తి బాధ ప డడం 
చాలా మంది పుట్టపర్తి అభిమానులకు నచ్చలేదు . 
ఆ ప్రశ్నకు నిజంగానా దగ్గర జవాబు లేదు..
కృష్ణ సాక్షాత్కారంకావాలన్న పుట్టపర్తి బలమైన కాంక్ష 
పుట్టపర్తిని అన్ని బంధాలకు దూరంచేసింది..
జీవితం నుంచీ మరణం వైపు బలమైన శక్తులు తోస్తున్నాయి..
అదీ తాను జీవితాంతం తపించిన ప్రశ్న కు
 జవాబు దొరికే క్షణం..
తుది పరీక్ష  
చాలా కఠిన మైనది..
నిరంకుశమైనది..
ఆ ఒత్తిడి..
ఆ వేదన .. 
అనుభవిస్తున్న దశలో పుట్టపర్తిని 
ఈ జ్ఞాన పీఠం కుదిపేసింది 
అది ఒక శివ శ్శక్త్యా యుక్తో .. 
ఒక గజేంద్ర మోక్షం .. 
అం తే .. 


13 ఆగ, 2015

ప్రబంధ నాయికలు.. గిరిక. రూప చిత్రణ..


వీణాధనంవీణా ధనం..

రెండు మూడు తరాల క్రితం 

వీణా వాదనంలో పేరు పొందిన స్త్రీ..

వీణా షణ్ముగ వడివు.. 

వీణాధనం ..

లలితా వెంకట రామన్ 

మొదలైన వారి రికార్డులు 

సంగీత సాధకుల ఇళ్ళలో 

అతి పవిత్రంగా పూజింపబడేవి..

వీణా షణ్ముగ వడివు కుమార్తె మన M.S సుబ్బులక్ష్మి.


ఈమె రికార్డుల విని తమ సాధన చేసేవారు 


సుబ్బులక్ష్మి..రావు సరస్వతీ దేవి తదితరులు


ఆకాలంలో యేవాదనం నేర్పినా 

గాత్రం తోటే నేర్పేవారు..

''వీణాధనం పాడుతూవాయించిన రికార్డులు

మావద్దవున్నా 

అందులోపదాలుస్పష్టంగాతెలిసేవికావు..

అంటే వీణా తంత్రుల మృదు స్వనాలలో 

ఆమెకంఠం కలిసిపోయేదన్నమాట..

పైగా పరవశత్వంతో కూడిన పాటలో 

ఆ  భావ సమ్మోహనంలో 

స్వరం తంత్రీ స్వనంలో మిళితమై పోయేది..

ఇది ప్రముఖ విమర్శకుడు , 

సంగీత విశ్లేషకుడు.. అయిన 

A.V.K. రంగారావు 

రావు సరస్వతీ దేవి కుమారుడు.. 

M.S.సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా 

వ్రాసిన వ్యాసం లోని విషయాలు..

ఆ వీణా దానం గారి గురించి 

పుట్టపర్తి చెప్పిన మాట లివి ..
అతని గిరిక కిన్నెర మీట వీణె బలికింపగ నేర్చినది..

అంతమాత్రమే గాదు
గీతము వాడును
ప్రబంధము లాలపించును
మరియొకరికి ననివారిత చాతురితో జెప్పించును

ఆ గురుత్వము  నామె వల్లకితోనే యారంభించెను
అనఘ కంఠాలప్తి సౌభాగ్యములను  
వ్యాలోలాంగుళి సంజ్ఙ చే వీణెకే నేర్పించుచున్నదట..
అంటూ..

సాధారణముగా గాత్ర పాఠకులకు 
మేళము వల్లకి యీ రెండును 
ఒరవడియైన వాద్యములు
ఆ సంగతులను వారు 
కంఠములో బల్కించుటకు యత్నింతురు..

వారి గమకములు జారులు మొదలైన వాని 
నంది ఇచ్చు వాద్యములవియే 
'వీణాధనం' గారట్లు పాడుచుండెడువారని 
పెద్దలు చెప్పగా విన్నాను

వీణెలో బాడుచున్నప్పుడామె కంఠము 
వేరుగా వినిపించెడిదే గాదట..
ఆ మహా సాధనకై యామె లయ శుధ్ధిని గూడ 
త్యాగము చేసియుండెనని వినికిడి..

నాకా మె పాట విను భాగ్యము పట్టలేదు..
మరి మన గిరిక వీణెకే శృతిశుధ్ధిని నేర్పించుచున్నది రామ రాజ భుషణుని సంగీతాభిరతి 
కావ్యములలో నెచ్చట బట్టినను 
వీణా తంత్రివలె మ్రోయును..
యతి అయ్యము మొదలైన సంగీత పారిభాషికములాతడు శ్లేషగా నుపయోగించును...
ఇలా సాగిపోతుంది.. పుట్టపర్తి ధార..


7 ఆగ, 2015

పుట్టపర్తి వారి గురించి కందాడై రామానుజాచార్య..

