22 సెప్టెం, 2015

బాహుబలి



బాహుబలి చూశాను
మొదటిసారి చాలా బాగుందనిపించింది.
యుద్ధ సన్నివేశాలు భలే ఉన్నాయండీ 
మీరు చూడాలి అసలు .. అని 
మళ్ళీ మా ఆయన్ను లాక్కు పోయాను

ఆయన సాధారణంగా 
కత్తి యుధ్ధాలు 
భీకర పోరాటాలు 
పగ ప్రతీకారాలు వంటి కథనాల పట్ల ఇంట్రస్ట్ కలవారు

 ఆయన తాపీగా చూసి 
నేను చదివే నవల కన్నా గొప్పగా యేమీ లేదు
 అని తేల్చేశారు
ఆయన కొత్తగా కొన్న సన్న (smart) ఫోన్ లో 
తమిళ  నవలలు చదువుకుంటూ వుంటారు..

మా పిల్లలు ఎప్పుడూ సెల్ ఫోన్ పట్టుకుని 
యేవో నొక్కుతూ చూస్తూ 
అదో లోకంలో విహరిస్తుంటే 
ఈయనా వాళ్ళముందు పోజ్ కొట్టటానికి 


చారిత్రక కథలు ఆయనకిష్టం
అప్పుడప్పుడూ 
తాను రాజ రాజ చోళ అని చెబుతూ వుంటారు..
నేను నందిని అట అంటే విలన్ అన్నమాట..

ఇంక బాహుబలి కొస్తే..
ప్రభాస్ దూకుతున్న ప్రవాహపు కొండల పైకి చూస్తు వుండటం..
పైకి వెళ్ళటం 
అక్కడ తమన్నా తో ప్రేమ 
ఆమె ద్వార ఆ మాహిష్మతీ సామ్రాజ్జపు గొడవ లోకి ప్రవేశించటం..

ఆ రాజ్జం కట్టడాలు
చాలా బాగుంది
ప్రజలను హింసించడం 
.వారి సొత్తు లాక్కోవటం ద్వారా పాలకుల నైజం 
గ్రాఫిక్సో యేమో .. 
యేదైతేనేం మూడుగంటల కాలక్షేపం
యుధ్ధ సన్నివేశాలు బాగున్నాయి
విలన్ ప్రత్యేకంగా ఉన్నాడు

నిజంగా మన పూర్వ వైభవం అలానే వుండేది
మంచి కవిత్వం చెబితే 
మెడలోని రత్నాల హారాలు విసిరేవాళ్ళు రాజులు
తగవులు వస్తే 
ధర్మ ఘంట మోగించి న్యాయం కోరేవారు ప్రజలు

సంగీత నాట్యాలు వినోదాలు 
రాజులకి ..ప్రజలకి ..
హరికథలు ..పురాణ కాలక్షేపాలు.. 
ఒత్తిడుల నుంచీ దూరం చేసే సాధనాలు
కవులను కావ్యాల సృజనకు ప్రోత్సహించేవారు

ఒకరిపై మరొకరు యుక్తులు పన్ని 
రాజ్జాలు ఆక్రమించుకొనేవారు కొందరు..
తమ రాజ్జం అన్యాక్రాంతం కాకుండా 
అనేక రక్షణ మార్గాలు అనుసరించేవారు

విజయ నగర సామ్రాజ్జం  ఎలా వుండేది
చూడండి

''1379 ఒకానొక శాసనం 
విజయనగరము నిట్లు గీర్తించినది
అయోధ్యానగర మధ్యమున శ్రీరామ చంద్రుడు వసించినట్లు ..
విజయనారమున హరి హరుడున్నాడు

హేమకూటమే దాని ప్రాకారము..
తుంగభద్రా నదీమతల్లి 
యా మహాపట్టణమునకు గందకము.

మూడులోకములను బాలించు శ్రీవిరూపాక్షుడే 
దానికి రక్షకుడు
ఆ మహానగరమును బాలించు రాజరాజు రాజమనోహరుడు హరిహరుడు

దానిని వర్ణించుటకు మాటలు చాలవు
ఈ పట్టణము రెండవ స్వర్గము వలె నున్నది 
యని 'వర్తిమా ' పల్కులు

ఇట్టి పట్టణము నెవ్వరునుగని యుండరు.. 
విని యుండరు.. 
దీనితో సరితూగు నగర మీ భూమండలమున లేదని ''యబ్దుల్ రజాక్'' వ్రాసినాడు

విద్యానగ ర స్వరూపము గూడా 
బ్రాచీనాచార్యుల మతానుసారమే యుండెను
శు క్రుని మతమున 
నొక పట్టణమర్థ చంద్రాకారముగ నుండవచ్చును
ఈ రెండును గానిచో చచౌకమున నుండవలెను

'సీజర్ ఫ్రెడరిక్'  'రజాక్'
 ఇర్వురును గూడా నా మహా పట్టణము వలయాకారముననే యుండెనని సాక్ష్యమిచ్చినారు

ఆ రాజధాని 
విదేశీయుల  కనులు జిగేలు మనిపించినది
దాని చుట్టును రక్షణ సాధనము లెన్నియె యుండెను
ప్రతి మహాద్వారముకడనొక దేవతను ప్రతిష్టించి యుండిరి
నాడు ప్రతి గ్రామమున కొక్కొక్క గ్రా మదేవత యుండెడిది
మరి విజయనగరమున కెట్లు లేకపోవును..??

ఆ మహానగరము యొక్క రక్షణాధిదైవము 
రణమండల భైరవుడు
స్వామికి గృష్ణదేవరాయలొక దేవళము నిర్మించెను
మండపమును గట్టెను .. 
గ్రామ దేవత నేర్పాటు చేసినంత మాత్రమున 
నిక సర్వము నాతడే జూచుకొనును 'మాకేమి లెమ్మని' 
యా రాజు లు..  ప్రజలు..   చేతులు ముడుచుకుని 
కూర్చుండ లేదు .. 

సాహస శౌర్యము లతో దమ ధన మాన ప్రాణము లొసగి 
యా  మహా పట్టణము ను సంరక్షించు కొనిరి రణ  మండల భైరవ స్వామి .. 
వారి యుత్సహమునకు ప్రతీకము .. 
వారి త్యాగమునకు ప్రతీకము .. ''

ఇలా సాగిపోతుంది రచన 
ఇది పుట్టపర్తి వారి విజయనగర సామాజిక చరిత్ర యైన 
'మరపురాని మధుర గాధ' లోనిది 

పుట్టపర్తి విజయనగర చరిత్ర చెబుతుంటే 
బాహుబలి లాంటి పది సినిమాలు చూసినంత థ్రిల్ కలుగుతుంది 
కానీ అది కథ కాదు 
మన చరిత్ర 
మాన పూర్వ వైభవం 






కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి