9 మార్చి, 2015

వడిబాయక తిరిగే ప్రాణబంధుడా..





అది 1982 కావచ్చు..
మా అమ్మ మంచం లో వుంది..
కాన్సర్ తీవ్రంగా వుంది..
అదీ బ్రెయిన్ కాన్సర్ 

అప్పట్లో కాన్సర్ కు మందు లేదు..

కాళ్ళూ చేతులూ పడిపోయాయి
మాట పడిపోయింది..
ఇంట్లో అందరికీ దిగులు బాధ
యేం చేయాలో తెలియదు..
 

ఒక పక్క 
మా అయ్య తెల్లవారి మూడుకు లేచి రాఘవేంద్ర స్తోత్రం 108 సార్లు పారాయణ చేస్తున్నారు..
ఎందరో సాధువులు జ్యోతిష్కులు అపుడపుడూ వచ్చి విచారిస్తున్నారు
శిష్యులు భక్తులూ.. ఆవేదన చెందుతున్నారు..
కానీ
ఎవరూ యేమీ చెయ్యలేని స్థితి..
 

ఎందరికో అన్నం కలిపి ముద్దలు పెట్టిన చేయి
మొన్న మా అన్నయ్య దగ్గరికి పోతే చెప్తున్నాడు
తన చిన్నప్పుడే మా ఇంటికి వచ్చాడు
నేను అయ్య గారింట్లో నే వుంటాను అని మొండి చేసేవాడట ..
 

జన్మతః వైశ్యుడు..
పేరు సుబ్రమణ్యం..
కానీ పెరిగిందంతా మా ఇంట్లోనే..
పోనీలే అయ్య గారింట్లో వుంటే బాగుపడతాడు అనుకుని వాళ్ళ నాయన
మా అయ్యకు కొంత డబ్బివ్వ బోయాడట..
 

వుండనీలే  డబ్బు గిబ్బు యేమీ వద్దు
వీణ్ణి ఇక్కడే వుండనీ
ఈ సన్న పిల్ల వాడు మాకు బరువా .. 

అందరితో వాడు..
అని పంపేశారట..
 

అలా మా ఇంటికి వచ్చిన వాడు
అప్పటికి ముగ్గురు పిల్లలు నికరమైన వుద్యోగం లేదు..
మా అమ్మకు పధ్నాలుగేళ్ళ వయసు
సుబ్రమణ్యం అన్నయ్యకు తొమ్మిదేళ్ళు
పధ్నాలుగేళ్ళకే తన పిల్లలతో పాటు సుబ్రమణ్యానికీ నోట్లో అన్నం ముద్దలు పెట్టేదట మా అమ్మ.
తనకంటే పెద్ద వాళ్ళకూ మా అమ్మ అమ్మే..

ఆ పరిస్తితుల్లో ఒక ఉపాసకుడు  వ చ్చాడు
నేను అమ్మగారి కోసం ప్రయత్నం  చేస్తానని
నేనప్పుడు పదహారేళ్ళదాన్ని
ఆయన పేరు యేదో మరిచిపోయాను
ఆయన మా ఇంట్లోనే వున్నాడు


 సూర్యోదయాత్పూర్వమే మిద్దిమీదికి వెళ్ళే వాడు
ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని..
ఎవ్వరినీ పైకి రావద్దని చెప్పేవాడు
బయటినుంచీ గొళ్ళెం పెట్టుకోమనే వాడు
 

సరే..
ఒక రోజు ఆయన యేం చేస్తున్నాడో చూద్దామని
నేను మెల్లిగా గొళ్ళెం తీసుకుని పిల్లిలా పైకి వెళ్ళాను
పై మిద్దె కాక ఆపై మిద్దెపై ఆయన వున్నాడు
ఆ పైకీ వెళ్ళాను నిశ్శబ్దంగా..
తీరా చూశాను కదా..
 

ఆయన ఒంటికాలుపై నిలబడి
పదకొండు గంటల వేళ చండ ప్రచండంగా ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి తదేకంగా చూస్తున్నాడు
అంతటి సూర్యుణ్ణి చూస్తున్నా ఆయన కళ్ళు నీరు కారడం లేదు
ఒక నిమిషం కాదు
పదినిమిషాలు కాదు
గంట కాదు..
పొద్దున్నించీ సాయంత్రం సూర్యుడస్తమించే వరకూ అలానే..

నేను ఒక సారి కాదు
నాలగైదు సార్లు అలానే  వెళ్ళి గమనించాను
కాసేపు మెట్లపై అలానే కూచుని
మళ్ళీ వచ్చేసేదాన్ని

మళ్ళీ మధ్యలో గుర్తొస్తే మళ్ళీ వెళ్ళేదాన్ని
కానీ ఆయన నన్ను గమనించనే లేదు
కారణం ఆయన దృష్టి సూర్యునిపైనే..

అబ్బ యీయన ఎట్లా సూర్యుణ్ణి చూడగలుగు తున్నాడు
అనుకున్నాను..
అంతసేపు సూర్యుణ్ణి ఎవరు చూడగలరు..
ఆ తీర్థాన్ని అమ్మకు తాగించే వాడు


అలా చూడ టం తప్పు అని ఇప్పుడనిపిస్తుంది
కానీ వెళ్ళిందానివలన ఒక గొప్ప దృశ్యం నా జీవితంలో గుర్తుండిపోయింది..


కానీ విధి బలీయం
అమ్మ వెళ్ళిపోయింది..

టీవీలలో దేవుడు లేడు వుంటే చూపించండి
మహిమలు లేవు సాధువులు స్వాములు అందరూ మోసగాళ్ళు
అని అప్పుడప్పుడూ మాట్లాడుతూ వుంటారు..

కానీ ప్రయత్నిస్తే కదా దేవుడున్నాడా లేదా తెలిసేది..
యే ప్రయత్నమూ లేకుండా
అవాకులూ చవాకులూ మాట్లాడే వాళ్ళని యేమనగలం..

పైన చెప్పినటువంటి సాధకులు
మన దేశంలో ఎందరో వున్నారు..
వాళ్ళు వాళ్ళ సాధనలో వాళ్ళు వున్నారు..
వాళ్ళకు మనతో పని లేదు..
మనకూ వాళ్ళతో పనిలేదు 



వాళ్ళు టీవీ లకు వచ్చి 
నేను సూర్యుణ్ణి కన్నార్పకుండా చూడటమ్ 
అనే సాధన చేశాను 
అని చెప్పరు. 
కారణం .. 
వారికి పబ్లిసిటీ అవసరం లేదు 
పేరుపై మోజు లేదు.. 

అసలు మన మధ్య తిరగాలనే ఇచ్ఛ లేనే లేదు.. 
వారి రహస్యం  తెలుసు కోవాలంటే 
వారి దయను చూ రగొ నాలి
సేవ చేయాలి 
పరి ప్రశ్న తోనే 
వారు శిష్యరికం ఇస్తారు..

ఒకసారి వారి దయాదృ ష్టి పడిందా 
అనుగ్రహానికి అవధులుండవు 

సౌందర్య లహరి చేసి బాగుపడిన వాళ్ళను 
ఎందరినో చూసాను
సుందరకాండ చేసి 

మా పిన్నయ్య తన కొడుక్కు ఉద్యోగం తెచ్చుకున్నాడు
దీనికి సాక్ష్యం యేముందీ..
విశ్వాసం అంతే..