28 ఆగ, 2014

సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య


గో తెలుగు.కాం లో పుట్టపర్తిని గురించిన వ్యాసం పడింది
శ్రీ చెరుకు రామ్మోహన రావ్ గారు ఎంతో ఆత్మీయంగా బదులిచ్చారు..
 

కడపలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నారు..
ఆయన facebookలో మెసేజ్ చేస్తూ 

నీ అన్న కాని అన్న..
అని పోస్ట్ చేసారు..
నా హృదయం పులకించిపోయింది..
వారు వ్రాసిన వ్యాసంలో మెరుపులివి..



ఒక మహాకవిని..
పండితుడిని
పధ్నాలుగు భాషల దిట్ట
నాలుగు రూపాయల కోసం ఆశపడడం అవీ దొరకకపోవడం..
ప్చ్..
 

అందరూ పద్మశ్రీ వస్తే చాలని ఎదురుతెన్నులు చూస్తే..
దాని ద్వారా యేవైనా డబ్బులు వస్తాయని అనుకున్నారట..
కానీ ఒక కాగితం స్మృతి చిహ్నం ఇచ్చారట..
సహాయంకోసం శ్రీమతి ఇందిరా గాంధీ ని అడిగారట..
ఆమె కలెక్టర్ కు అప్లయ్ చేసుకోమన్నారట..
ఆ కలెక్టరూ స్కూల్ టీచర్లకు ఆ అర్హత లేదన్నారట..
యేమిటివన్నీ.

మంచి మంచి అవకాశాలను 

చేజేతులా వదులుకొని..
మంచి ఉద్యోగాలను.. 

తృణమాత్రంగా వదిలేసి..
వాళ్ళనూ వీళ్ళనూ సహాయం కోసం అర్థించడం..

అవకాశం వచ్చినపుడు..

ఉద్యోగం కంటే స్వాభిమానం గొప్పది..
వాళ్ళకాళ్ళూ వీళ్ళకాళ్ళూ పట్టుకోవటం చిన్నతనం..
ఒకరికి పెట్టటమే కానీ
దేహీ అనటం ఎందుకు
భగవంతుడు ఇచ్చినది తినడానికీ తాగడానికీ సరిపోదా..
అన్న భావనలు.,



కుటుంబా వసరాలు మీద పడినప్పుడు 
ఎవడైనా సహాయం చేస్తే బాగుండు నన్నతలంపు 
అంటే డబ్బు ఆ అవసరాలకు సరిపడా వస్తే చాలు 
ఎక్కువ వద్దు.. 
దాచుకోవడం 
దాన్ని చూసి మురిసిపోవటం అంటే ఏహ్యత 

ఈ  వ్యక్తిత్వాలు ఈరోజుల్లో కనిపిస్తాయా..?


ఒక సంగీతవిద్వాంసుడు పాడితే..
చెమర్చిన కళ్ళతో భార్య చేతిగాజులు 

ఆయన కాళ్ళ దగ్గర పెట్టే సుబుధ్ధులెవరండీ..
 


మా పెద్దక్కయ్య పెళ్లి చందాలెత్తి చేసారట 
పిల్ల పెళ్ళికి చెం దాలెత్తడం పెళ్ళి చేయడం
అదేమీ తప్పుకాదు..

 అలానే శిష్యులు పుట్టపర్తి కథ నడిపించారనుకోండి .. 


సదానందీ శ్వరయ్య గారు వ్రాసిన ఈ వ్యాస భాగం ఇది 
అవును సదానందం చెప్పినట్లు 
పద్మశ్రీ తీసుకొని తప్పు చేసాను 
అన్న వాక్యం వెంటాడు తూం ది ..



సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య


శ్రీమాన్ పుట్టపర్తి వారికి 
ప్రభుత్వము పద్మశ్రీ బిరుదునిచ్చిన సందర్భముగా మైదుకూరులో యువజనసాహితీ సంస్థ తరుపున 1973లో ఆచటి హైస్కూల్ ఆవరణలో 
ఒక బహిరంగసభ జరిగింది. 

ఆచార్యులవారికి సన్మానం, 
కవి సుధాకర ఎస్. రాజన్న కవి అధ్యక్షత వహించగా 
నేను వక్తను, 


ఆ రోజుల్లో సహజ యవ్వనం కారణంగా ఆచార్యులవారుపద్మశ్రీ తీసుకొన్నందుకు ఆక్షేపించాను. ఆ బిరుదు సినీనటుడు రేలంగి వేంకటరామయ్యకు ఇచ్చిన తర్వాత ఇచ్చారు. 


అంతకు మునుపే నారాయణాచార్యుల వారిని
 రేడియో గుర్తించని నాడు, 
శాసనమండలి, 
సాహిత్యపరిషత్తులు తిరస్కరించిన నాడు కూడా

 ప్రజలు, 
సాహితీ పిపాసులు, 
ప్రజల మనిషని గుర్తించారు. 


హంగులతో అహంతో 
కవులు గగనసీమలో విహరించే రోజుల్లో 
ఆయన మానవత్వమున్న మనిషిగా
 ప్రగతిపథంలో పయనించినారు. 


కావున ఆచార్యులవారు 
జనప్రియ రామాయణందే కాకుండా 
సమాజగతిని నగ్నంగా చిత్రించగల 
జనతారామాయణం వ్రాయుమని 
మరొక గుడిగంటలు మ్రోగించి, 
పురోగమనాన్ని వ్రాయమన్నాను. 


స్వామికి ఏ రోజు సభలోను 
అధ్యక్ష, ముఖ్య అతిధి, ముఖ్యోపన్యాసకులు అని సంభోదించేఅలవాటు లేదు. 
సన్మానానికి జవాబిస్తూ ఇలా అన్నారు. 

“వాడు సదానందం” చెప్పినట్లు 
నేను పద్మశ్రీ తీసుకొని తప్పుచేసినాను.
 ఇంకా MLCకి ప్రయత్నించాను. 
రేడియోలో ఉద్యోగం ఇస్తామంటే ఆశపడ్డాను.
 ఇవన్నీ పొరపాట్లే. 


పద్మశ్రీ అంటే ఏదో కొంత డబ్బు ఇస్తారనుకున్నాను. 
కాని డిల్లీలో ఒక కాగితం, స్మృతిచిహ్నం ఇచ్చారు. 
ఈ మాటను నేను 
శ్రీమతి ఇందిరాగాంధి గారిని అడిగాను.
 ఆమె ఆర్ధిక సహాయానికి 
మీ జిల్లా కలెక్టరుకు అప్లయ్ చేయమన్నారు. 


కడపలో కలెక్టరు గారిని అడిగినాను. 
ఆయన ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవారు 
Below poverty line క్రింద రారని చెప్పి
 రిక్తహస్తాలు చూపించారు. 


కానీ సదానంద చెప్పినట్లు 
ఒకేరకమైన కవిత్వం నేను వ్రాయలేను. 
వ్రాయను. 


నేను వానివలె 
ఏ committed Ideology కు చెందిన వాడిని కాను. 
నా మనస్సు ఎలా స్పందిస్తే అలా వ్రాస్తాను. 

ఇప్పటికే కొన్ని వందలపేజీల గేయసాహిత్యం, ప్రాచీనసాహిత్యం వ్రాశాను 
‘ఎవరైన ప్రచురించి నాకు కొన్ని ప్రతులిస్తే సంతోషిస్తానన్నారు” 

ఇదే ఆయన సిసలైన నిజాయితితో వెలిబుచ్చిన నిఖార్సయిన మనస్తత్వము