10 మే, 2014

హే మా తెరీ సూరత్ సె అలగ్ ..



హే మా తెరీ సూరత్ సె అలగ్ ..
భగవాన్ కి సూరత్ క్యా హొగీ..
బినాకా గీత్ మాలా
లో వచ్చే పాటల్లో ఒక మంచి పాట..
అప్పట్లో రేడియో ఒక్కటే వినోద సాధనం..

మా ఇంట్లో రేడియో నిషేధం
అయినా దొంగ దొంగగా వినే వాళ్ళు అక్కయ్యలు
అప్పుడప్పుడూ అమ్మా చెవుల్లో పడేవి
అమ్మా ఈపాట చూడమ్మా ఎంత బాగుందో
అంటే అవునే..
అని అమ్మా వినేది..


అప్పుడప్పుడూ
నాగక్కయ్య అమ్మా హిందీ సినిమాలకు వెళ్ళే వాళ్ళట
అప్పుడు అది పన్నెండేళ్ళది
 

శిష్యులకు అమ్మగా 
ఒక పెద్ద కవి పండితునికి భార్యగా స్థానాన్ని పోషించడం ఎంత కష్టమో
తనకంటే పెద్ద వయసున్న వాళ్ళకు అమ్మ కావాలి
అందరూ వచ్చి కాళ్ళు మొక్కుతారు
అది అమ్మకు ఇష్టం లేదు
యేదో సాధారణ జీవితం గడపాలనీ
తనను అపురూపంగా చూసుకొనే భర్త కావాలని అమ్మ మనసులో ఆశ యెమో బహుశా..
 

అసలు 
మా అమ్మకు అయ్యకూ జాతకాలు చూడనే లేదట
రామ ప్రశ్న వేశారు..
అంటే దేవుని ముందు రామాయణాన్ని పెట్టి ఒక పేజీ తీయడం కావచ్చు
 

అందులో వచ్చిన ఘట్టాన్ని బట్టి 
వారి జీవితం దైవాను సారంగా జరుగుతుందని నమ్మిక
మా అమ్మా అయ్యల పెళ్ళి కి రామ ప్రశ్న తీస్తే..
వనవాసంలో వున్న సీతారాములు వచ్చారుట..
అందుకే పాపం మా అమ్మ సీతమ్మ లాగే..
కష్టాలు పడింది
 

అమ్మకూ అయ్యకూ..
కేవలం స్నేహ బంధమే ఉందిట మానసికంగా
అందుకే ఒక ప్రియురాలిగా భార్యగా..
భర్త నుంచీ ప్రేమను..అధికారాన్నీ అందుకోలేక పోయింది
 

ఒక కొవ్వొత్తిలా పుట్టపర్తి కీర్తికి వెలుగు పట్టింది మా అమ్మ..
స్నేహ ధర్మంగా
మా అయ్య తప్పులన్నీ క్షమించి.
జీవితం చివరివరకూ నిలచి
రాలిపోయింది..

రాగపుష్పము