9 అక్టో, 2015

ఇది కథ కాదు..



తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి..
గొణుగుళ్ళు .. సణుగుళ్ళు ..కొందరికీ
ఆనందాలూ.. కేరింతలూ కొందరికీ..
హైదరాబాదు రాలేదనికొందరికి ఉక్రోషం
పోనివ్వలేదని ఇంకొందరికి ఆనందం..

సరే..
ఇక రెండు రాష్ట్రాలకూ ఇద్దరు ముఖ్యమంత్రులు..
కొన్నాళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణలూ.. విమర్శలూ..
ఇలా కొన్నాళ్ళు
ఇప్పుడు ఇద్దరూ తీరిగ్గా పరిపాలనలో పడ్డారు..

అక్కడా అభివృధ్ధిలో పోటీ..
ఋణమాఫీ..అక్కడా..
ఇక్కడా ఋణమాఫీ..

రాజధాని నిర్మాణం  జరగాలి..
కేంద్రం మాటలు తప్ప పైసలు రాల్చడంలేదు..
రాజధాని ఎలా వుండాలి..??
హైదరాబాదులా..
ఇంకా .. ఇంకా డాంబికంగా..

రాయలసీమ జగన్ కోట ..
కాబట్టి అక్కడ కట్టడు..
వాస్తునూ.. జ్యోతిష్కులనూ.. ముహూర్తాలనూ సంప్రదించి సంప్రదించి..
తుళ్ళూరును డిసైడ్ చేసారు..
రాజకీయ అవసరాలనూ అందులో నర్మగర్భంగా దాచారు..

భూసేకరణ జరగాలి..
రైతులు ఇవ్వమన్నారు .. 
మాకు పక్కా హామీ ఇవ్వాలన్నారు..

పచ్చటి పంటభూమిని కాలరాచి .. 
రాజధాని వ్యాపారాన్ని చేస్తారా.. 
అని ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి..

ఏం జరుగుతుందో..
భవిష్యత్తులో యేవిధంగా పరిణమించబోతోందో.. 
 అంతా అగమ్య గోచరం..

ఈ గొడవల లోనే 
రాబోయే రాజధాని పేరు అమరావతి ప్రకటించారు .. 
ఎంత చక్కగా వుంది కదా.. 
ఇదేదో పూర్వ ప్రస్తావన లా లేదూ.. 
అదే విద్యానగరిలా .. 

ఆ విద్యనగరమెలా  ఏర్పడింది ..?
అది విజయనగరమెట్లైంది.. 

రాజ్జమంటేనే.. తెరిచిన ఖజానా .. 
కొందరికి అధికారం ఆశ.. 
కొందరికి పరాయి రాజ్జాల సంపద కొల్లగొట్టడం హాబీ.. 
అందుకోసం వ్యూహాలు .. ప్రతివ్యూహాలు.. 
ఎత్తులు .. పై ఎత్తులు.. 
ప్రజారంజకంగా పాలించటం ఒకఎత్తు. 
రాజ్జాన్ని కాపాడుకోడానికి తమ  సింహాసనాన్ని జారిపోకుండా రక్షించుకోడానికి రాజులు ఎంత అప్రమత్తంగా వుంటం మరో ఎత్తు  .. 

రాజులూ ఓడిపోయి బందీలైనా .. 
మరణించినా .. 
ఆ రాణివాసం స్త్రీల పరిస్తితి అత్యంత దయనీయం . 
అందుకే వారికోసం ఎప్పుడూ అగ్ని ప్రవేశానికి దారులు తెరిచే  వుంటాయి .. 

యుద్ధాలు లేని శాశ్వత శాంతి దాదాపు అసాధ్యమే .. 

''సామ్రాజ్జాల  మార్పు దక్షిణ హిందూ స్థానమునకు కొత్తకాదు.. 
క్షణ భంగుర సామ్రాజ్జ సం స్థా పన
 సామ్రాజ్జములమాపు 
దక్షిణ హిందుస్థానమునకు కొత్తకాదు
దాని చరిత్ర అంతా క్షణ భంగుర సామ్రాజ్జసంస్థాపనములతో నిండినదే..

