9 ఏప్రి, 2013

పుట్టపరి ప్రధమ వర్ధంతి సభ లో M. S . రెడ్డి ఏమన్నారంటే


పుట్టపరి ప్రధమ వర్ధంతి సభ లో M. S . రెడ్డి ఏమన్నారంటే 



అది పుట్ట పర్తి ప్రధమ వర్ధంతి సభ.
బీహార్ కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్
 పెండేకంటి వెంకటసుబ్బయ్య ముఖ్య అతిధి ,
సాహితీ పీఠం అధ్యక్షులు అంబటి గంగయ్యఅధ్యక్షులు నాటి రాష్ట్ర రెవెన్యూ మంత్రి 
డి.యల్.రవీంద్రా రెడ్డి,
రాష్త్ర చలన చిత్ర అభివృధ్ధి సంస్థ అధ్యక్షులు 
ఎం.ఎస్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అందరూ పుట్టపర్తి ని స్తుతించారు.
 గ్రంధాలను విశ్లేషించారు
 రాజన్న సాక్షాత్కారం లోని పద్యాలను
 గానం చేసి అలరించారు. 
అనంతరం ఎం.ఎస్.రెడ్డి గారు మాట్లాడారు.

నిర్మొహమాటంగా సూటిగా మాట్లాడటానికి 
పెట్టింది పేరు శ్రె ఎం.ఎస్.రెడ్డి గారు. 
ఆయన ప్రఖ్యాత నటుడు యన్.టీ.ఆర్ కే 
చెమటలు పట్టించిన వాడు. 
జమున సత్యభామాహంకారానికీ 
కారం తినిపించిన వాడు. 

ఆయన లేచి
ఇందరు సాహితీ సమరాంగణులిక్కడుండగా ఏమెరుగుదునని నన్ను పిలిచినారు..?
అన్నాడట..
ప్రొద్దుటూరుకు వచ్చి పుట్టపర్తి వంటి మహాకవిని గూర్చి మాట్లాడటం అంటే తిరుమలకు వెళ్ళి వేంకటేశ్వర మహాత్యం గురించి చెప్పినట్లుందని చమత్కరించారట..
జనం వారి మాటలను నవ్వుతూ ఆస్వాదించారట...










రామ రాజభూషణుని రసగుళికలు"



"రామ రాజభూషణుని రసగుళికలు"
భట్టభారతిలో 1984 ఆగస్ట్ ముద్రింపబడింది
శ్రీ వీణా రమాపతి రాజు గారు మాకు సుపరిచితుడు
పుట్టపర్తికి సన్నిహితుడు
ఒక్కఋఏమిటి 
అందరూ పుట్టపర్తిని పితృ సమానులుగా భావించే వారే
దానికి తగ్గట్టు
పుట్టపర్తి వారు చూపించే ప్రేమ 
వారిని మరింత దగ్గరికి చేరుస్తుంది

కడపలో జరిగే ప్రతి సభలో 
పుట్టపర్తి అధ్యక్షులు గానో ఉపన్యాసకులుగా ఉండవలసిందే
పుట్టపర్తి లేని సభ దాదాపు అరుదే
ఏ సభ జరిగినా పుట్టపర్తికి ఆహ్వానం వెళ్ళేది

ఎక్కువ శాతం కడప జిల్లా గ్రంధాలయ సంస్థ 
 అధ్వర్యలో జరిగేవి
వేణుగోపాలరెడ్డి మల్లెమాల,రా రా,వైసివి,జానుమద్ది,
శశిశ్రీ పాల్గొనేవారు 

రమాపతి శశిశ్రీ ఎవరో ఒకరి భుజం చుట్టూ చేయి వేసి ఒకచేయి పంచె అంచులను పట్టుకోగా 
వెనుకకు మడిచి సభలో  
అడుగు పెట్టే వారు పుట్టపర్తి

వీణా రమాపతి రాజు గారు
కడప జిల్లా గ్రంధాలయ సంస్థ లో పనిచేసేవారు
ఎక్కువగా పుస్తకాలతోనే వారి పని
తరుచుగా లైబ్రరీకి వెళ్ళే పుట్టపర్తి 
ఒరే 
ఫలానా పుస్తకం వెతికివ్వరా
అంటే
అదే పనిగా తక్కిన పనులు పక్కన పెట్టి
పుట్టపర్తి వారు అడిగిన పుస్తకాన్ని 
పది ఇరవై అలమరలలోనుంచీ వెతికి పట్టుకుని
 వారికి అందిచ్చే వాడు

కాసేపు లైబ్రరీలో గడిపిన తరువాత
ఒరే రారా పోదాం 
అంటే
వస్తున్నా స్వామీ
అంటూ 
మళ్ళీ పుట్టపర్తికి తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి
నడుచుకుంటూ వచ్చి ఇంటి వరకూ దిగబెట్టి
 కాసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడి 
మా అమ్మ ఇచ్చిన కాఫీ తాగి 
మళ్ళీ తన పనికి వెళ్ళే వాడు రమాపతి 

ఒకసారి రమాపతికి వేరే ఊరు ట్రాస్ఫర్ అయ్యింది
వెళ్ళిపోయాడు
ఇక పుట్టపర్తికి కనుపించడం మానేసాడు
లైబ్రరీకి వెళ్ళిన పుట్టపర్తికి
పుస్తకాలు వెతికి ఇచ్చేది ఎవరు..
ఇబ్బంది పడ్డారు పుట్టపర్తి

వెంటనే గ్రంధాలయ సంస్థ అధికారికి లెటరు వ్రాసారు
వాడు వెళ్ళినప్పటి నుంచీ 
నాకు చాలా ఇబ్బందిగా ఉంది
పుస్తకాలు వెతికి ఇచ్చే వారు లేరు
వాడిని వెంటనే కడపకు తిరిగి బదిలీ చేయండి అని

గ్రంధాలయ సంస్థ అధికారి ఆ ఉత్తరం చూచి నవ్వి
రమాపతిని తిరిగి కడపకు పంపేసారట
నాతో తన స్మృతులను పంచుకుంటూ చెప్పారు రమాపతి

వారినీ వీరినీ అడిగి 
రమాపతి ఫోన్ నంబరు పట్టుకున్నాను
పలకరించాను
ఎంతో సంతోషపడ్డారు
ఆనాటి జ్ఞాపకాలు పంచుకున్నారు
తన వద్ద ఉన్న కొన్ని అరుదైన వ్యాసాలు జాగ్రత్తగా పంపారు
వీరందరూ వానిలో పుట్టపర్తిని చూచుకుంటున్నారు
లేకపోతే వారు గతించి ఇరవై సంవత్సరాలవుతోంది
అయినా అవి ఇంకా సజీవంగా ఉన్నాయి
ఎందుకు
వానిలో 
పుట్టపర్తి ప్రేమ ఇంకా పరిమళాలు వెదజల్లుతూ వారి గుండెను తడుముతోంది ..
అంతే కదూ 

ఈ రామరాజ భూషణుని రసగుళికలు చదవండి మరి..