16 డిసెం, 2012

గూగుల్ తిరగేస్తుండగా 
పేపర్ సుబ్బరావ్ గారి మనవడు
 శ్రీ కరణం రాం కుమార్ గారు వ్రాసిన వ్యాసం కనబడింది. 
కరణం రాం కుమార్ గారు ఆనాటి సంగతులను 
మళ్ళీ కళ్ళకు కట్టి చూపించారు 
 వారితో స్నేహానికి మైల్ పంపాను 
ఈ నడుమ వేదవతీ ప్రభాకర్ గారిని కలవడానికి వెళుతున్నాను 
ఆవిడ మా అయ్య పాటలు "యమునా తటిలో "
ఇంకా చాలా పాడారు
 కానీ ఆవిడా తన పాటలను జాగ్రత్త చేసుకోలేదు. 
యధావిధిగా ఆకాశవాణివారు వాటిని ఎవరికీ కనపడకుండా
 గుప్తంగా దాచారు విశేషమేమంటే 
వారెక్కడ దాచారో వారే మరచిపోయారు. 
 వేదవతి గారి భర్త ప్రభాకర్ గారూ 
పుట్టపర్తి వారి ఆరాధకులే వారితోనూ కలవాలన్నాను వేదవతి గారితో 
 సరే రండన్నారు. 
ఈలోగా తిరుపతికి వెళ్ళి వెంకన్నను దర్శించి వచ్చాం 
గొంతు పూర్తిగా మూసుకుపోయింది 
రెండు రోజులాగి మళ్ళీ పనిలోకి దిగాలి 
ఈలోగా కరణం రాం కుమార్ గారి వ్యాసం మీ కోసం

Puttaparthi పుట్టపర్తి నారాయణాచార్యులు