మా అమ్మ కనకవల్లి వ్రాసిన పాటను
మా అక్కయ్యనాగపద్మిని కూతురు
పాడుతా తీయగా బహుమతి గ్రహీత
వంశీప్రియ కేసెట్ పాడింది.
you tube అరణ్యంలో తిరుగుతుంటే
ఆ పాట ఎదురై
చల్లగా పలకరించింది.
ఒక్కసారి మా అమ్మ జ్ఞాపకాలు చుట్టుముట్టాయిమా అమ్మ పరమ తారక ముద్రతో పాటలు రాసేది..
ఆ లాలిపాటలో నరసిం హు ని మాదిరే
నేనూ మా అమ్మ ఒడిలో ముద్దులు పడుతున్న రోజులవి అమ్మ ప్రేమతప్ప యేమీ తెలియదు.
నిజంగా తల్లీ పిల్లల బంధం ఎంత బాగుంటుంది..
మా అమ్మ పక్కలో నేనూ ఈ పాటలు
అమ్మ కళ్ళలోకి సిగ్గు సిగ్గుగా చూస్తూ పాడుతున్న చిత్రాలు కన్నీళ్ళ తడిలోంచీ జారిపడ్డాయి..
మా అక్కయ్య నాగపద్మిని చెప్పినట్టు వినే మంచిపిల్ల వంశి
నీవు తాత అవ్వ పాటలు పాడాలి
అంటే అమ్మ మాట శిరసావహిస్తుంది
నో అని కానీ తర్వాత అని కానీ దాటవేయడాలు వుండవు.