8 అక్టో, 2011


Visalaandhra


సాహితీ స్రష్ట పుట్టపర్తి

Sun, 17 Apr 2011, IST    vvShare
పుట్టపర్తి నారాయణచార్యులు అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో 1914 సం|| మార్చి 28వ తేదీన శ్రీనివాసాచార్యులు, కొండమ్మ దంపతులకు జన్మించారు. పెనుగొండలో మూడవఫారము వరకు విద్యనభ్యసించి, ఆ తరువాత తిరుపతి సంస్కృత కళాశాలలో, తర్కవ్యాకరణాలంకారములు అభ్యసించారు. తన 12వ యేటనే, పెనుగొండ-విజయనగర సామ్రాజ్య వైభవాన్ని వర్ణిస్తూ'' పెనుగొండలకిë'' కావ్యాన్ని రచించారు.
మూడు దశాబ్దాలపాటు రాయలసీమలోని కడప, ప్రొద్దుటూరు హైస్కూళ్ళలోను, అనంత పురం కళాశాలలోనూ- ఆంధ్ర పండితులుగా పనిచేశారు. కేరళ విశ్వవిద్యాలయం వారిచే ఆహ్వానింపబడి, తిరువాన్కూరు విశ్వవిద్యా లయంలో 'ఎటిమలాజికల్‌ డిక్షనరీ'లో నాలుగేం డ్లు భాషా పరిశోధకులుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడెమీ వారి గ్రంథాలయం, న్యూఢిల్లీ లో లైబ్రేరియన్‌గా ఒక సంవత్సరం పాటు పనిచేసే సదవకాశం వారికి లభించింది. కన్నడ విజ్ఞాన సర్వస్వకార్యస్థానంలో కొంతకాలం పనిచేశారు.
పుట్టపర్తి రచించిన గ్రంథాలు నూట ఇరవైకి పైగా ఉన్నవి. వారి పద్యకావ్యాలలో పెనుగొండ లకీë, షాజీ, సిపాయి పితూరీ, సాక్షాత్కారం, పాద్యం, గాంధీజీ మహా ప్రస్థానం, పేర్కొన దగినవి. గద్యకావ్యములలో- ప్రబంధ నాయకులు, రామకృష్ణుని రచనా వైఖరి, తెలుగు తీరులు, మహాభాగవతోపన్యాసములు, విజయ నగర సామాజిక చరిత్ర, మహాభారత విమర్శ నము, వ్యాసవాల్మీకం, ప్రాకృత వ్యాసములు, ఆంధ్ర మహాకవులు మున్నగునవి పేర్కొనదగినవి. గేయకావ్యములలో అగ్నివీణ, పురోగ మనము, మేఘదూతము, శివతాండవం, పేర్కొనదగినవి.
అనువాదకులుగా కూడా పుట్టపర్తివారు కడు ప్రసిద్ధులు. వాల్మీకి రామాయణాన్ని 'రామకథ' యను పేరుతో-తెనుగు వచనముగా ప్రచురిం చారు. వ్యాస సంస్కృత భాగవతం- దశమస్కం ధాన్ని- ఆంగ్లంలోకి అనువదించారు విశ్వనాధ వారి 'ఏకవీర నవలను మళయాళంలో నికి అనువదించారు. మరాఠీ నుండి, 'స్వర్ణ పత్రము లు'- 'భగవాన్‌ బుద్ధ'- ఆంధ్రీకరణ కాబడిన కొన్నిగ్రంథాలు. కన్నడము నుండి 'సరస్వతీ సంహారం' వంటి నవలలనెన్నింటినో ఆంధ్రీకరిం చారు. హిందీలో ప్రసిద్ధమైన 'కబీరు వచనావళి'ని కేంద్ర సాహిత్య అకాడెమి వారి కోరికపై అను వదించారు. శ్రీ అరవిందుల ఆంగ్ల గ్రంథములను కొన్నింటిని ఆంధ్రీకరించారు.
ఆంగ్లంలో వారు ప్రచురించిన 'కవితా సంపుటి' ఁూవaఙవర ×అ ుష్ట్రవ ఔఱఅసఁకి- శ్రీ హరీంద్రనాధ చటోపాధ్యాయ పీఠిక వ్రాసి ప్రశంసించారు. ఃనవతీశీః అన్న ఆంగ్ల నాటకం వారికి మంచి ప్రశంసలు తెచ్చిపెట్టాయి. 'శివతాండవము' పుట్టపర్తి సాహితీ సర్వస్వమని చెప్పవచ్చును. సంగీత సాహిత్య నాట్యాసంకేతము లు సమపాళంగా మేళవించబడ్డ అమర ప్రయాగ ఆ కావ్యం. ఆధునిక సాహిత్యంలో ఇటువంటి గేయకృతి ఇంకొకటి లేనంత హాయిగా పాడారు. శ్రీ పుట్టపర్తివారిని ఉత్తమదేశికునిగా గుర్తించి 1968లో రాష్ట్రపతి అవార్డు పొందారు. 1972 సం|| పద్మశ్రీ బిరుదము ఆయనను వలచి వచ్చినది. శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ వారు, వారికి డాక్టరేట్‌ బిరుదు అందజేశారు. గజారోహణ, కనకాభిషేక, గౌరవాలు అనేకం వారు పొందారు. వీరి వైదుష్యమును, కవిత్వమును స్వయముగా గమనించిన శ్రీ స్వామి శివానంద సరస్వతులవారు 'సరస్వతీపుత్ర'- బిరుదమును ఆశీఃపురస్సరముగా అనుగ్రహించినారు. అదియే ఆనాటి నుండి వారికి అన్వర్ధ నామధేయమైనది. పుట్టపర్తి గారి సతీమణి కనకమ్మ గారు సంస్కృతాంధ్ర పండితురాలు. గొప్ప కవయిత్రి. పుట్టపర్తివారి సంస్కృతా రచనలలో శివకర్ణా మృతం పేర్కొనదగినది. పుట్టపర్తి వారి నాలుగవ కుమార్తె డా|| పుట్టపర్తి నాగపద్మిని గారు 'శివకర్ణా మృతం' కావ్యాన్ని ఆచార్య శ్రీ లక్ష్మణమూర్తి గారి ఆంధ్రానువాదంతో ప్రచురించి ఆంధ్రుల ప్రశంసలు చూరగొన్నారు. ఇంకా 'మల్లిఖార్జున సుప్రభాతం' 'త్యాగరాజ సుప్రభాతం' సంస్కృత రచనల్లో పేర్కొనదగినవి.ఇటీవల డా|| పుట్టపర్తి నాగపద్మిని గారు రచించిన 'భాషాపరశేషభోగి'- ''పుట్టపర్తి''- అన్న పుట్టపర్తి వారి జీవిత- సాహిత్యాల సమీక్షను- హైదరాబాద్‌లోని సి.పి.బ్రౌన్‌ అకాడమీ వారు ప్రచురించారు.ఆధునికాంధ్ర సాహిత్యాకాశంలో పుట్టపర్తివారు ఒక ధృవతార. శతాధిక రచయిత, మహాకవి. ఆరుద్రగారన్నట్లు ''రాయలసీమలోని రాళ్ళను చీల్చుకొని వచ్చిన మహాసాహితీ వటవృక్షం'', వారు. ఆ మాటలు అక్షరాలా నిజం!!
- రామవఝల శ్రీశైలం

మార్చిన వార్తా విశేషాలు - శని వారం అక్టోబర్    08th 2011 - 5:33 PM


సాహిత్య జ్ఞాపకాలు
ఆది వారం, సెప్టెంబర్ 13, 2009 , 12:38 [IST]
డాII గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి

సుప్రసిద్ధ కవి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 1948-56 సంవత్సరాల మధ్యకాలంలో బాల్య కౌమార దశలో ఉన్నారు. శతాంకురాను నిర్మించిన ఈ సాహితీ ప్రముఖుడి సారస్వత అంకుర దశ ఆ కాలంలోనే కనిపిస్తుంది. నాటి ఎనిమిదేళ్ళ కీలకమైన సంధి సమయంలో సుప్రసన్న యాది ఇది.

