8 అక్టో, 2012

సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం



మా అయ్యగారు 
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు
కవి
పండితుడు
విమర్శకుడు
గ్రంధకర్త
సంగీత సాహిత్య నాట్య శాస్త్రాల పారమెరిగినవారు..

అంతేకాదు.
గొప్ప వాగ్గేయకారులు..
అధ్భుతమైన కృతికర్త..

నిజమైన భక్తిని అనుభవించి..
ఆ అనుభవసారాన్ని 
మంచి మంచి కీర్తనల రూపంలో 
మనకూ అందజేసిన పరమ భక్తుడు 

వారి కృతులు 
కడప హైదరాబాదు విజయవాడ విశాఖ పట్నం 
ఆకాశవాణి కేంద్రాలలో 
గత నాలుగు దశాబ్దాలుగా అలరించాయి..

ఆ నాళ్ళలో..
మంచి సాహిత్యం 
మంచి సంగీతం
మంచి శ్రోతలు
మంచి కాలం
అలా అన్నీ అమిరాయి

అమృతాన్ని పంచే ఆ ప్రాభవాన్ని 
మళ్ళీ అక్షరరూపం లో అందరికీ అందించాలనీ
అనుభూతితో పాడే కంఠాల్లో
వాని జీవత్వాన్ని మీరూ అనుభవించాలనీ
ఓ చిన్ని ప్రయత్నం..

అదే..
సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం గా 
మీ ముందుకు తెస్తున్నాను..

ఇందులో 
మా అమ్మా అయ్యా ఇద్దరూ వ్రాసినా..
అమ్మ అయ్య వెనుకే వుండటానికి ప్రాధాన్య మిచ్చారు.
కనుక 
ఆ తల్లి 
ఆ సరస్వతీపుత్రునిలో 
సగ భాగం ఎన్నడూ విడదీయలేనిదైంది..

Enter your message here.