7 జూన్, 2013

వ్యాస సౌరభము






సేకరణ రామావఝ్ఝుల శ్రీశైలం గారు

''వ్యాస సౌరభము''
7 వ ఫారము పి యు సి బి ఎస్ సి విద్యార్థులకు
 పుట్టపర్తి వ్రాసిన  వ్యాసాలు ఇవి
ముద్రణ 1964
అంటే నేను రెండేండ్ల పిల్లను
మున్నుడిలో
దీనిని పుట్టపర్తి చెబుతుండగా 
గోనుకొండ వేంకటసుబ్బయ్య అనే వ్యక్తి వ్రాసారని తెలుస్తుంది
వ్రాయుట అలవాటు తప్పి పోవటానికి కారణము వయస్సు
రెండవకారణము 
మనస్సులో దినదినమును సెలవేయుచున్న విరక్తి
అప్పుడప్పుడు 
నా శిష్యులు మిత్రులు 
నా మనసు ను భౌతికముల వైపు ఈడ్తురు 
కీర్తి ధనము 
వీని విలాసములు క్షణ కాలము నా కండ్ల యెదుట మెరయును
ఇది నా దౌర్బల్యమే..
దీనిని పోగొట్టమని భగవంతుని ప్రార్థించుటకంటెను 
మరేమి చేయలేను
అంటారు..


యీ వ్యాసాలలో విద్యార్థులకు విషయం చెబుతూ
 తన జీవిత సంఘటనలనూ 
పుట్టపర్తి అక్కడక్కడా జ్ఞాపకం చేసుకొంటారు.

ధనము గురించి ..
బయటి ఊళ్ళలో తిరిగినప్పుడు 
ధనము విలువ బాగా తెలియును
చేతనున్న దానిని విరివిగా ఖర్చు పెట్టినచో 
సమయమునకు లేక దేబిరించవలసి వచ్చును కదా..
అంటారు..
కానీ చివరి వరకూ ధనము విలువ తెలియకనే 
అంతా భగవంతుని మీద వదిలి 
వాడే చూసుకుంటాడు అంటూ గడిపారు
వాడు చూసుకున్నాడో లేదో మరి