నా బాల్యంలో పగటిపూట రజాకార్ల దారుణ చర్యల్ని రాత్రివేళల్లో కమ్యూనిస్టుల హింసాత్మక అధ్యాయాలను చూశాను. రెండు రకాలైన హింసో న్మాదాల మధ్య ఆనాటి నా అనుభవాలు గడిచాయి. అదొక ఉద్రిక్తమయమైన సమయం. అప్పటికి నేను ఐదవ తరగతిలో ఉన్నాను. కల్లెడలో సంపన్న భూస్వామి మెర్రబెల్లి వెంకటేశ్వరరావుకు మా కుటుంబంపట్ల గౌరవం ఉండేది. మేము వరంగల్లు నుండి కల్లెడకు తరలి పోయాము. మా తాతగారు కోయిల్‌ కందాడై రంగాచార్యులు, గొప్ప పండితులు. పౌరాణికులుగా ఆయనకు గొప్ప పేరు ఉండేది. నేను ఆయనతో కలసి ఉండేవాడిని. ఆయన నన్ను ఎంతో ప్రేమతో చూసుకునేవారు. కల్లెడలో ప్రతాపురం రాఘవాచారి అనే ఆయన ఖాన్గీ (ప్రైవేటు) పాఠశాలపెట్టి నడిపేవారు. కవిత్వంపై కూడా చర్చలు జరిగేవి. కల్లెడలో ఉన్న రోజుల్లోనే సంపత్కు మారాచార్యతోకలిసి ''అంగదవిజయం అనే రచన చేశాను. రజాకార్లు, కమ్యూనిస్టులు కల్లెడ గ్రామంలోకే వచ్చేశారు. తిరిగి వరంగల్లు వచ్చాము. పరిస్థితులుచూసి బెజవాడ తరలి వెళ్ళాము. కట్టు బట్టలతో కదలిపోయాము. తిరిగి వరంగల్‌ వస్తామనుకోలేదు. ఇదీ ఆనాటి (1948 కి కొంచెంముందు) పరిస్థితి.
 మా తాతగారికి విజయవాడలోనూ విస్తారమైన శిష్యరికం ఉండేది.

అక్కడ కొత్తగుడి ప్రాంతంలో ఉండేవాళ్ళం. తాతగారు తిరిగి వరంగల్లు చూస్తాననుకోలేదు. వరంగల్లు శిస్యులు మా తాతగారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. '''వరంగల్లులో నా వస్తువులేవీ నాకు వద్దు, వాటిపైనాకు పెద్దగా ఆశలేదు, నేను దాచుకున్న పుస్తకాలు పంపించండి- చాలు అని మా తాతగారు శిష్యులకు కబురుపెట్టారు. శిష్యులాయన పుస్తకాల్ని బూరుగు చెక్కపెట్టెల్లో పెట్టి బెజవాడకు పంపించారు. బెజవాడ లోని మున్సిపల్‌ హైస్కూల్‌లో మొదటి ఫారంలో చేరాను. మా బాబాయి సంపత్కు మారాచార్యులవారు రేపల్లెలో చదువుకునేవారు.
బెజవాడలో జీవితం పలువురు ప్రహుఖ సాహితీవేత్తల రచనలతో నాకు పరిచయాన్ని పెంచింది. చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి ఆ రోజుల్లో బెజవాడలోనే ఉండేవారు. విశ్వనాథ సత్యనారాయణ, గుడిపాటి వెంకటాచలం రచనలతో నాకు అపుడే పరిచయం అయ్యింది. మున్సిపల్‌ హైస్కూల్‌లో కారుమంచి కొండలరావు అనే గొప్ప ఉపాద్యాయుడు ఉండేవారు. తర్వాత ఆయన వరంగల్లులోనూ పనిచేశారు. వరంగల్లునుండి బెజవాడవచ్చేసరికి నా భాషలో మార్పుకనిపించింది.

బెజవాడలో బాగా కష్టపడ్డాం. రెండుమూడు ఇళ్ళు మారాము. కన్యకాపరమేశ్వరి ఆలయ  సత్రంలో ఉచిత వసతి దొరికింది. బెజవాడ జ్ఞాపకాల్లో తెెలంగాణ తాలూకు కొన్ని అపూర్వమైన సాంస్కతిక స్మతులున్నాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ అతి విశిష్టమైన ఉత్సవం. ఆనాటి కల్లోల కాలంలో వరంగల్లు నుండి బెజవాడకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తరలి వచ్చిన కుటుంబాల్లోని మహిళలు- బెజవాడలోనూ బతుకమ్మ పండుగ జరిపారు. బతుకమ్మల్ని పేర్చి బెజవాడ కష్ణా నదిలో నిమజ్జనం చేశారు.  ఇది నా జీవితంలో ఏనాటికీ మరచిపో(లే)ని సాంస్కతిక స్మతి.

తిరిగి మరోమారు తెలంగాణ జ్ఞాపల్లోకి వస్తాను. ఆనాటి వరంగల్లు హిందూ సమాజాన్ని ఆర్యసమాజం సంరక్షించింది. ఆర్యసమాజీయులు వీరోచితంగా వ్యవహరించారు. వరంగల్లు నగరంలో సనాతన ధర్మీయులు అనే మరో వర్ణం కూడా ఉండేది. వీరు ఆర్యసమాజీయుల ఆధునిక భావాలను వ్యతిరేకించే వారు. ఉభయ వర్గాల మధ్య స్పర్థలు ఉండేవి, అయితే అవి తీవ్రమైన సంఘర్షణల స్థాయికి చేరలేదు. హైదరాబాద్‌ సంస్థానంపై పోలీసు చర్య జరిగింది. ఆ ఏడాది అందరూ ఎంతో ఆనందంతో దీపావళి ఉత్సవాలు జరిపారు. పోలీసు చర్య అనంతరం మా కుటుంబం వరంగల్లు చేరుకున్నది. వరంగల్లులో ఆరోజుల్లో ఎ.వి.ఎస్‌ (ఆంధ్ర విద్యాభివర్థినీ పాఠశాల) చాలా ప్రసిద్ధిపొందింది. నేను మూడవ తరగతి అక్కడే చదువుకున్నాను. జాతీయోద్యమ నేపథ్యంలో ఆరంభమైన ఎ.వి.ఎస్‌.కు  ఎంతో గొప్ప చరిత్ర ఉంది.

వరంగల్లు నగర ప్రజా జీవన రంగంలో ప్రముఖులైన భండారు చంద్రమౌళీశ్వరరావు, ఎం.ఎస్‌. రాజలింగంతో పాటు ప్రసిద్ధ మేధావి పాములపర్తి సదాశివరావుకూడా ఈ పాఠశాలలో పనిచేశారు. 1949లో వై.కె. శాస్త్రి అనే ఆయన ప్రదానోపాద్యా యులుగా ఆ పాఠశాలకు వచ్చారు. ఆయన పూర్తిపేరు యద్దనపూడి కోదండరామ శాస్త్రి నెల్లూరు జిల్లావారు. హరిరాధాకష్ణమూర్తి అదే పాఠశాలలో పనిచేశారు. స్కూలు చరిత్రలో మేము చదువుకున్నకాలం స్వర్ణయుగం. మా పాఠశాలకు ఎందరో కవుల్ని, విద్వాంసుల్ని  ఆహ్వానించారు. విశ్వనాథ సత్యనారా యణ, సరిపల్లి విశ్వనాథ శాస్త్రి వంటి విఖ్యాత పండితతులు మా స్కూల్లో అద్భుతమైన ప్రసంగాలు చేశారు. పసివారికి సైతం తెలుగు భాషా సాహిత్యాలపట్ల ఆసక్తిపెరిగేందుకు ఈ వాతావరణం తోడ్పడింది. 1948-51 సంవత్పరాల మధ్య నాలో సాహిత్యాభిరుచులు అంకురించాయి.

