కూర చిదంబరం గారు ఫోన్ చేసి
అమ్మా సరస్వతీ సంహా రంలో 119 నుంచీ 129 వరకూ పది పేజీలు లేవు అన్నారు
నేను షాకయ్యా..
ఎంతో జాగ్రత్తగా చేశాననుకున్నా..
స్కానింగ్ చేసి word లో పేజీకి రంగులూ బార్డర్లూ.. వేసి నా కలాకారీ అంతా ఉపయోగించాను
హతవిధీ..
ఇంత పెద్ద తప్పిదమా..
ఇంకా తెలియని ఎన్ని తప్పులు జరిగాయో..
మళ్ళీ ఆ పేజీలు స్కాన్ తీసి జతచేసి scribd లో పెట్టీ ఉఫ్ అనుకున్నాను..
రెండు రోజులాగిన తరువాత శ్రీశైలం గారి ఫోన్..
ఆయన ఒక మళయాళ రచయిత నంబరు సంపాదించారు..
ఆయన తెలుగు నుంచీ మళయాళానికీ.. మళయాళం నుంచీ తెలుగుకీ చాలా వర్క్స్ చేశారు..
పేరు LRS Swamy, విశాఖ వాస్తవ్యులు
రెండు రోజులాగి ఫోన్ చేశా..
ఎంత బాగా మాట్లాడారనుకున్నారు..
ఏకవీర యే సంవత్సరం ప్రింట్ అయ్యిందో తెలపండి ప్రయత్నిస్తా అన్నారు..
1955 నుంచీ 1959 మధ్య
చాలా థాంక్స్ అండీ..
అంటే మీకు నేను సంపాదించి ఇచ్చిన తరువాత థాంక్స్ చెప్పండమ్మా..
నాకు సాహిత్యమంటే అభిమానం..
పుట్టపర్తి వారంటే గౌరవం..
మీరు ఫోన్ చేశారు..
అంతకన్నా యేం కావాలి
మీ సిస్టర్ నాగ పద్మిని గారు నాకు పరిచయమే..
అన్నారు..
ఈ రోజంతా సంతోషంగా గడిచింది..
ఈ పద్యం నాకెంత ఇష్టమో ..
ఏపాద సీమ కాశీ ప్రయాగాది
పవిత్ర భూముల కన్న విమల తరము
ఏ పాద పూజ
రమా పతి చరణాబ్జ పూజల కన్నను పుణ్య తమము
ఏ పాద తీర్థము
పాప సంతాపాగ్ని ఆర్పగా గాలినామృత ఝరమో
ఏ పాద స్మరణ
నాగేంద్ర శయుని ధ్యానమ్ము కన్నను
మహానంద కరము
అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి
ఇహ పరంబుల కెదమై తపించు వారి
కావగల వారు లేరు
ఈ జగాన వేరే
నన్ను మన్నించి బ్రోవుమా అమ్మా నాన్నా