9 ఆగ, 2012

పుట్టపర్తి వారితో నా పరిచయం - సామల సదాశివ..
  
దిన వార పత్రికలలో ..
సదాశివ పేరు చూడని వారుండరు.
ఉర్దూ లో మూడు వందలు..
తెలుగులో నాలుగు వందలు వ్యాసాలు 
ఆయన విజ్ఞాన భాండాగారానికి ఆనవాళ్ళు.
 
యాది రచన ..
ఆయన రచనా యానంలో పరిచయమైన 
వ్యక్తిత్వాల అద్భుతాలను  చూపే 
ఒక పద దుర్భిణి
ఇక సంగీతంలో 
ఆయన ప్రజ్ఞను తెలుసుకోవటానికి 
మనం ప్రయత్నించటం ఒక సాహసమే.
 
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని వివరిస్తూ 
"స్వరలయలు" వ్రాసారాయన
సంగీతం తెలియని వారికి కూడా 
సంగీతంలోని మాధుర్యం గురించి తెలియ జెప్పడానికి అందరికీ అర్థమయ్యేలా వ్రాసానది 
అంటారు.
అందుకే స్వర లయలను 
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరిచింది.
గిరిజన వీరుడు 
కొమురం భీంను విద్యార్థి లోకానికి 
తొలిసారిగా పరిచయం చేసింది కూడా 
సదాశివ మాస్టారే.
ఆయనే సామల సదాశివ..
పుట్టపర్తి వారితో పరిచయాన్ని 
ఎంత గంభీరంగా చెప్పారో చూడండి..

               వచన శైలిలో విలక్షణ పాండిత్యం
            వార్త వారపత్రిక ఆదివారం 1.9.2002


అయిదవ తరగతి వాచకం రాసే సందర్భంలో 
నా మీద అనుగ్రహం చూపిన మరో వ్యక్తి 
మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు 
నేను మరాఠీ ప్రాంతం వాణ్ణని తెలిసి 
ప్రతి మీటింగులోనూ విరామం దొరికినప్పుడల్లా..
"అప్పా ..
అలా వెళ్ళి చాహా తాగి వద్దాం పద.."
అనేవారు 
మరాఠీ లో టీని చహా అంటారు కదా.. 
అంటూ బీడీ తాగుతూ బయలు దేరేవారు 
ఆ పరిసరాల్లో టీ కొట్టు వుండేది కాదు. 
లకడీకాపూల్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. 
అంతదూరం వెళుతూ వస్తూ వారు చెప్పే మాటలు 
అనేక విషయాలు తెలియజేసినారు. 
బహు భాషా కోవిదులు వారు 
చనువు పెరిగిన తరువాత ఒకసారి 
మీ వచన రచన మీద 
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రభావం కనిపిస్తుంది అన్నాను. 

సాధారణంగా పండితులు 
ఇల్లాంటి మాటలు సహించరు. 
కోప్పడతారని అనుకున్నాను. 
వారు సగర్వంగా మందహాసం చేస్తూ 
"నిజమే అప్పా ..
రాళ్ళపల్లి వరు మా ఊరు వచ్చినప్పుడల్లా ..
మా నాయనగారితో 
గంటలు గంటలు సాహిత్య చర్చ చేసేవారు..!
 నేను శ్రధ్ధగా వినేవాణ్ణి ..
వారి సంగీత సాహిత్య పాండిత్యం మాటకేమి గానీ..
వారి వచన శైలిని కొంత పట్టుకున్నాననుకుంటాను..!"
అన్నారు .
సరస్వతీపుత్రునికి అంతటి వినయం
అప్పటి పండితులకు 
ఇతరులను గౌరవించే లక్షణం ఉండేది. 
పరస్పరం 
సాహిత్య వాదానికి దిగిన ఇద్దరు పండితులు 
ఒకరినొకరు విమర్శించుకునేవాళ్ళు 
కానీ అలా కానప్పుడు 
పండితులు ఒకరినొకరు గౌరవించుకొనేవారు.
  

  
కృష్ణాష్టమికి 
అయ్య రాసిన మధురమైన కృష్ణగీతాలు 
అలనాడు ఆకాశవాణిలో ప్రసారమయ్యేవి..
అవి ఇవే..
చదివి ఆనందించండి..
http://4.bp.blogspot.com/-QI2BQ5_0dxY/TmR56ezsOUI/AAAAAAAAAR4/RonSbbI1C2w/s1600/Lord+Krishna+Pictures+14.jpg

వరు భూషించిరో 
ఇందిరేశ కృష్ణా..

భువనావన ఎంతో 

ముద్దు గురియగా..

ఎవరు భూషించిరో.. ఇందిరేశ కృష్ణా...


యాదవులో.. దేవతలో..అప్సరలో..గోపికలో..
ఆదమరచి భక్తాగ్రేసరులో..మోహనమగునిన్నూ..


ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..


కటితటమున కరముతో .. 
ఘటియించిన పించముతో..
చటుల నూపురములతో .. 
సరిగ పీతాంబరముల నిన్ ..

ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..

అష్టాక్షరిమంత్రాధిష్టానమ్మగు రూపముతో..
ఆర్త రక్షక భక్తులు అనురాగాంబుధినిండగ..

ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..

 ఉత్తముల సంగతీ నాకిచ్చి మనుపుమా
చిత్త జనకా మురవైరి కృష్ణా..


మరి మరీ పుట్టలేను..
పరబాధ గనలేను..
పరిపరీ కష్టముల ..
అనుభవింపలేను..
జనన మరణములనూ..
పరిహరింపుమురా..
కరుణా సముద్రా..
మురవైరీ..కృష్ణా..          


ఉత్తముల సంగతీ నాకిచ్చి...


నిన్ను నమ్మిన పిదప అన్యాశ్రయంబేల..
పన్నంగ శయనా.. పాలింప వయ్యా..
మున్ను భక్తులనెల్ల..చెన్నార గాచితివి..
కన్నయ్య నను బ్రోవ కాల హరణంబేల...


ఉత్తముల సంగతీ..
ప్రజానందుడదిగో..
అదిగో..
యమునా హృదయమ్మదిగో..
 అదిగో..
ప్రజానందుడదిగో..


రణద్వేణువదిగో..
 అదిగో..
రాధాధిక సుందరుడల్లదిగో..


ప్రజానందుడదిగో..


సుమాతల్పమదిగో..
 అదిగో..
రమాకాంతుడదిగో..
స్ఫురన్నూపురములా ..
ఝణ ఝణ..విరావమ్ములదిగో..


ప్రజానందుడదిగో..


పరబ్రహ్మ మదిగో..
 అదిగో..
అష్టాక్షరి రూపమ్మల్లదిగో..
సురానందమదిగో..
 అదిగో..
నిరాధారులకు నిజమగు పెన్నిధి..


ప్రజానందుడదిగో..

ఒయ్యారముగ రారా శ్రీహరి..
ఒయ్యారముగ రారా..


వయ్యాళి చూపుల దియ్యంబుగొలుపుచు..
సయ్యాటలను మరునయ్యా దాసుండని..


వయ్యారముగ రా..రా..


కరానగల వేణు నాళముతో..
ఖగేంద్రవాహన గమనముతో..
నిరాదరణ సేయరాదు యదుపతి ..
సారంబుగా నష్టాక్షరి బట్టిరి..


ఒయ్యారముగ రా..రా..

యమునా తటిలో ..
తిరిగెడి వాడట..
చెలియా చూచితివా..


ఓ..చెలియా.. చూచితివా..


ఆ..అడగని అలకలతో..
ఆవుల క్రేవులతో..
ఆతడబడు నడకలతో..


యమునా తటిలో ..
తిరిగెడి వాడట..
చెలియా చూచితివా..


ఆ కన్నులలో పుట్టినవమ్మా..
అన్నీ అందాలూ..
అందుకె మరులున ..
వెంటబడిన మాకందని ..వాడమ్మా..
వాడూ...అల్లరీ వాడమ్మా..


యమునా తటిలో ..


మా మనసులలో..
మరులను రేపీ..
 మరగిన వాడమ్మా..

ఎంత వెదకినా..
అగుపడడమ్మా..

కరుగని వాడమ్మా..

వాడు..కపటపు వాడమ్మా..


యమునా తటిలో..
మునులకు.. గినులకు ముసుగూ వేసి..
మురిసెడివాడమ్మా..
మొగిని అష్టాక్షరి మంత్రములోనే..
వెలసెడు వాడమ్మా..


మాకూ కొలిచెడు వాడమ్మా..

యమునా తటిలో..


ఉప్పొంగకువె .. యమునా....
ఉప్పెనగ నీవిపుడు..
ఉర్విపై శీవాసు..
డుద్భవంబైనాదు..


ఉప్పొంగకువె..యమునా....


తరువులన్నియు సుమకదంబములు..భూమిపై..
జల జలమటంచు..వెన్నెలవోలె రాల్చినవి..
హరిణంబులుల్లాస భరిత హృదయములతో..
గల గలని ఆకులతో కడు చౌకళించినవి..


ఉప్పొంగకువె యమునా....


విసనకర్రలబోలు పించములు విప్పుళుగ..
నెమళులన్నియు గలసి నాట్యంబులాడినవి..
ప్రతి తృణము సంతోష భరితమై తూగినది..
బ్రహ్మాండమంతటా..పట్టనీ ఆనంద..ముప్పొగకువె యమునా..


పాడు కంసుడు తరిమి వచ్చునో యేమొయని..
వసుదేవుడీవైపు వచ్చుచున్నాడే..
అహ్టాక్షరీస్వామి ఆనందమయుడమ్మా..
ప్రేమామృతం వాని పెదవి కొసలనమ్మా..


ఉప్పొంగకువె యమున..ఉప్పొంగకువె .. యమున..
ఉప్పెనగ నీవిపుడు..
ఆకాశవాణి కడప భక్తి రంజని