మా బాబాయి సంపత్కుమారాచార్య సరికొత్త సాహిత్య ప్రపంచాన్ని చూపించారు. ఆయన ఆ కాలంలో బందరు సమీపం లోని చిట్టి గూడూరు విద్యాసంస్థలో చదువుకునేవారు. మట్టివాడలోని శీబ్దానుశాసన గ్రంథాలయం నా సాహిత్య పరిచయాన్ని బాగా పెంచింది. ఠంమాల రంగాచార్యుల వారనే పండితుడు పద్యకవిత్వాన్ని విడమరచి బోధించారు. నంది తిమ్మన్న, పారిజాతాపహరణం, కరుణశ్రీ, ఉదయశ్రీ కావ్యాల పరిచయం, మంధరం (రామాయణంలో భాగం) రంగాచార్యుల వారే బోధించారు. వాటిని బాగా అర్థంచేయించారు. వేయిపడగలు నవలను పరిచయం చేశారు. నాలో పద్యసంస్కారం వికసించింది. ప్రముఖ పరిశోధకులు దూపాటి రమణాచార్యుల వారు ఆరోజుల్లో వరంగల్లులో ఉండేవారు. ఆయన అప్పటికే ఉద్యోగ విరమణ పొందారు. ఆయనొక ఆర్ద్రమైన కవి. నాలో ఎదిగిన పద్యసంస్కారం మరింత వికసించేందుకు దూపాటివారు స్ఫూర్తినిచ్చారు. ఇదంతా నేను 6-8 తరగతులు చదువుతున్నప్పటిది. విశ్వనాథవారిని గురించి 1950లో బాగా తెలిసింది.

1951లో వరంగల్లు ఆంధ్రసారస్వత పరిషత్తు శాఖ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు విశ్వనాథ విచ్చేశారు. మూడునాలుగు రోజుల పాటు ఆయనతో సన్నిహితంగా ఉండే అవకాశం కలిగింది. విశ్వనాథ సోదరులు వేంకటేశ్వర్లు ఇక్కడ పనిచేశారు. 1952-53 సంవత్సరాల్లో నేను ఆయన దగ్గర చదువుకున్నాను. 1950ల ఆరంభంలో వరంగల్లునుండి రెండు పత్రికలు ప్రముఖంగా వచ్చేవి. అందులో ఒకటి కాకతీయ, పామలపర్తి సదాశివరావు, పి.వి.నరసింహారావు  కాకతీయ నిర్వహించారు. మరో పత్రిక 'ప్రగతి. ఇది భండారు చంద్ర మౌళీశ్వరరావు నిర్వహణలో వెలువడింది. ఈ రెండు పత్రికలకు  రచనలు పంపేవాడిని. ఆరోజుల్లో వరంగల్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు శాఖ ఎంతో వైభవంతో నడిచింది.

వరంగల్లులో ఇంటర్మీడియట్‌ కళాశాల ఉండేది. (ఆనాటి నిజాం రాష్ట్రంలోని నాలుగు ఇంటర్మీడియట్‌ కాలేజీల్లో ఇదిఒకటి) ప్రసిద్ధ పండితులు చలమచర్ల రంగాచార్యులు, ప్రముఖ సంస్కత విద్వాంసులు ప్రమోద గణేశలాలే ఆ రోజుల్లో మా అద్యాపకులు. లాలే అద్భుతమైన వ్యక్తి! 1955లో ''సాహితీ బంధు అవతరించింది. నేను, పేర్వారం జగన్నాథం, చతుర్వేదుల నారాయణరావు ఇందులో  చురుకైన పాత్ర పోషించాము.

తెలంగాణ రచయితల సంఘం రెండవ మహాసభలు జనగాములో జరిగాయి. దాశరథి, కాళోజీ, పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి ప్రసిద్ధులు సభల్లో పాల్గొన్నారు. వి.పి.రాఘవా చార్యులు చక్కగా ఈ సభల్ని నిర్వహించారు. ఈ సభల్లోనే ''ఉదయఘం టలు కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.

1948 - 56 సంవత్పరాల మధ్య జ్ఞాపకాల్లో మా ''సాహితీ బంధు బందం ప్రముఖఘట్టం. సంస్థకు నేను వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నాను. విశ్వనాథ సత్యనారాయణ మా సంస్థను ప్రారంభించారు. 1955లో బమ్మెర పోతన ఉత్సవాలు జరిగాయి. నాటి లోకసభ డిప్యూటీ స్పీకర్‌ అనంత శయనం అయ్యంగార్‌ ఈ ఉత్సవాలకు విచ్చేశారు.

యాభై అరవై సంవత్సరాల తర్వాత కూడా ఆనాటి స్మతి పరిమళాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. అవి వరదలుగా పొంగివస్తున్నాయి. 1948-56 సంవత్స రాల సందిగ్ధ సందర్భంలో తెలంగాణ సాంస్కతిక అంతరంగపు వర్ణ చిత్రాలు ఇంకా అనావిష్కతంగానే ఉన్నాయి. ఈ వర్ణ చిత్రాలు వెలుగు చూడాలి. ఆ వర్ణ చిత్రాలకు బాష్యాలు కూడా రావాలి.
 

pi
Jul 13 



PIRATLA VENKATESWARU BLOG


1) సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక సభావేదికమీద తన పక్కనే కూర్చొన్న కథా రచయితతో ”ఏమప్పా! ఇన్నాళ్లుగా కథలు రాస్తున్నావుగదా? ఎంత సంపాదించావు?” అని ప్రశ్నిస్తే దానికి ఆ కథా రచయిత ”పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం” అన్న సమాధానం ఇచ్చినట్లు చదువుతుంటాం. ఆ కథా రచయతని ”చిత్తూరు అయ్యవారు” అని కూడా అంటారు. ఎవరాయన?


సమాధానాలు
1) మధురాంతకం రాజారాం






మూడు లాంతర్లు - 5

అయోవా రైటర్స్ వర్క్‌షాప్ (Iowa Writers Workshop) ఒక సారస్వత పాఠశాల. డెబ్భయ్యైదేళ్ళుగా కాల్పనిక సృజనను ప్రేమించి, సాధన చేసే విద్యార్ధులు, సృజనకారులకు ఆటపట్టుగా ఉన్నాది. అక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు స్వయంగా సృజనకారులు. వాళ్ళు ఇంటర్వ్యూల వంటి వాటిలో చెప్పుకున్న సంగతుల్ని పరిశీలిస్తే సృజనను వాళ్ళు ఎంత శ్రద్ధతో, పట్టుదలగా నిర్వహించుకుంటారో, అర్ధం చేసుకోటానికీ, అందిపుచ్చుకోటానికీ ఎంతగా పరితపిస్తారో తెలుస్తుంది. అక్కడ ప్రవేశం దొరకటం, దొరికినా ఉత్తీర్ణులై బయటపడటం చాల కష్టమట. ఆ విద్యార్ధులు సృజనకారులుగా సఫలం కాలేకపోతే అప్పుడు ఇతర రంగాల్లోకి లాయర్లు, డాక్టర్లు ఇలాక్కూడా వెళ్ళిన సందర్భాలున్నాయట. అక్కడి చదువు చాల ఖర్చుతో కూడుకున్న పని. అది పాఠశాల అని పేరేగాని సృజనను బోధించగలిగింది తక్కువని, అక్కడ కల్పించిన వాతావరణం, చేరిన మనుషులే ఒక పరంపరగా సారస్వత సృజనను పట్టుదలగా అభ్యాసం చేసి అవగతం చేసుకొనేందుకు అవకాశాలనీ, చెప్పుకుంటారు. విశ్వవిద్యాలయాల్లో మామూలుగా ఉండే ఇంగ్లీష్ విభాగాలు భాష, సాహిత్యం, విమర్శ, సంస్కృతి వంటి విషయాలమీద చేసే పనికీ, నిర్వహణకూ భిన్నంగా కేవలం కాల్పనిక సృజన ఒక్కటే పాఠ్యాంశంగా, లక్ష్యంగా ఉన్న ఇలాంటి పాఠశాలలు బెనింగ్‌టన్ కాలేజీ (The Bennington writing seminars) అనీ, ఇంకా వర్జీనియా యూనివర్సిటీ (Creative writing program) వంటి చోట్ల ఇంకొన్ని మాత్రం ఉన్నాయి.
ఇలాంటి చోట్లకి వేలాది మంది చాల ఆత్రంగా రచయితలు కావాలని వెళితే వాళ్ళలో ఏ కొద్దిమందో రచయితలుగా నిలదొక్కుకోగలుగుతారు. అయినప్పటికీ సారస్వత విద్యార్ధులు సృజనను అభ్యాసం చెయ్యటానికీ, ప్రకటించుకోడానికీ ప్రయత్నాలు మానుకోరు. ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్ధుల్ని కవ్వించి, దండించి, ప్రోత్సహించి, అవమానించీ బోధించే పద్ధతులు కూడా కధలు కధలు చిత్రంగా ఉంటాయి. సృజనని బోధించే పనిలో వాళ్ళది ఒకొక్కరిదీ ఒక్కో తోవ గాని వాళ్ళ ధ్యాస, శ్రమా అన్నీ సృజన మీదే! మచ్చుకి ఒకటి, ఎల్కిన్ (Stanley L. Elkin) అని నవలా రచయిత, స్వయంగా ఉపాధ్యాయుడు చెప్పిన కధ ఉంది. ఎల్కిన్ గురువు రాన్డాల్జారెల్ (Randall Jarrell) అనే కవి ఆయన చదువుకుంటున్న యూనివర్శిటీకి కొన్ని నెలలు సారస్వత పాఠాలు చెప్పడానికి వచ్చేడు. ఏ పాఠమూ చెప్పకుండా రోజూ చెహోవ్ (Anton Chekhov) కధలు మాత్రం చదివిస్తున్నాడు. విద్యార్ధులు ఒక్కొక్కర్నీ ఒక కధ రాసుకొని తెచ్చిమ్మన్నాడు. ఎల్కిన్ కధల్ని దిద్ది ఉంచిన ప్రతిని ఇవ్వడానికి ఒకరోజు పొద్దున్నే రమ్మన్నాడు. తీరా చెప్పిన సమయానికి వెళ్తే ఆఫీసులో లేకుండా ఇంట్లో పడుకుని ఉన్నాడు. ఎల్కిన్ ఫోన్ చేస్తే నిద్రలేచి అప్పటికప్పుడు ఆ నిద్దరమొఖంతోనే కార్లో వచ్చి అతన్ని కూడా ఎక్కించుకొని, అతను రాసిన రెండు కధల దిద్దిన ప్రతుల్ని చేతిలో పెట్టేడు. ఆ కధల్లో ప్రతి పేజీలో ఎక్కడెక్కడ ఏమేం లోపాలున్నాయో అవన్నీ ఆయనకి బొమ్మ కట్టినట్టు గుర్తున్నాయి. అవి ఒకొక్కటీ పేజీలు తిప్పమంటూ ఎక్కడెక్కడ ఏమేం బాగులేదో అన్ని వివరాలూ చదివి చెప్తున్నట్టే జ్ఞాపకం తెచ్చుకొని ఒక గంటసేపు ఊరంతా కారు నడుపుతూనే అతనికి విమర్శ చేసి చెప్పేడు. ఆయన తన కధల్ని అలా చీల్చి చెండాడుతుంటే ఎల్కిన్ ఏం మాట్లాడకుండా వింటూ కూర్చున్నాడు. ఆయన ఒక గంట తరవాత ఎల్కిన్‌ని మళ్ళీ బయల్దేరినచోటే దించి ఇంటికెళిపోయేడు. చివరికి పాతికమంది విద్యార్ధుల్లో ఆయన ఒక్క ఎల్కిన్‌కి, ఇంకొకరికీ మాత్రమే A గ్రేడ్ ఇచ్చేడు. ఆయన వెళ్ళేముందు ఎల్కిన్ మళ్లీ వెళ్ళి ‘ఈ కధ ప్రచురిస్తే బావుంటుందా?’ అని అడిగితే ఆయన “I don’t know.” అన్నాడు. ఎల్కిన్ ఈనాటికీ తన విద్యార్ధులెవరైనా తమ రచనల్ని గురించి అవి ప్రచురించుకోవచ్చా అనడిగితే అతను ఈ కధ చెప్తాడట.
ఇలాంటి పాఠశాలల నిర్వహణను చూస్తే, చెప్పేవి వింటే వాళ్ళు సృజనని ఒక నిగూఢమైన సంపద లాగ, పరిశ్రమించి తవ్వి తవ్వి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ పోగా ఎప్పుడైనా అరుదుగా చేతికి చిక్కే నిధిలా చూస్తున్నారనిపిస్తుంది. ఐనా సరే తమ సమయాన్నీ, శక్తినీ సృజన కోసమే సంతోషంగా వెచ్చిస్తున్నారు. అదే వాళ్ళకి సంతోషం; అంతకంటే ఎక్కువగా ఒక తప్పనిసరైన ప్రవృత్తి. జాన్ ఇర్వింగ్(John Irving) అని ఆయన, చదువుకుని, ఏవో పదవులు అందుకుని కూడా ఉన్న సమయమంతా ఒక్క రాయడానికే వెచ్చించాలి అని అన్ని పన్లూ ఒదులుకున్నాడు. ఇలా సృజన తీవ్రమైన, నైసర్గికమైన స్వభావంగా ఉన్నవాళ్ళే అక్కడ చేరుతారు. అలాంటివాళ్ళు చెప్పే సూక్ష్మమైన విషయాలు (insights) ఇక్కడ చాల పనికొస్తాయి. సుమారు నలభై సంవత్సరాల క్రితం, అంతకు ముందూ మనకి కూడా ఇలాటి సృజనకారుల వ్యవస్థలుండేవని చూచాయగా తెలుస్తుంది. గడియారం రామక్రిష్ణ శర్మగారికి చదువుకోవాలనుండేదిగాని స్థోమత లేదు. ఆయన గురువు గారి కోసం వెతుక్కొని వేలూరి శివరామ శాస్త్రిగారి పంచన చేరిన సంగతులు శతపత్రము అని ఆత్మకధలో రామక్రిష్ణ శర్మ చెప్పుకుంటున్నారు. ఉపాధ్యాయునిగా శివరామ శాస్త్రిగారి మూర్తిమత్వం చాల కదిలిస్తుంది. కవిగా, సృజనకారునిగా శివరామ శాస్త్రిగారిది చాల అపురూపమైన ప్రతిభ అని, అంతటి ప్రతిభనూ మించి ఆయన కరుణార్ద్ర హృదయుడనీ ఆయన రాసినవి - దొరికిన కొన్నీ చదివినా అవగతమౌతుంది. ఆయన మహా పండితుడట, ఫ్రెంచ్, సంస్కృతం భాషల్లో విశేషమైన అధికారం ఉన్నవారట. ఆయన వస్తుంటే గొప్ప కవులని పెరుమోసినవాళ్లు సైతం భక్తితో, కొంత భయంతో పక్కకు తప్పుకొనేవారట. ఇవి నారాయణరావుగారు నాకు చెప్పిన సంగతులు. ఈమాట సంపాదకులు వెంకటేశ్వర రావుగారికి ఆయన చిన్నతాతగారట. ఆయన తన స్వంత ఖర్చుతో ఏలూరు దగ్గర సూరవరంలో మామిడితోటలో సారస్వత పాఠశాలను నిర్వహించేవారట. అక్కడ పాఠమే కాదు, భోజనం, బస, బట్టలు అన్నీ ఉచితం. పాఠం నేర్చుకునేవాళ్ళ కులాలు పట్టింపు లేదు. రామక్రిష్ణ శర్మ గారు చెప్తున్నారు:
“మా గురుదేవుల వ్యక్తిత్వం చాలా గొప్పది. విశిష్టమైనది. ఆగర్భ శ్రీమంతులైనా నిరాడంబరులు. దార్శనిక పండితులైనా నిరహంకారులు. మాన్యులను సామాన్యులను సమానంగా చూసే ఉదాత్తవర్తనులు. శిష్యవత్సలులు. వారిని గూర్చి ఎంతరాసినా తక్కువే. నాకు వారి సన్నిధిలో విద్యనభ్యసించే అదృష్టం లేదు. హతవిధి లసితానాం హీ విచిత్రో విపాకః అనే మాఘ శ్లోకాన్ని తలచుకుంటూ ప్రయాణమయ్యాను.” అని. శివరామ శాస్త్రిగారికి పిల్లల్లేరట. ఆయన చివరి రోజుల్లో తనకున్నది ఊళ్ళో దళితులకి రాసిచ్చి పోయేరట. ఆయన సృజనలు అగ్ని ప్రమాదంలో తగలబడి, పోయినవి పోయేయట. వెతికినా ఏమీ దొరకవు.
ఇలాంటి పాతకాలపు పాఠశాలల్లో విద్యార్ధులకి పాఠం, బస, భోజనం అన్నీ అక్కడే. వాళ్ళ పాఠం, పరీక్ష, యోగ్యతా పత్రాలూ అన్నీ కాయితంతో పని లేకుండా మౌఖికమైనవే, కాని చాల నాణ్యమైనవి. దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు తాతా రాయుడు శాస్త్రిగార్ని గురించి, ఆయన పాఠశాలను గురించీ ఇలాగే కృతజ్ఞతతో చెప్పుకున్నారు. త్రిపుర బెనారస్ విశ్వవిద్యాలయంలో సైన్స్ చదవటానికి వెళ్ళి, సగంలో ఆపీసి ఇంగ్లీష్ సాహిత్యం చదువుకోడానికి వెళ్ళిన సంగతులు, ఆయన ప్రొఫెసర్లు పాఠాలు చెప్పే పద్ధతుల్ని గురించి ఆ సంగతులూ కధలు కధలుగా చెప్పేవారు. ఆయన అధ్యాపకుల్లో ఒకరు గొప్ప ప్రతిభావంతుడు, గుడ్డివాడు. దృష్టిలోపం ఆయన పాండిత్యానికీ, అధ్యాపకత్వానికీ ఏమాత్రం అడ్డు రాలేదు. ఇంగ్లీష్ సాహిత్యాన్ని వేరొకరు చదివి చెప్తుంటే విని అనర్గళంగా పాఠం చేసి చెప్పేవారట. త్యాగపూరితమైన బాధ్యతల్ని సంతోషంగా తలకెత్తుకోవడంలో ఆ గురువుల ఆంతర్యం ఏమయి ఉంటుంది? బోధన సృజనకారుల వ్యక్తిత్వాల్లో ఒక పార్శ్వంగా ఉండటం సర్వ సాధారణం. చేరదీసి పాఠం చెప్పటం, నేర్చుకుంటే చూసి సంతోషించటం వాళ్ళ స్వభావమని తోస్తుంది.

8.

ఇప్పుడు వీస్తున్న గాలి అని నాలుగేళ్ళ కిందట sify.comలో వరుసగా వచ్చింది. చాలా మంది సృజనకారుల గురించి రేఖామాత్రమైన వ్యాఖ్యల్లాగ. ఈ రచయితల్లో రకరకాల ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్నవాళ్ళు, చాల భిన్నమైన నేపధ్యాల్నుండి వచ్చినవాళ్ళూ ఉన్నారు. ఆ చిత్రాలు చదివితే సృజనతో వాళ్ళది అవినాభావ సంబంధమని బోధపడుతుంది.
ద్విధా భజ్యేయమప్యేవమ్ న నమేయమ్ తు కస్యచిత్|
ఏషా మే సహజో దోష: స్వభావో దురతిక్రమః ||
వాల్మీకి రామాయణం లోనిది ఈ శ్లోకం - నేను రెండు ముక్కలైపోయినా సరే గాని ఎంతమాత్రం వంగను సుమా! ఇది నాకు సహజంగా వచ్చిన దోషం. స్వభావాన్ని కాదని బతకడం ఎవరి తరం? అని దీని భావం. దేశ దేశాల్లోని సృజనకారుల చరిత్రలు చదివితే వాళ్ళ స్వభావమే ఈ తీరు అని తోస్తుంది. ఆబ్రహం మాస్లో(Abraham Maslow) అని మనస్తత్వ శాస్త్రజ్ఞుడు. మనుషుల ప్రవర్తనల వెనుక చోదక శక్తుల్ని గురించి పరిశోధించి ఆయన A Theory of Human Motivation అని ప్రతిపాదించినది సృజనశీలి స్వభావాన్ని విశదం చేసే ప్రయత్నం చేస్తుంది. మనుషులందరికీ అవసరాలు (Needs) అనేకం ఉన్నాయనీ, ఇవి ఒక క్రమానుసారం తీర్చుకోవటం అనివార్యమనీ ఆయన ప్రతిపాదించేడు. ముందు ప్రాధమికం, జాంతవమైన అవసరాలు - గాలి, నీళ్ళు, తిండి, నిద్ర ఇలాంటివి; ఇవి తీరేక ఆరోగ్యం, భద్రత; ఆపైన కుటుంబం, సంఘం, స్నేహాలు, సంబంధాలు; ఆపైన పరువు, ప్రతిష్ట, ఇతరుల నుండి మన్నన, గౌరవం; అవి తీరేక అప్పుడు తమకు సహజంగా అబ్బిన ప్రతిభా పాటవాల్ని అభ్యాసం చేసి వెలికితెచ్చుకోవలసిన అవసరం - ఇలాగ. ఈ చివరిదాన్ని ఆయన Self-actualization Needs అని ప్రతిపాదించేరు. ఇవి ముఖ్యంగా సృజనశీలతకు సంబంధించిన అవసరాలు. మనిషి ఏమేం కావటానికి అతని సహజమైన స్వభావంలో అవకాశం ఉందో అతను అవన్నీ అయ్యే తీరాలి (”What a man can be, he must be. It is a tendency to become actualized in what he is potentially. …the desire to become more and more of what one is, to become everything one is capable of becoming.”) భేతాళ కధల్లో ‘ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పకుండా మౌనం వహించావో, నీ తల వెయ్యి చెక్కలవుతుంది’ అని శపించినట్లుగా ఉంటుంది సృజనశీలికి మాస్లో హెచ్చరిక: నీకున్న పాటవాన్నంతట్నీ నీ వ్యక్తిత్వంలో వ్యక్తీకరించుకోకుండా దాచిపెట్టుకుంటే జీవితాంతం దుఃఖపడతావు (”If you deliberately set out to be less than you are capable, you’ll be unhappy for the rest of your life.”); తనతో తాను సమాధానం పడాలంటే మనిషి గాయకుడైతే పాడేతీరాలి, కవైతే కవిత్వం కట్టే తీరాలి (”A musician must make music, an artist must write, if he is to be ultimately at peace with himself. What a man can be, he must be.”) “బుద్ధిగా, హాయిగా రాసుకో!” అని నారాయణ రావుగారు; “రాస్తేనే మంచిదివై! రాసేస్తే గాని లోపలేముందో తెలీదు కదవై! రాసేస్తేనే కదా - It comes out. That is healthy!” అని త్రిపుర.
మాస్లో అవసరాల పట్టికలోని అనుక్రమం (hierarchy of needs) సృజనల్లో రాజీ, ‘జూటా’ ఎలా ప్రవేశిస్తాయో సూచిస్తుంది. ముందుగా దిగువనున్న అవసరాలు తీర్చుకొనే తీరాలి. లేదంటే పై అవసరాలు జ్ఞప్తికి రావు అని ఆయన సిద్ధాంతం. ఈ అవసరాల్లో ఆకలి, భద్రత, స్నేహం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ సృజన కంటే ముందున్నాయి. సర్వ సాధారణంగా ముందు అవన్నీ పూర్తిగా, సంతృప్తిగా తీరిన తరువాతే సృజన అవసరం ముందుకొస్తుందని ఆయన అనేకమందిని పరిశీలించి చేసిన నిర్ధారణ. అయితే కొద్దిమందిలో మాత్రం వాళ్ళ స్వభావాలు ఈ నియమాన్ని అతిక్రమించడం ఉంది. ఉదాహరణకు కొద్దిమంది మనుషులకి ప్రేమ, అభిమానం కంటే కీర్తి, ప్రతిష్ట (respect of others, achievement, self-esteem) ఎక్కువ ముఖ్యం. అలాగే ఇంకొద్దిమందిలో సృజనశీలత ప్రబలంగా ఉండి, మిగిలిన అవసరాలని ధిక్కరించి ప్రస్ఫుటమౌతుందని ఆయనే చెప్పుకున్నారు. మర్యాద సృజనకు ఎందుకు అడ్డం వస్తుందో మాస్లో సిద్ధాంతంలో కొంత వరకు గోచరమౌతుంది. జీవిక కోసం, సంపాదన కోసం తమ కాల్పనిక శక్తిని అసంతృప్తికరంగానే అయినా రక రకాల వ్యాపారాలకోసం వినియోగించిన కవులు, కళాకారులూ ఎందరో ఉన్నారు. జీవిక కోసం కాకపోయినా, తమ భద్రతకు, ఉనికికి, హక్కులకు, గౌరవానికే మౌలికంగా ప్రమాదం ఉన్న సమాజాల్లో సృజనను, కళను తమ భద్రతనూ గౌరవాన్నీ పరిరక్షించుకోవటం కోసం వినియోగించే ప్రయత్నాలే సాహిత్యంలో ఉత్పన్నమయ్యే ఉద్యమ ధోరణులు. ఆలాగే, జీవిక కోసమూ, హక్కుల కోసమూ కాకపోయినా సరే సాహితీ వ్యాసంగాన్ని, కళను తమ పరువు, ప్రతిష్ట, వీటికి సమీప అవసరాలైన సామరస్యం, అభిమానం, స్నేహ పురస్సరమైన మర్యాదలకు (belongingness needs) నిబద్ధంగానే నిర్వహించుకోవటం కూడా ఆయా స్వభావాల్లో ఈ అవసరాల ప్రాధాన్యతను సూచిస్తుంది. మన ప్రవర్తనలో, మనస్తత్వంలో ఇవి సహజమైన స్వభావాలే గాని, నికార్సైన, సంతృప్తికరమైన సృజనకు - అంటే self-actualization అని మాస్లో నొక్కిచెప్పిన లక్ష్యానికి ఇవన్నీ ఏదో ఒక మేరకు అడ్డంకులు. సృజనశీలత తీవ్రమైన స్వభావంగా ఉన్నవాళ్ళలో సృజన ఈ అనుక్రమాన్ని ధిక్కరించి - అంటే సంపాదన, మర్యాద, ప్రతిష్ట, సామరస్యం, సుహృద్భావం మొదలైన అవసరాలన్నిట్నీ కాదనుకొని - మొట్టమొదటి అవసరంగా ఆవిష్కృతమౌతున్నాది. ఇలాంటివాళ్ళ వెర్రిని eccentricity అన్నారు. దీనిమీద చదువుకుంటే ఎంతో ఉపయోగకరమైన పరిశోధనలున్నాయి.