క్రీ.వె. నుంచీ 1200 సంవత్సరాల పాటు చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు తూర్పు చాళుక్యులు రాష్ట్ర కూటులు  మహరాష్ట్రులు కాకతీయులు 
అందరూ తలా రెండువందల సంవత్సరాలు 
సామ్రాజ్జక్రీడ జరిపారు

ఎందరు రాజులు మారినా అధికారం కోసం 
ఒకరిపై మరొకరు యుధ్ధాలు జరిపినా
ప్రజాక్షేమాన్ని మరువలేదు
యే రాజు వచ్చినా ప్రజలకై తానను నీతిని విస్మరించలేదు..

కానీ మహమ్మదీయుల దండయాత్రతో 
ప్రజలకు కష్టాలు..హిందూ ధర్మానికి ఇక్కట్లు వచ్చాయ్
విగ్రహారాధనకు వారు వ్యతిరేకులు
ఫలితంగా మన దేవాలయాలు నేలమట్టమయ్యాయి
విగ్రహాలు  ధ్వంసమయ్యాయి
మత మార్పిడి బలవంతంగా రుద్దబడింది..
స్త్రీలపై అత్యాచారాలకు లెక్కేలేదు..
ఈ విధమైన క్రూర పాలన సుమారు నూరు సంవత్సరాలు జరిగింది..

వారిలో మహమ్మద్ బీన్ తుగ్లక్ చిత్త వృత్తి 
అతి భయంకరమైనది
''అట్టి పండితుడు.. అట్టి మూర్ఖుడు..
అట్టి జ్ఞాని.. అట్టియజ్ఞాని..
అట్టి దయామయుడు.. అట్టి క్రూరచిత్తుడు 
మరొకడు లోకములో నెన్నడునే సిమ్హాసనమును అధిష్టించి యుండలేదు..
దేవత్వము.. రాక్షసత్వము సరిపాళ్ళ సమ్మేళనమై యా చక్రవర్తి రూపము ధరించినవి.. ''

తుగ్లకు మహావీరుడైన జంబుకేశ్వరుని కూడా 
కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసి ఓడించాడు .. 

ఆనెగొందిలో జొరబడి 
గుహలలో ధనం కోసం వారువెతుకుతుంటే .. 
అక్కడ దాక్కున ఆరుగురు మనుషులు కనిపిం చారు.. 
హరిహరుడు .. బుక్క డు 
ఇద్దరు రాజ కుమారులు .. ఇద్దరు వృద్ధులు 
ఓరుగల్లు రాజయిన ప్రతాప రుద్రుని దగ్గర కొలువుండి 
అతని మరణానంతరం ..  జంబుకేశ్వరుని కొలువులో చేరారు..

జంబుకేశ్వరుడు  ఓటమి తప్పదని గ్రహించి 
రాణులను అగ్నిప్రవేశం చేయమని చెప్పి
రాజకుమారులను కాపాడవలసిన బాధ్యతను 
హరిహర బుక్కరాయలపై నుంచాడు

రాజాజ్ఞ మేరకు గుహలో దాగిన వారిని బందీలుగా పట్టుకున్నారు తుగ్లక్ సేనలు
ఆ రాజకుమారులను ఢిల్లీ తీసుకుపోయి బలవంతంగా మహమ్మదీయ మతం ఇప్పించి
ఆనెగొంది పాలనకు మాలిక్ నాయబ్  సర్దారును నియమించి.. సుల్తాను ఢిల్లీ వెళ్ళాడు.
కొంతకాలం గడిచింది
హఠాత్తుగా ఒక పెద్ద హిందూ సేన మీదపడింది సర్దారు వల్ల కలేదు 
వర్తమానం ఢిల్లీ వెళ్ళింది
తుగ్లక్ సమాలోచనం చేశాడు.. 
దక్షిణ దేశీయులు స్వతంత్రాభిలాషులు పరాయిపాలనకు లొంగరు
జంబుకేశ్వరుని కుమారులను పంపుదామంటే వారికి ముస్లిం మతమిప్పించాడు
అందువల్ల లాభంలేదు..
హరిహరుని సామంతుని జేసి ఆందోళన నణిచాడు సుల్తాను
హరి హరుడు బుక్కడు పాలన చేస్తున్నారు

ఇది ఇప్పటివరకు జరిగిన కథ.
హిందువులంతా యేకమై కొత్త రాజధానిని ఎలా నిర్మించారు.. ??
ఈ కార్యానికి విద్యారణ్యులెలా సహకరించారు
ధనమెలా కూడింది..
చదవండి..

పుట్టపర్తి విరచిత .. 
''హంపీ విజయ నగరం'' నుంచీ ..