కందాడై రామానుజాచార్య..
ధర్మ సందేహాలు.. ప్రవచనాలు..
దూరదర్శన్ తో ప్రారంభమై..
ప్రతి ఛానల్ లోనూ 
వారి సుమధుర ధారా పటిమతో 
విన్నవారి కన్నవారి ఆర్తిని సందేహాలని
 చిటికెలో మాయం చేసి 
తనదైన సరళిలో రామాయణాది ప్రవచనాలను చేస్తూ అలరిస్తున్నారు.. 
నేను వెళ్ళిన సమయంలో 
వారు అన్నమాచార్య సాహిత్యాన్ని మథిస్తున్నారు..
సమావేశానికెళ్ళలట..
కానీ అందులోనే కాస్త సమయం నాకిచ్చి తరింపజేశారు..

వారు 
పుట్టపర్తి వారి గురించి యేం చెబుతున్నారంటే..

3 ఆగ, 2015

హయగ్రీవం''మా తండ్రి గారు హయగ్రీవాన్ని సాధించారని వినికిడి..
అడిగితే 'నీకెందుకుపోరా ..'
అని మాట దాటేసేవారు..''
పుట్టపర్తి

ఇలాంటి ఎన్నో విషయాలు 
శ్రీశైలం గారి జ్ఞాపకపు పొరలలో దాగివుండేవి
అపుడపుడూ ఫోన్ చేసి 
అవీ ఇవీ మాట్లాడుతూ మాటల మధ్యలో చెప్పే వారు..

శ్రీశైలం గారు ..
మిమ్మల్ని మేం చాల మిస్ అవుతున్నాం.. 


1 ఆగ, 2015

'టుంఠణ '

thotakura plant కోసం చిత్ర ఫలితంనా చిన్ననాటి ముచ్చట..
ఎలాగు నేను ముద్దుల మూటని..
అబ్బ ఆమాట అనుకుంటే ఎంత పులకింతో..
పుట్టపర్తి నారాయణా చార్యులు

 కనకమ్మల ముద్దు ల మూటవ్వలంటే సామాన్యమా..చెప్పండి..
 

ఆ విషయానికి వస్తా..
మా ఇంటికి ఎవరు మొదటి సారి వచ్చినా 

పర్మనెంట్ అయిపోతారు..
మా అయ్య పేరు ప్రతిష్టా.. మా ఇంటికి వచ్చే పెద్ద పెద్ద వ్యక్తులూ..
ఎప్పుడూ సభలూ.. సన్మానాలు..
భాగవత పురాణం..
ఇల్లు ఎప్పుడు భక్తులు శిష్యులు.. ఇరుగు పొరుగు వారితో కిట కిట లాడుతూ వుండేది..
ఇంకో పక్క మా అమ్మ పూజలు పట్టాభిషేకాలు కీర్తనలు..
మా అయ్యను అమ్మ అనుసరించే విధానమూ..
అన్నీ కలగలిపి.
అది అరాధనో .. ఆవేశమో.. భక్తో.. వారికే తెలియదు..


మూల మూలకూ అలా కూచుని వుండేవాళ్ళు..
మంటల్లో దూకమని అదేశించినా 

సిధ్ధంగా వుండేవాళ్ళు పుట్టపర్తి శిష్యులు 
అని ప్రొద్దుటూరు సుబ్బయ్య గారు రాసారు కదా..
అలానే..


అప్పుడు విమలమ్మ అని ఒక ఫామిలీ.. 

మా ఇంటికి కొద్ది దూరంలో.

ఆమె కూ భక్తి 

వాళ్ళ  కొడుకు .. అప్పట్లో మానసిక పూజ యేమిటో చెప్పమని..
సందేహాలు అడుగు తుండేవాడు..
 

ఆ విమలమ్మ కన్నడ ఆమె..
ఆమె 'టుంఠణ' అని ఒక వంటకం చేసేది..
పేరు చిత్రంగా వుంది కదూ..
అయ్య అమ్మకు చెబితే 

అమ్మ ఆ వంట ఒకటి రెండు సార్లు చేసింది..
'టుంఠణ 'అని ఇంట్లో అందరూ నవ్వుకున్నాం..
 

ఆ టుంఠణ చేసే విధానం ఎట్టిదనిన
తోట కూర సన్నగా తరిగి 

రెండు పచ్చిమిరపకాయలతో తిరగవాత వేసి
మూత పెట్టవలెను..
పది నిమిషములలో కూర సిధ్ధం..
చల్లారిన తరువాత.. 

చిక్కటి మజ్జిగలో కలిపేయాలి అంతే..
మేం ఉల్లిపాయ వెల్లుల్లి తినం..
కావలసిన వాళ్ళు చేర్చుకోవచ్చు..
Face bookలో అందరూ వంటకాల కోసం ప్రత్యేకంగా రాస్తున్నారుకదా..
అందుకే సరదాగా..

 ఉప్పు వేసుకోవటం  మర్చిపోయ్యేరు ..