కవి సామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ.
ఈయన వ్రాసిన
పండరీ భాగవత గ్రంధము
పూర్వ ద్విపద కావ్యముల కేమియు తగ్గిపోదు..సరికదా..
కొన్ని చోట్ల
పూర్వ ద్విపద రచనకు మెరుగు పెట్టినట్లుండును..
ఈయన యధిక శక్తిమంతుడనుటకు
తెలుగు దేశములో నీయన పొందిన
ప్రతిష్ఠయే సాక్ష్యము..
ఇట్టి కవి
పరుల యభిప్రాయము నాశించుట
యెందులకో తెలియదు..
అవతలి వానియందు గౌరవము నెరపుటకని యనుకొనుచున్నాను.
మా నడుమ మైత్రి చాల యేండ్లుగా గలదు.
కొన్ని కొన్ని యెడల నీయ
నా కంటె గొప్పవాడుగా..పరిగణింపబడుట
నేనెరుగుదును.
ఇట్టి నా నుండి
యభిప్రాయమాసించుట వట్టి స్నేహధర్మము.
కవి సామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ.10.6.1974