ఆధునిక సమాజాల్లోన ప్రాధమిక అవసరాలు - కనీసం తిండి, బట్ట లాంటివి, దాదాపుగా అందరికీ తీరుతున్నాయి. కాని, సాంఘిక అసమానతలు ఇదివరకటిలాగే, అంతకంటె తీవ్రంగా ఉన్నాయి. వివక్షకు, పీడనకు గురయ్యే వర్గాల్లోన సృజనశీలురైన వాళ్ళందరికీ సహజంగానే ఈ అవసరాలు తీరటంలేదన్న స్పృహ, వేదన ఉండితీరుతాయి. ఆ కష్టం ఏమిటో అనుభవించనివాళ్ళకి తెలిసే అవకాశం తక్కువ. అంటే - బాధపడితే గాని బోధపడదు. గాంధీజీ స్వయంగా వివక్షకు, అవమానానికీ గురయినందుకే ఆయనకు పౌరుషం వచ్చిందని అంటారు. స్వయంగా పేదలై, ఆడవాళ్ళై, దళితులై, వికలాంగులై, దుర్బలులై ఆ కష్టం, అవమానం ఏమిటో అనుభవిస్తే అప్పుడది అంతరంగంలో ప్రజ్వరిల్లుతూ ఆ మనిషి స్వభావాన్ని నిర్దేశిస్తుంది. ఇలాంటి మనుషులు సృజనశీలురైతే, వాళ్ళ సృజనకు రెండురకాల స్వభావాలుండే అవకాశం ఉంది. ఒకటి - వాళ్ళు వస్తుతః బలమైన సృజనకారులు కానట్లయితే వాళ్ళ అభివ్యక్తిలో సృజన కంటె సాంఘిక అవసరానిది, వేదనదే పైచేయి అవుతుంది. అయినప్పటికీ ఆ వేదనను, అవసరాన్నీ స్వయంగా తామే అనుభవించి ఉన్నారు కాబట్టి వాళ్ళ సృజన ‘మా నిషాద!’ వాక్యం లాగ సత్యం గాను, విశ్వసనీయం గానూ ఉంటుంది. ఇంతకు మించి, ఆ మనుషులే స్వయంగా బలమైన సృజనకారులు కూడా అయితే అప్పుడూ వాళ్ళ జీవితానుభవమూ, సృజనానుభవమూ రెండింటికి రెండూ ప్రబలమైనవే కాబట్టి, రెండిట్లో ఏ ఒక్కటీ ‘జూటా’ కావు కాబట్టీ వాళ్ళ సృజనలు విశేషంగా అలరిస్తాయి. బాధపడితే గాని బోఢపడదు అన్నదాన్ని గురించి నారాయణరావు గారు చెప్పింది ఏమంటే - ఇంకొకరి కష్టసుఖాల్ని, వాళ్ళ అనుభవాల్ని అన్నింటినీ స్వయంగా అనుభవించడం మనలో ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. కాని బోధపడేటట్టు చెప్పడానికి వ్యాసాల కంటే, ప్రవచనాల కంటే, మనస్తత్వం, సాంఘిక శాస్త్రం వంటి శాస్త్రాల కంటే కూడా కాల్పనిక సృజనే ఎక్కువ శక్తివంతమైనది అని. ఈ మాట నిజమేననిపిస్తుంది. ఎందుకంటే కాల్పనిక సృజన, కళారూపాలు సాధించగలిగింది అంతరంగాల నడుమ ఔద్వేగిక సమన్వయం. మిగిలినవన్నీ సాధించేది ప్రధమంగా బౌద్ధిక సమన్వయం. దానికి అనుభవాల్ని అనువదించడానికీ, ప్రవర్తనను ప్రభావితం చెయ్యటానికీ ఉద్వేగానికున్నంత శక్తి ఉండదు.
మొదట చెప్పిన అయిదు అవసరాలు - శారీరకావసరాలు, భద్రత, ప్రేమాభిమానాలు, ప్రతిష్ట, సృజనశీలత - కాకుండా ఇంకొకటి తాత్విక జిజ్ఞాసను (transcendental need) చేర్చి ఈ ఆరు అవసరాలూ మనుషుల ప్రవర్తనల్ను నడిపించే చోదక శక్తులని మాస్లో నిర్ధారించేరు. వీటిలో చివరిది సృజనశీలత కంటె కూడా పైది. చిత్రంగా మన ప్రాచీన లాక్షణికులు, సృజనకారులలో కొందరు సృజనకు, తాత్విక జిజ్ఞాసకూ ఉన్న సంబంధాన్ని ఇలాగే అర్ధం చేసుకున్నారు. ‘సాహిత్యమ్ రసానందమ్ బ్రహ్మానంద సహోదరమ్‘ వంటి వాక్యాల్లోన, సారస్వత సృజన అనుభవం యోగి అనుభవానికి సబ్రహ్మచారి అనీ, యోగుల అనుభవమైన నిర్వికల్ప సమాధికి సమీపమైన లౌకికానుభవమనీ పాతకాలం వాళ్ళు వందలాది మంది నొక్కిచెప్పిన మాటల్లోన ఇది విశదమౌతుంది.
 ఇటీవలి కాలంలో పుట్టపర్తినారాయణాచార్యులు 
గారిదీ ఈ దృక్పధమే. వేమన కవి అవునా కాదా అన్న 
ప్రశ్నను చర్చిస్తూ ఆయన ‘వేమన కవి కంటె 
ప్రబలంగా యోగి. యోగి కవి కంటె పైమెట్టు మీది 
వాడు. ఆయన్ని క్రిందికి లాగి కవి అని ప్రకటించాలని 
ఎందుకు ఆరాటపడతారు?’ అని ఎదురు ప్రశ్న వేస్తారు. 
మాస్లో అనుక్రమంలో మర్యాద సృజనకు ఎలాగైతే అడ్డం పడుతోందో, అలాగే సృజన తాత్విక జిజ్ఞాసకూ అడ్డం వస్తోంది. చలంగారు ముందు మర్యాదను ఛీత్కరించుకొని సృజనను ఆశ్రయించి, ఆ పైన సృజననూ తిరస్కరించి తత్వాన్ని ఆశ్రయించేరు - మాస్లో మెట్ల నిచ్చెనను ఒక్కో మెట్టే ఎక్కుతున్నట్లుగా! త్రిపుర వెదుకులాట చలంగారు చివరి మజిలీ అనుకున్న చోటనే మొదలయ్యి, ఏ గమ్యం మార్గం లేకుండానే చప్పున ముగిసి మౌన వ్యాఖ్యగా చల్లారిపోయింది. అది సృజనను తిరస్కరించటం లేదు. తృష్ణను, చాపల్యాన్ని, కపటాన్ని, మర్యాదనూ తిరస్కరించటం లేదు.
సృజన అనుభవాన్ని పరిశోధిస్తున్న ఆధునికులు చిక్సెన్ట్‌మిహాయీ మిహాయీ(Csikszentmihalyi Mihaly)వంటి వాళ్ళ నిర్ధారణలు, స్వయంగా సృజనకారులైన పాశ్చాత్యులు చెప్పుకుంటున్నవీ పట్టిచూస్తే చిత్రంగా ఉంటాయి. వాటిని చలంగారు, నారాయణాచార్యులుగారు, త్రిపుర ఇలాంటి సృజనకారులందరి అవగాహనల్తో పోల్చి పరామర్శించవచ్చు.
(ఇంకా ఉంది
)
        సరస్వతీపుత్ర  
         పుట్టపర్తి నారాయణాచార్యుల 96వ జయంతి



 ఆధునిక సాహితీ చరిత్రలో

బహుముఖ పాండిత్యం సంపాదించి 


ప్రాచీన నవీన కవితాయుగాల వారిధిగా నిలిచారు 

పుట్టపర్తి నారాయణాచార్యులు. 

భక్తికవితా బంధువు.. 

అనువాద రచనా సాహిత్యంలో 

14 భాషల్లో ప్రవేశ ప్రావీణ్యం ఆయన సొంతం. 

ఏడు భాషలలో ఆశు కవితామృతాన్ని 

తెలుగు గుమ్మంలో నిండుగా.. దండిగా పారించారు. 


నేడు సాహితీ మేరువు 96 జయంతి సందర్భంగా  

అందిస్తున్నకథనమిది.
*

నారాయణాచార్యులు 

అనంతపురం జిల్లా

 చియ్యేడులో

1914 మార్చి 28న 

జన్మించారు. 

ఈయన తల్లిదండ్రులు 

లక్ష్మిదేవి, శ్రీనివాసాచార్యులు. 

12యేట నుంచే సాహితీ ప్రకియ్రకు ఉపక్రమించారు. 

సంగీత, సాహిత్యాలలో 

సమ ప్రతిభను ప్రదర్శించిన ప్రతిభాశాలి.

* పేదరికం వెంటాడినా.. 

సరస్వతీ సమరాధన వీడలేదు. 

అవధానాలు చేయటంలో అందవేసిన చేయి. 

ఎక్కువ కాలం ప్రొద్దుటూరులోనే గడిపి 

అపార సాహిత్యసేవలందించారు. 

ఆయన రచించిన గేయకావ్యం శివతాండవం 

సంగీత, సాహిత్య, నాట్య సంకేతాల సమ్మేళనం.

 మంచి గుర్తింపు పొందింది.

* పద్య కావ్యాలు : 

సాక్షాత్కారము, 

పెనుగొండ లక్ష్మి, 

షాజీ, 

గాంధీజీ మహాప్రస్తానము, 

సిపాయి పితూరీ, 

శ్రీనివాసం ప్రబంధం. 

బాష్పతర్పణం.

* గేయ కావ్యాలు : 

అగ్నివీణ, 

శివతాండవము, 

పురోగమనము, 

మేఘదూతము,

 జనప్రియ రామాయణం.

* ద్విపద కావ్యం : 

పండరీ భాగవతం

* నవలలు :

 ప్రతీకారం, 

ఉషఃకాలము, 

రఘునాథనాయకుడు, 

అభయప్రదానం


* పరిశోధనలు : 

విజయనగర సామాజిక చరిత్ర, 

జైనం, 

బౌద్ధం, 

భాషా శాస్త్రములు, 

ప్రాకృత వ్యాసములు, 

మళయాళ భాషావ్యాసాలు, 

వసుచరిత్ర సాహతీ సౌరభం, 

మహాభాగవతోపన్యాసములు,

 మహాభారత విమర్శనం.

* అందుకున్న బిరుదులు.. : 

సర్వతీపుత్ర, 

అభినవ పోతన(1948), 

వాగ్గేయకారక రత్న(1951),

 ప్రాకృత కవితా సరస్వతీ(1952),

 మహాకవి (1953), 

అభినవ నాచనసోమన(1962), 

వ్రజభాషాభూషణ(1963), 

సరస్వతీ తిలక(1964), 

అత్యుత్తమోపాధ్యాయ(1969), 

సర్వసంత్ర స్వతంత్ర(1972),

 పద్మశ్రీ, 

కవిసార్వభౌమ(1974), 

డాక్టర్‌ ఆఫ్‌ లెటర్సు(1975), 

అభినవ కాళిదాస(1976), 

ఆంధ్రరత్న(1987).



Andhraprabha


Last Updated Oct 07 2011, 21:42:03, IST


వివిధ కవిత్వవేది'

special story -   Fri, 16 Oct 2009, IST
కవిత్వవేది'' అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన కల్లూరి వెంకట నారాయణరావు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అపారం. డిగ్రీ చదువుకునే రోజుల్లో వారి సాహిత్య చరిత్ర మమ్మల్ని ఎంతో అలరించింది. అప్పటికి చాగంటి శేషయ్య, కందుకూరి వీరేశలింగం పంతులు, వంగూరి సుబ్బారావు వంటి వారి గ్రంథాలు రాకపోలేదు కాని కవిత్వవేది రచనలో ఒక విశేషం, శైలిలో ఒక విశిష్టత ఉండేవి. అది సంగ్రహమే కాదు సమగ్రం కూడా! ఐతే అప్పుడు మాకు కల్లూరి వెంకట నారాయణరావు గూర్చి అవగాహన లేదు. వారు రచించిన ఇతర గ్రంథాలను కూడా అధ్యయనం చేశాక ఆయన విరాట్‌ రూపం అర్థమైంది. ''పింగళివారి సాహిత్య చరిత్ర మెరుపు తీగెలు -మీ రచన స్థిర విద్యుత్‌ కాళిక'' అన్నాడు డా|| నండూరి రామకృష్ణమాచార్యులు! కల్లూరి వారు బహుముఖ ప్రజ్ఞావంతులు.
ఇటీవల అనంతపురం వాస్తవ్యులైన కె.వై.పి.ఏ. నాగరాజు గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. తద్వారా శ్రీ కల్లూరి వెంకట నారాయణ రావు జీవితము, రచనలు ట్రస్టు, ధార్మిక కార్యక్రమ విలువల గురించి విపులమైన సమాచారం అందింది.
రాయలసీమలో కవిత్వవేది మరొక పార్శ్వం ఆధ్యాత్మిక గురుత్వం! అనంతపురం జిల్లా గుత్తిరోడ్డులో తడకలేరు వద్ద ఆనంద శ్రీపాదాశ్రమం స్థాపించారు. అక్కడ బృందావనం -శ్రీరాఘవేంద్రస్వామి వారి మందిరం, షిర్డీసాయి మందిరం స్థాపించి ముముక్షువులకు ఎంతో సేవ చేశారు.
అనంతపురం జిల్లా బండమీదపల్లెకు చెందిన కవిత్వవేది అసలు పేరు కల్లూరు వేంకట నారాయణరావు. కల్లూరు సుబ్బారావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన నారాయణరావు ఆంగ్ల, సంస్కృత, కన్నడ భాషలలో ఎం.ఎ. చేశారు. ఉపాధ్యాయుడిగా అనేక విద్యాసంస్థలలో సేవలందించారు. ప్రముఖ కథారచయిత గుడిపాటి వెంకటాచలంతో కలిసి పనిచేసిన అనుభవం కల్లూరిది. సర్వీసు ముగిసిపోకముందే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. వీరు వివిధ కవిత్వ వేదులు. వారి రచనలలో 19 ముద్రితాలు కాగా 4 లిఖిత గ్రంథాలుగా ఉండిపోయాయి. అంతరార్థ కళాప్రపూర్ణ, కవితాతపస్వి, కవిశేఖర, ఆధ్యాత్మిక తత్త్వవేత్త, కవితానంద మహోదధి వంటి బిరుదులెన్నో వారిని వరించాయి. వారికి జరిగిన సత్కారాలకైతే లెక్కేలేదు. కలం పట్టి కవితా విహారం చేసిన కవిత్వవేది 1979లో అస్తమించారు. లిటిల్‌ ఫ్లవర్స్‌ స్కూల్‌ వ్యవస్థాపకులు ఆంజనేయులు వీరి శిష్యులు. కల్లూరి జయంతి, వర్దంతులు పురస్కరించుకుని ప్రముఖులకు అనంతపురం పట్టణంలోని కవిత్వవేది కళామంటపంలో సత్కారాలు చేస్తున్నారు. 

ఈ పురస్కారం అందుకున్న వారిలో మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, అక్కినేని నాగేశ్వరరావు తదితరులున్నారు. కల్లూరు వేంకటనారాయణ రావు గుత్తి తాలూకా విసర్రాళ్ళ పల్లె, కడప జిల్లా రైల్వే కొండాపురం, అనంతపురం పట్టణానికి ఐదు మైళ్ళ దూరంలో తడకలేరు నదీతీరంలో శ్రీ ఆనంద శ్రీపాదాశ్రమును, శ్రీ రాఘవేంద్రస్వామి వారి పేరున స్థాపించారు.
నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కల్లూరు వేంకట నారాయణరావుని సన్మానించాలని భావించి ఆహ్వానం పంపగా ఆయన తిరస్కరించారు.
కల్లూరు వేంకట నారాయణరావు వంశీకులు సమీప బంధువులైన కల్లూరు అహోబల రావు, శ్రీకృష్ణ దేవరాయ గ్రంథమాల స్థాపించి రాయలసీమ రచయితల చరిత్రను నాలుగు సంపుటాలుగా రచించి ముద్రించారు.
సి.వి. రామారావు కల్లూరు వారికి అనుంగు శిష్యుడు. 'గుడ్‌ ఎర్త్‌' ఆంగ్ల నవలను సుక్షేత్రము పేర తెలుగులో అనువదించారు. ''నవజీవన'' అనే వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. సేవికారత్న రొద్దం మొదలి సుబ్బలక్ష్మమ్మ. కల్లూరి ప్రశిష్యురాలు. ఈమె ఇంటిలో సేవ చేసే రోజుల్లో కల్లూరువారి 'శ్రీ సద్గురు వేంకట నారాయణస్వామి గారి జీవితం -మహిమలు' అనే పుస్తకాన్ని వెలువరించింది.
సుబ్బలక్ష్మమ్మ వయో భారంతో ఉన్నా శాంతి సామ్రాట్టు -అశోక చరిత్రము పద్యకావ్యాన్ని పునర్‌ ముద్రణ చేసే పనిలో ఉన్నారు. అలాగే 'ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము' పుస్తకాన్ని కూడా పునర్ముద్రణ చేసే ప్రయత్నంలో ఉన్నారు.