పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29 మే, 2017

పలికితి వేదార్థ భావమెల్ల..

శ్రీ గిరిజామనోహర్ గారికి కృతజ్ఞతలతో..
పుట్టపర్తి అనూరాధ

12 మే, 2017

పరమ భాగవతుల పాదసేవ .. (పుట్టపర్తి కీర్తి శిఖరాల మాట గరికపాటి నోట..)


నవజీవన వేదంలో  
గరికపాటి నోట సరస్వతీ పుత్ర పుట్టపర్తి 
ప్రస్తావన వచ్చింది. 

ఈ కాలంలో నాలుగు అవధానాలు చేసినా... 
నాలుగు ప్రవచనాలు చెప్పినా 
అతణ్ణి సరస్వతీ పుత్రుడు ..
వాణీ పుత్రుడు.. 
శారదా జ్ఞాన పుత్రుడు అంటూ బిరుదాలు ఇచ్చి పరవశిస్తూ వుంటారు..
 వారి పేరు ముందా బిరుదు వారికి వన్నె తెస్తుందేమో 
కానీ ఆ బిరుదానికే వన్నె వచ్చేది 
అది తగినవ్యక్తి చెంత చేరినప్పుడు మాత్రమే..  


నిజానికి ఈ సరస్వతీపుత్ర బిరుదము 
ఎక్కడో హిమాలయాలలో 
తత్త్వ శోధన చేస్తున్న 
మౌని జ్ఞాని తపస్వి అయిన 
స్వామి శివానంద సరస్వతుల వారిచే 
పుట్టపర్తి వారికి 
పదునాల్గు భాషలలో పాండిత్యాన్ని 
బాగా పరీక్షించిన తదుపరి 
ఆనంద పరవశులై ప్రదానం చేయడం జరిగింది.

పుట్టపర్తి వారు  దేశంలోని 
అనేక కవులు  యోగులు అవధూతలు 
మొదలైన వారిని కలుస్తూ.. 
భగవదన్వేషణలో 
జీవితంపై విరక్తి చెంది పర్యటిస్తూ 
తనకు తృప్తి కరమైన సమాధానం దొరకని కారణంగా విసిగి వేసారి  ప్రాణత్యాగానికై 
ఆ మంచు కొండలనెక్కారు. 

వెంటనే స్వామి శివానంద ద్వారా 
వారి అన్వేషణకు ఒక సమాధానం దొరికింది.
 పుట్టపర్తి వారిని స్వామివారు తమ ఆశ్రమంలో 
కొన్ని నెలలు వుంచుకుని అన్ని శాస్త్రాలలోనూ 
వారి పాండితికి సంతుష్టులై 
'సరస్వతీపుత్ర '
అనే బిరుదాన్ని శిష్యవాత్సల్యంతో ఇచ్చారు..

నాకీ బిరుదులు యేమీ వద్దు 
ఎన్ని కోట్ల నామజపం చేసినా 
ఎటువంటి అనుభూతి కలుగలేదు..
 ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం కావాలి 
అని పుట్టపర్తి నివేదించగా 

'నీకు నీ జీవిత అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది' అని వాగ్దానం చేసారు. 
అదే వాగ్దానాన్ని కంచి పరమాచార్యులైన 
నడిచేదైవం అని పేర్గాంచిన 
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులవారు 
పుట్టపర్తికి మళ్ళీ ఇచ్చారు..

శివానందుల వారు నీవు నాపైని అభిమానంతో 
ఈ బిరుదాన్ని స్వీకరించవలసింది అని కోరారట.
అంత గంభీరమైన ఉదాత్తమైన నేపధ్యం కలిగినదీ సరస్వతీపుత్ర అనే బిరుదం.. 
తరువాతి కాలంలో 
పుట్టపర్తి వారిని ఎన్నో బిరుదాలు వరించినా అవి అక్కడే మర్యాద పూర్వకంగా తిరిగి ఇచ్చివేసిన సందర్భాలు వున్నాయి పుట్టపర్తి వారి జీవితంలో.. 

కానీ పరమ యోగి పుంగవులైన 
స్వామి శివానందులవారిపై గౌరవంతో 
ఒక్క సరస్వతీపుత్ర అన్న బిరుదాన్ని మాత్రం 
వారు తమ పేరులో వుంచుకోవటం జరిగింది.

అప్పటినుంచీ అది పుట్టపర్తి వారికి మరింత శోభనద్ది తనను తాను శోభితం చేసుకుంది.
ఇదే విషయాన్ని మహా సహస్రావధాని గరికపాటివారు వివరించారు.. 
సరస్వతీపుత్ర ఆంద్ర దేశం లో ఒక్క పుట్టపర్తి నారాయణాచార్యులు వారికే వుంది 
ఇంకెవ్వరికీ అది శోభించదు ,
అంటూ వాక్రుచ్చారు .. 

-పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ.

21 డిసెం, 2016

నవ రస భరితం నా తెలుగు పద్యం

శ్రీ గరికపాటి వారు 
''నవరస భరితం నా తెలుగు పద్యం''
 అన్న అంశం మీద తణుకు నగరంలో 2014 ఏప్రిల్ 3న మాట్లాడుతూ..
వీరరసానికి ఉదాహరణగా ..
పుట్టపర్తి వారి పద్యాన్ని ఉటంకించారు.. 
నన్నయ భట్టారక పీఠం 83 వ వార్షికోత్సవ సందర్భంగా 
ఈ సభ జరిగింది..
ఈ లింక్ నాకు మా అక్కయ్య నాగపద్మిని ద్వారా  చేరింది. దీనిని శ్రీ నాగ త్రివిక్రం గారు తనకు అందజేసినట్లు చెప్పింది ఆమె 
 శ్రీనాగ త్రివిక్రం గారికీ .. 
మా అక్కయ్య నాగపద్మినికీ.. 
నా బ్లాగ్ముఖంగా కృతజ్ఞతలు.
https://www.youtube.com/watch?v=rxKM3O8Mgko
you tube link  

ఇది ప్రసంగం దాదాపు 50 నిమిషాలు గడిచిన తరువాత పుట్టపర్తి వారి ప్రస్థావన వస్తుంది.
తెలుగు వాళ్ళ పౌరుషం మీద పద్యం ఇది 
ఎమ్మెల్యే ల ఇంటి ముందు ఈ పద్యం flexi కట్టి చదివించాలట .. 
గరికపాటి వారి చమత్కారాలు..చురుకలు 
సభను రంజింప జేసాయి .. 

''కదనముఖంబునన్ పిరికి కండలు కానని వారు 
వీరతాస్పదులగు భర్తలు వు ధ్ధవిడి శాత్రవులన్  చె రలా డి వచ్చుఁచో 
పదను దొలంకు వారి కరవాలపు నెత్తుట
కుంకుమాకృతుల్ వదనము లందు  దిద్దుకొ ను 
పత్నులకెల్ల నమస్కరించెదన్.. ''

ఖడ్గ తిక్కన బాలచంద్రుడు మొదలైన వీరులే కాదు 
మొన్న యూరీ దాడిలో కన్నుమూసిన మన వీర జవాను 
మదన్ లాల్ శర్మ తల్లి కొడుకు శవ పేటిక మోసి 
తన కొడుకు దేశం కోసం ప్రాణాలు విడిచాడని 
చిరంజీవి అ ని తనను తానే ఓదార్చు కుందట 
ఆమె పేరు ధర్మో దేవి .. 


 గరిక పాటి వారు ఉదహరించిన పద్యం 
పుట్టపర్తి రచించిన
సాక్షాత్కారము అనే కావ్యం  లోనిది .. 






2 అక్టో, 2016

దూత కావ్యాలెన్నో ..

flying on sea hanuman కోసం చిత్ర ఫలితం

పుట్టపర్తి రచించిన మేఘదూత కావ్యము 
కాళిదాసు మేఘదూతమునకు అనుసరణ ప్రాయమని నామ సామ్యమును బట్టి తెలియుచున్నది. 

దూత కావ్యమునకు మార్గోపదేశము ప్రధానము. రామాయణములోని హనుమంతుని దౌత్యమును ఒరవడిగా పెట్టుకొని 
కాళిదాసు మేఘదూతమును వర్ణించినాడనుట జగత్ప్రసిధ్ధమే. 

కాని వాల్మీకి నుండి కాళిదాసు గ్రహించినది 
కేవలము సందేశము కాదని 
మార్గోపదేశమును గూడ వాల్మీకి నుండియే 
కాళిదాసు గ్రహించినాడనవచ్చును. 

కిష్కింధకాండలో నీ అన్వేషణకు 
వానరులను నాలుగు దిక్కులకు పంపుచు సుగ్రీవుడు ఆయా దిక్కులలోని విశేషములను ఆటంకములను గొప్పదనములను వివరించును. 

