25 ఫిబ్ర, 2014

శ్రీ కైవల్య పదంబు జేరుటకునై.. అష్టాక్షరి నాధునిపై పుట్టపర్తి పద పల్లవాలు



పుట్టపర్తి కృతుల పని ఎలా జరుగుతుందో చూద్దామా
కొమండూరి శేషాద్రి గారు  సంభాషణ మీకోసం
ఇందులో కొమండూరి ప్రతికీర్తనను విశ్లేషిస్తూ సరిచూస్తున్నారు..
క్రింద వారు వ్యాఖ్యానించిన ఒక రెండు మూడు కీర్తనలనే ఇస్తున్నాను..
 

                  

ద్విజావంతి- అట తాళము
హిందుస్థానీ రాగం
సరిగమ పమదపా నిదనిసా
సనిదపామమగరిసమగస


మాటలలొ నేమిలేదే మనసా
మనసు రంగులు మటుమాయ చిత్రమ్ములు
 

సంస్తుతి నిందలు శబ్ద సంతతి సుమ్ము
శబ్ద సంతతి బట్టి బాధ జెందెదవే
 

ఉపకార మపకార మొక్కటే క్రియసుమ్ము
 ఉపకారమునబొంగి అపకారమునకేడ్తు
 

అష్టాక్షరీ రూపుడై కలియుగమున
నలరెడు దేవుని యడుగులు బట్టితె
 


                      శంకరాభరణము-అట తాళము
 ఆరోహణ  స రి గ మ ప ద ని స
అవరోహణ స ని ద ప మ గ రి స


పల్లవి.          ఎక్కడొచ్చినావూ తెరువరి       
అను పల్లవి.  దిక్కూమొక్కూలేని డొంకలలోని
 

చరణము.      వచ్చిన దెసబట్టి-వెనుకకు వోవోయి
                    అచ్చోటనే బ్రహ్మానంద శీతల జలమూ
 

చరణము.    పులుల మచ్చికజేసి- మలయ యోచించెడు
                   ఆరు కాచుకొన్న-వాఱ డిబెట్టూనే
 

చరణము.   అష్టాక్షరీస్వామి అది పండరినాథు                   డాతడు చూపిన అమృత సౌధమువీడి


              గౌళ రాగము-అట తాళము
ఆరోహణ .    సరిమ పనిస
అవరోహణ.  నిపమరిగమరీసా

 

చేదుకోవయ్యా నీ దరికీ రంగా
చేదుమేసీ  బ్రదుక బాధాయెనయ్యా
 

సుఖము సుఖంబని సోలి చచ్చుటె గాని
సుఖమంటె దుఃఖము శుధ్ధిగ జూచితె
 

నీ క్రీడ నా క్రీడ నీ జగతిలో జూచి
హర్షించి మెచ్చేటి ఆఢ్యులెవ్వరులేరు
 

అష్టాక్షరీదైవమా యెన్ని జన్మాల
నాడింతువయ్యా నా మెడకూ 

               నాటకురంజి రాగం -అట తాళం
ఆరోహణ       సరిగమ నిదని పదనిస
అవరోహణ    సనిదమగస
 
పల్లవి.          వజ్రఖచిత మకుటా విఠ్థలా
అను పల్లవి.    వాసుదేవా సర్వ భాసమానరూపా
 

చరణము.    మకుట కుండలములు మాటికి చలియింప
                  శిరసార్చి నాతోడ చెలువుగ మాటాడు
 

చరణము.   కడగన్నులా కాంతి కలువలు సృజియింప
                 కనకాంబరా నన్ను గారాముతో జూడు
 

చరణము. అష్టాక్షరీ మోహనా లోక సౌందర్య
               మధమము నీ చెన్నుటడుగులు జూచితె


                  చక్రవాక రాగం-అట తాళం
సరిగమపదనిస
సనిదపమగరిస
 

ఏమి చేసెదవూ ఇంకా స్వామీ
 

నీ లీల దలచితె నిలుచునయ్యా భయము

కలిపితి సంబంధ మలరులకునువోలె
కలగించుచుంటి ముఖంబు జూడగనీక
 

కరుణాకరుండన్న బిరుదు దాల్చుటెగాని
కరుణలేకా యెరుక కరణిని చరియింతు
 

అష్టాక్షరి సుందరా సర్వకాలంబు
లందు నీ పదముల నాలపించినదాని