పోతన శైలి నన్నయ రచనవలె ఋషివాణి.
ఆ శయ్య ..
ఆ రచన..
అతనికే చెల్లింది.
అంటారు పోతన భాగవతము అనే
జక్కా సుబ్బరాయుడు గారు ముద్రించిన భాగవతమునకు ముందు మాట వ్రాస్తూ
పుట్టపర్తి వారు
పుట్టపర్తి తండ్రి
పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు (మా తాత)
తిక్కన భక్తులు.
ఆయనతోపాటీ కట్టమంచి రామలింగారెడ్డి
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
ఇలా దాదాపు పది పదిహేను మంది
శ్రీనివాసాచార్యులవారికి
దాదాపు పదహైదు పర్వాలు నోటికి వచ్చేవి
అందువలన వచ్చిన ఆశు కవితా ధోరణి
తండ్రి ప్రభావం
పుట్టపర్తి పై సహజంగా పడింది.
ఆరోజుల్లో పదేండ్ల వయసున్న పుట్టపర్తి చదువుతుంటే శ్రీనివాసాచార్యులు పురాణం చెప్పేవారట..
ఇంట్లో ఎప్పుడూ సాహిత్య గోష్టులూ చర్చలూ
తిక్కనపై పుట్టపర్తి కీ ఆరాధన ఏర్పడింది..
తిక్కన శైలిలోనూ పుట్టపర్తి మునకలు వేశాడు
తిక్కనను తప్ప ఎవరినీ ఇష్టపడే వారు కాదు
పోతన కవిత్వం పై కూడా ఆకర్షణ అంతగా లేదు
అందువలన
పోతన కవిత్వమూ పుట్టపర్తి ఆరోపణలకు
గురి అయ్యింది
తర్వార్వాత్త పరిణతి చెందిన జీవితం
పోతనలోని భక్తి ఋషిత్వం వైరాగ్యం పట్ల
ఆరాధన పెరిగింది
అప్పుడొక పిల్ల విమర్శకుడు
పుట్టపర్తి యెదుట పోతన కవిత్వం బాగుండదన్న అభిప్రాయాన్ని చెప్పాడు
పుట్టపర్తి యేమీ మాట్లాడలేదు
ఒక్కసారి గతాన్ని పరికించారు..
ఒకప్పుడొక పిల్ల విమర్శకుడు సందర్భ వశమున నాతో 'భాగవతపు శైలి యేమియు బాగుండదు.
తిక్కన ధార దీసినట్లుండును.
పోతన్న దట్లు గాక
పాదపాదమునకు దునిగిపోవును.
యతి ప్రాస వీనిని బూరింపవలసి వచ్చినపుడు
క్రొత్త క్రొత్త పదములను వెదకి కొనుటలో
నతడు పడు బాధ జూచిన 'యయ్యో 'యనిపించును. అని నిరాఘాటముగ తిక్కన పోతన్నలలోని తారతమ్యములను తీర్పు జెప్పివేసెను
నేనప్పుడేమియు మాట్లాడలేదు.
కారణమేమగా
నా బాల్యములో నేను గూడ
పోతన్నపై నిట్టి యభాండముల నెత్తితిని.
తీగె దిగిచినట్లు వ్రాసిననే ధారా శుధ్ధియగును
కాకున్న కాదు
అని మొదలు స్థిరపడవలెను
అటు తరువాత
నీ విమర్శకు నడుముల బలము నిల్చును.
భారత కవులలో తీగె దిగిచినట్లు రచన యున్నమాట నిజమే.
ఆ ధార యొక్క ద్రుతగతి ఎర్రన కంటెను
తిక్కన కంటెను
నన్నభట్టులో నింకను గొంత మీరినది.
కాని భారతము వీర కావ్యము.
ఆ పాత్రలకు ద్రుతగతి
ప్రబలమైన యుద్రేకము
ఉ త్తాలములైన భావములు
యివి సహజములైన ధర్మములు.
అందుచేనా కావ్యములను రచించునపుడు
శయ్య యెంత తొందరగ నడపిన మనకంత యానందము గలుగును.
కాని
భాగవతము యొక్క ధర్మము వేరు.
శాంతి దాని ప్రదానమైన రసము.
ఆ పాత్రలకు నిలుకడ సమ్యమనము
యివి నైజములైన గుణములు.
అట్లే వానిని సృష్టించు కవికి గూడ
నీ గుణములు లేకున్నచో
నా సన్నివేశములు
క్రోతి చేతికి దొరకిన యద్దము వంటిదగును.
భారతములోని వారికి ముఖ్యముగ రజోగుణ ప్రదానము.
అందుచే మాటలలో వాడిమి
భావములలో తీండ్ర
యీ గుణములుండి తీరవలెను.
పోతన్న పాత్రలు సత్వగుణ ప్రధానములు. భారతములో
ప్రతిచోటను తీగె దిగిచిన శైలెయే లేదు
నిలిచి నిలుకడగ వలికిన పట్టులును నుండనే
యున్నవి.
అట్లే భాగవతమున గూడా
హృదయ భావములకు విశృంఖల స్వైరగతి నావిష్కరింప వలసిన చోట
పదములు పాదరసమువలె బర్వెత్తును.
అక్కడ అతని ధార
వర్షాకాలమునందలి ప్రవాహమువలె
తెగదూకులు దూకినది.
కాని ..
సామాన్యముగ నా తడు శయ్యను
నిరంతరమును గళ్ళెమును చేతబట్టుకొనియే నడపును.
పోతన్న భాగవతపు తెనిగింపు
నేడు గొందరనుకొనునట్లు
పుస్తకమును ముందు పెట్టుకొని
మూడు నాళ్ళలో దీర్చిన ముచ్చటగాదు.
ఆతడు సంస్కృత భాగవతమునెన్నియో యేడులు
పరాయణముగ బారాయణమొనర్చెను.
చదివి ..చదివి..
వ్యాసభగవానులు సృష్టించిన ప్రతి సన్నివేశమును
ప్రతి పాత్రను
ప్రతి పద్యమును
ప్రతి పదమును
భావించి భావించి వివర్జిత చేష్టుడైనాదు.
ఈ తపస్సు జన్మమంతయు సాగుటచే
నా భక్తులలోని యనేక గుణములు పోతనామాత్యులకు స్వభావములైపోయినవి.
ఆతని జీవితమునందు
పరమ భాగవతులు తొంగిచూచినట్లు
భాగవతములోని ప్రతి భక్తునిలోను
పోతన్న బ్రతుకు తొంగిచూచును.
భాగవతమతనికి కవిత్వము గాదు.
కనువిప్పు...
ఆంధ్రీకరణ మతని కానందమేగాదు.
నిష్ఠ ...