తరువాత సుందరకాండలో 
హనుమంతుని సందేశ సన్నివేశమున్నది. 
ఈ రెంటిని మేళవించి 
కాళిదాసు ప్రత్యేకముగ దూతకావ్యము నిర్మించెను. 

ఇది తరువాతి సందేశ కావ్యకర్తలకు మార్గదర్శకమైనది. 
ఈ విషయము దృష్టిలో వుంచుకునే కాబోలు
 పుట్టపర్తి తన కావ్యములో 
హనుమత్సందేశమును స్మరించెను.

''హనుమంతుడొకనాడు
ఆర్ద్రహృదయుడు దూత
నీవొకడవేనేడు
నెనరు కల్గిన దూత ''
- వఝల రంగాచార్య 


1 ఆగ, 2016

డా.రేవూరి అనంతపద్మనాభరావు గారు

డా.రేవూరి అనంతపద్మనాభరావు గారు కడప ఆలిండియా రేడియో లో డైరెక్టరుగా పనిచేసేవారు 
1975 ప్రాంతాల్లో వారు మహాకవి పుట్టపర్తి పుత్రసమానుడిలా వారింటికి 
ప్రతిరోజూ వచ్చి ఒక గంటా రెండు గంటలు సాహిత్య చర్చలలో గడిపి వెళ్ళేవారు 
'ఒరే పద్మనాభుడూ '
అని పుట్టపర్తి వారు ఆయనను సంబోధించేవారు 
స్టేషన్ డైరెక్టరైనా ఆఫీసు అయిదున్నరకు అయిపోగానే పుట్టపర్తి వారిని చేరే వాడినని వారు చెప్పుకున్నారు 
పద్మ నాభరావు గారు అవధానాలు చేసేవారట మొదట్లో 
ఒకసారి అవధానం చేస్తున్న పద్మనాభరావుగారిని చూసి పుట్టపర్తి వారు 
 ఒరే మన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే గ్రంధ రచన చేయాలిరా 
ఈ అవధానాలు ఒట్టి సర్కస్ మాత్రమే
 వీని వల్ల ఒరిగేదేమీ లేదు అన్నారట
 అందువల్లనే 
తరువాత వారి అమూల్య సలహాను శిరసా స్వీకరించి 
 అవధానాలు తగ్గించుకొని గ్రంధరచన మొదలు పెట్టాను 
ఇప్పటికి దాదాపు ఎనభై పుస్తకాలు రాసిన తృప్తి నాకుంది 
ఒక పుస్తకానికి పుట్టపర్తి వారితో ముందు మాటకూడా వ్రాయించుకున్నాను అన్నారు
 చిన్నదాన్నయినా నాపై ప్రేమతో దయతో వారు ఇంటర్వ్యూ ఇవ్వటమే కాకుండా 
పొత్తూరి సాంబశివ రావ్ గొల్లపూడి వంటి మరికొన్ని ఫోన్ నంబర్లు ఇచ్చి ప్రోత్సహించారు
 వారికి నా కృతజ్ఞతలు 
 ఇక డా.రేవూరి అనంతపద్మనాభరావు గారి పుట్టపర్తి వారి స్మృతులు చూద్దామా ..

13 జులై, 2016

లక్ష్మణమూర్తి గారి ప్రసంగం

లక్ష్మణమూర్తి గారి ప్రసంగం ఇది
ఇది కూడా ప్రాచ్య లిఖిత గ్రంధాలయం వారు
పుట్టపర్తి అష్టాక్షరి కృతులు ముద్రించినప్పుడు జరిగిన సభలోని
ప్రసంగాలలో ఒకటి
నా కెమెరా క్వాలిటీ భయంకరంగా వుంది
వీడియో చూడడం మానేసి ఆడియో వినడం మంచిదనిపిస్తుంది
ఆ సందర్భాన్ని పట్టుకోవాలనే తపన అంతే

గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం

గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం ఇది.
 వీరు మన రాయలసీమవాడే. 
పుట్టపర్తి అభిమాని
ఈకార్యక్రమం త్యాగరాయ గానసభ ప్రాగణంలో జరిగింది
గతంలో నాగపద్మిని అక్కయ్య ఈ కార్యక్రమం నిర్వహించింది.
వీడియోక్వాలిటీ అంత బాగలేదు నా  ఫోన్ లో దయచేసి భరించవలసింది