శ్రీ గరికపాటి వారు
''నవరస భరితం నా తెలుగు పద్యం''
అన్న అంశం మీద తణుకు నగరంలో 2014 ఏప్రిల్ 3న మాట్లాడుతూ..
వీరరసానికి ఉదాహరణగా ..
పుట్టపర్తి వారి పద్యాన్ని ఉటంకించారు..
నన్నయ భట్టారక పీఠం 83 వ వార్షికోత్సవ సందర్భంగా
ఈ సభ జరిగింది..
ఈ లింక్ నాకు మా అక్కయ్య నాగపద్మిని ద్వారా చేరింది. దీనిని శ్రీ నాగ త్రివిక్రం గారు తనకు అందజేసినట్లు చెప్పింది ఆమె
శ్రీనాగ త్రివిక్రం గారికీ ..
మా అక్కయ్య నాగపద్మినికీ..
నా బ్లాగ్ముఖంగా కృతజ్ఞతలు.
https://www.youtube.com/watch?v=rxKM3O8Mgko
you tube link
ఇది ప్రసంగం దాదాపు 50 నిమిషాలు గడిచిన తరువాత పుట్టపర్తి వారి ప్రస్థావన వస్తుంది.
తెలుగు వాళ్ళ పౌరుషం మీద పద్యం ఇది
ఎమ్మెల్యే ల ఇంటి ముందు ఈ పద్యం flexi కట్టి చదివించాలట ..
గరికపాటి వారి చమత్కారాలు..చురుకలు
సభను రంజింప జేసాయి ..
''కదనముఖంబునన్ పిరికి కండలు కానని వారు
వీరతాస్పదులగు భర్తలు వు ధ్ధవిడి శాత్రవులన్ చె రలా డి వచ్చుఁచో
పదను దొలంకు వారి కరవాలపు నెత్తుట
కుంకుమాకృతుల్ వదనము లందు దిద్దుకొ ను
పత్నులకెల్ల నమస్కరించెదన్.. ''
ఖడ్గ తిక్కన బాలచంద్రుడు మొదలైన వీరులే కాదు
మొన్న యూరీ దాడిలో కన్నుమూసిన మన వీర జవాను
మదన్ లాల్ శర్మ తల్లి కొడుకు శవ పేటిక మోసి
తన కొడుకు దేశం కోసం ప్రాణాలు విడిచాడని
చిరంజీవి అ ని తనను తానే ఓదార్చు కుందట
ఆమె పేరు ధర్మో దేవి ..
గరిక పాటి వారు ఉదహరించిన పద్యం
పుట్టపర్తి రచించిన
సాక్షాత్కారము అనే కావ్యం లోనిది ..