17 జులై, 2012

సాధు తత్వం..

  



అనుడు వేదవ్యాస తనయుడా అభిమన్యు జూచి
ఇట్లనియె ప్రీతి..
నరవరా నా గొప్ప విప్రుండు..
గోవింద సఖుండు కుచేలుండు 
మానధనుడు..

వేదవ్యాస కుమారుదు శుకుడు 
అభిమన్యు కుమారుడు పరీక్షిత్తునుద్దేసించి
నరవరా ..చెప్తాను విను..
 అపారమైన మానాభిమానములు కలవాడు..
 గొప్ప బ్రాహ్మణ తేజస్సు గలవాడు..
కృష్ణ సఖుడు ..
మహా భక్తుడు..
కుచేలుడు ..


 ‘యోగరతోవా భో గరతోవా!
సంగరతోవా సం గ విహీనః!
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి, నందతి నందత్యేవ!

ఒక సాధువు ఉండేవాడు..
ఆకలయ్యింది..
అడవినుంచీ బయటికి వచ్చాడు..
అక్కడా.. ఇక్కడా.. తిరిగాడు
ఏమీ దొరకలేదు.
ఒక పశువుల కొట్టం..
ఆవు కుడితి తాగింది..
ఈ సాధువు వెళ్ళి 
ఆ కుడితి నీళ్ళ అడుగున పిండి ని తీసి తిన్నాడు
అక్కడి తొట్టిలోని నీళ్ళు తాగాడు..
మళ్ళీ అడవి లోకి వెళ్ళాడు..
అదీ సాధు జీవితం..
సాధు తత్వం..

ఒక సాధువు రేపటికి దాచుకోడు..
బిక్షాటన చేసి దొరికినది తిని 
భగవన్నామంలో తరించాలి.
నరనరాన సాధుతత్వాన్ని పట్టించుకున్న అయ్య
 ఏం చేసారో తెలుసా..??

అది ఉత్తర దేశ మహాపుణ్య క్షేత్రం..
రోడ్డుపై జనాలు హడావిడిగా తిరుగుతున్నారు.
ఎక్కడి నుంచో ..
తులసీ రామాయణం వినిపిస్తూంది..
ఎవరబ్బా..
అదిగో ..
అతనెవరో కాదు..
మన సరస్వతీ పుత్రుడు..
ఎలా వున్నాడో తెలుసా..
రోడ్డు పై కూర్చుని..
నేలపై ఒక పై పంచెను పరచి..
కనులు మూసుకుని ..
చేతులు జోడించి ..
తులసీ రామాయణాన్ని ..
గాట్టిగా పాడుతున్నారు..
అటూ.. ఇటూ ..వెళుతున్న జనాలు..
నాణేలు విసురుతున్నారు..
కాస్సేపటికి ..
జమ అయిన ఆ డబ్బులు మూటకట్టుకుని
 ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళి పోయాడు..
ఏమిటిది..?
సాధు జీవితమా..??
 ఆ డబ్బులతో ఉత్తర దేశ యాత్ర
టికెట్ ఉండీ.. లేకా.. 
దొరికినది తిని.. ఏ చెట్టు కిందో పడుకుని.. 
సాధువులను కలుస్తూ.. 
 దేనిగురించో అన్వేషణ..
అక్కడ కడప లో భార్యా పిల్లలూ ..
అయిదవ తరగతి చదివిన భార్య..
ఎలా బ్రతుకుతుంది..?
భగవంతుడా..
ఏమయ్యా నీ లీలలు..??