9 ఫిబ్ర, 2013

నందితిమ్మన

''పారిజాతాపహరణం 



పారిజాతాపహరణం  .....
ఈ గ్రంధము వ్రాయడానికి 


నంది తిమ్మన గారికి ఒక కారణము ఉన్నది అంటారు,
ఒక రోజు అనుకోకుండా
తిరుమలదేవి శ్రీ రాయల వారిని 
పాదాలతో తాకుతుందంట,
దానితొ రాయల వారు కోపగించుకోని
తిరుమలదేవ్ని చూడటం మానేస్తారు,
తిరుమలదేవి అరణంగా వచ్చిన నంది తిమ్మన
ఆ గొడవని రూపు మాపడానికి
స్వయంగాకృష్ణులవారేతన్నిచ్చుకున్నారు
మీదేముంది..?
అని చెప్పడానికి ఈ కథ రాసినారు
అని ఒక ఐతిహాసం.

పారిజాత పుష్పంలాగా వన్నె తగ్గని కావ్యాన్ని రచించి 
శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో 
మంచిపేరు తెచ్చుకున్నాడు నందితిమ్మన


తెనాలి రామలింగడు తిమ్మననిలా ప్రశంసించాడట...
"మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట ద్భేకములకు గగనధునీ శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

(మూడో పాదంలో ‘గగన ధునీ’ అనే ప్రయోగాన్ని ‘నాక ధునీ’ అని మార్చి ‘రాజ కవి’ (కృష్ణ రాయలు) ‘కవి రాజు’ (రామకృష్ణుడు) ప్రశంసను పొందాడని ప్రతీతి)

తెలుగు భాషా సమితి చెన్నపురి వారు 
తెలుగు విజ్ఞానసర్వస్వము 1955 ల ప్రచురించారు  
ఆంధ్ర సాహిత్యంపై మహరాష్ట్ర వాఙ్మయ ప్రభావము,
నంది తిమ్మన, ఇంకొకటి
మూడు పుట్టపర్తి వారి వ్యాసాలు 
ఇప్పుడు నంది తిమ్మన్నను మీ ముందుకు తెస్తున్నాను.

.ఇందులో మా అయ్యగారిపేరు పు.నా . అని వేసారు.
మా పెద్ద బావగారు బాణగిరి రాఘవా చార్యులు . ఆయన మంచి కవి చదువరి.
ఆయన అనేవాడు నాగా మన తెలుగు పేర్లతో పత్రికలకు పంపితే వేసుకోరమ్మా
పేరు కాస్త కొత్తగా విచిత్రంగా అర్థం కానట్టుండాలి పరభాషా రచయిత అన్నట్లు.
నా పేరు B S రాఘవ కదా
బి.ఎస్.ఘవా..
నీ పేరు నాగపద్మిని కదా
కుంపినాప అని అంటే
కుం.పి. నాగపద్మిని అన్నమాట అంటూ చెప్పేవాడు
మా పెద్దబావగారు చాలా హాస్య చతురులు
చక్కని కవిత్వం రాస్తారు. కానీ బి.ఎస్.ఎన్.ఎల్. లో ఆఫీసులో ఆయన కవిత్వం తెల్లారిపోయింది..
మా అయ్య పేరు పు.నా అని వచ్చిన సందర్భంలో మా ఇంట్లో వచ్చిన కామెంట్లివి.
మా అయ్య విని హాయిగా నవ్వేవారు.
సాధారణంగా మా అయ్య దగ్గరికి పోయే సాహసం 
ఎవరూ చేసేవారు కాదు
ఎప్పుడైనా అయ్యకే  మూడొస్తే  

కాస్త సంభాషణను పొడిగించేవారు.ఇక ఈ నంది తిమ్మన వ్యాసంలో

నంది తిమ్మన ను పుట్టపర్తి వారు మనకేవిధంగా చూపించబోతున్నారో చూద్దామా