23 ఏప్రి, 2013

షాజీ కిది పుట్టపర్తి ముందుమాట
పుట్టపర్తి లఘు కావ్యాలలో 
రెండవది షాజీ..
మొదటి కావ్యం 
పద్నాలుగు ఏళ్ల వయసున వ్రాయగా..
ఈ షాజీ పందొమ్మిదవ ఏట వ్రాసినది..

"పాత్ర చిత్రణ ...
కథా సంవిధాన పటిమ ...
స్పష్టత ..
మొదలైన కావ్య గుణాలు వెలయించడంలో ..
ఆనాటికి పుట్టపర్తికి పరిణతి సిద్ధించి ఉండలేదు 

కాని..
 గురుకుల వాసంలోని క్లిష్టత..
వాళ్ళ కలిగిన అనుభవం..
 బహుగ్రంధ పరిచయం ..
మొదలైన వాని వలన కలిగిన 
బలీయమైన సంస్కారం 
అహమహమికగా ముందుకు దూకుతున్న 
భావావేశ యుత  పదజాలం 
ఆయనను ఊరకుండనీయలేదు.. 

తత్ఫలితమే ..
షాజీ ఖండ కావ్యం ..
 ఇందులో ముగ్గురే ముగ్గురు.. 
షాజీ ..
జహంగీరు ..
నూర్జహాన్ ..

"నడచు చున్నాడు నల్ల జండాల నీడ .. 
సృష్టి సౌందర్య జీవి షాజీ తపస్వి.. "

అన్న మకుటంతో నడచిన 
పది పద్యాలు హృద్యమైనవి 

ఈ కావ్యం ద్వారా 
సహాజ పండితుడు 
తత్త్వవేత్త అయిన పుట్టపర్తి 
లోకానికి ఇచ్చే సందేశం ఒకటే ..

"అది ప్రకృతి సౌందర్యారాధన.. 
దానిని ఆస్వాదించమని.. "
అంటారు గోల్లాపిన్ని శేషాచలం గారు 

"పొదల చాటు పూవుల జూచి మురిసిపొమ్ము 
కోసి తలలోన జేరివెడు  కుమతి గాకు 
కొమలతమ సౌందర్యార్చకుడవు గమ్ము 
సిగ్గుచెడి నాకటంచు  నాసింప బోకు "


పుట్టపర్తి 
తన పద్నాలుగవ ఏట పెనుగొండ లక్ష్మి వ్రాస్తే 
అది తనకే పాఠ్య భాగమైంది 

పందొమ్మిదవ ఏట వ్రాసిన "షాజీ "
తోటి విద్యార్థులు మెచ్చి అచ్చు వేయగా 
వెంటనే ఇంటర్ మీడియట్ కు పాఠ్య గ్రంధమైంది 
వ్రాసిన వాడింకా విద్యార్థియే 

పుట్టపర్తి తనకు తానే ఆశ్చర్య పోతున్నారు చూడండి ..