16 జన, 2012

సంప్రదాయానికి విరుధ్ధంగా రాసిందే ఆధునిక మవుతుందా..
రామాయణాలు లెక్కలేనన్ని
మరి విష వృక్షం ఒక్కటే..
  
రంగనాయకమ్మ బాపుకి బ్లాంక్ చెక్ పంపారంట .. 
ఆ పుస్తకానికి అట్ట పై బొమ్మ వేసిపెట్టమని
అది తిరిగి వచ్చింది..
దాని పై "శ్రీరామ" అని రాసి వుంది...


కేవలం రాక్షస సంహారం చేయటానికే ..
రామావతారం వచ్చివుంటే ..
రావణాసుర సంహారం జరిగిన వెంటనే ..
రామావతార పరిసమాప్తి జరగాలి..
 
కానీ  అలా అవలేదు..
ఒక ప్రతిజ్ఞ చేసారు బాలకాండలో..
దశవర్ష సహస్త్రాణి..దశవర్ష
తానిచ  అన్నారు ..
నేను 11,000 సంవత్సరాలు ..
భూమండలం మీద వుండి..
భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను..
దేనికొరకూ..
ఒక మనుష్యుడు మనుష్యుడుగా బ్రతకటమెలాగో నేర్పడం కొరకు..
చదవండి..


సంప్రదాయానికి విరుధ్ధంగా రాసిందే ఆధునికమవుతుందా..?

మన దేశంలో సంప్రదాయమూ ..ధర్మమూ..
రెండూ ముడిపడి వున్నాయి. 
కవిత్వం యొక్క ప్రధాన లక్షణం 
ధర్మాన్ని బోధించడమే కాదు ..

ముప్పాళ్ళ రంగనాయకమ్మ
ఆ కార్య నిర్వహణానికి  
ధర్మశాస్త్రాలూ ..స్మృతులూ ..
మొదలైన ఉపకరణాలున్నాయి

కనుక ..
కవిత్వం అనేది..
ధర్మ నిర్వహణలో పెద్ద ఉపకరణమేమీ కాదు. 

అట్లానే ..
ధర్మాన్ని పూర్తిగా ఉల్లంఘించడం కూడా ..
యోగ్యతను మీరిన అధిక ప్రసంగమౌతుంది.
కవిత్వం యొక్క ప్రధాన లక్ష్యం ..
దానిని చదివే సమయంలో..
బాహ్యములను మరచిపోయి ..
దానిలో లీనమయ్యేటట్లు చేయడం ..
ఆ రీతిగా చదివినప్పుడు. ..
ఒక సంస్కారం మనకు ఏర్పడుతుంది. 
దానితో మనసు విశాలం కావటానికి అవకాశం ఉంటుంది.
కావ్యంలో నాయికా లక్షణాలున్నాయి. 
పరకీయ నాయికలనే తీసుకున్నారు.
అభిసారికా వర్ణనలు
 అక్కడక్కడా కావ్యాల్లో వస్తాయి. 
అందులో కొంత "అనీతే" అంతర్గర్భితమై ఉందనుకుందాం. 
ఇవి ఏవో సామాన్య విషయాలు.
లోకంలో సర్వత్రా కాకపోయినా ..
ఎక్కడో ..ఒకచొట జరిగితే జరుగవచ్చు..

అటులనే సంప్రదాయాన్ని 
సమూలంగా ఖండించి.. 
విశృంఖలత్వాన్ని ప్రేరేపించే రచనల్ని చేసి..
ఇది ఆధునికత ..
అని ఎద గుద్దుకోవటం..
 బుధ్దిలేని పని. .
చాలా దినాల క్రిందనుకుంటాను ..
ఏదో ఒక కావ్యమో ..కధో ..చదివాను. 
అందులో అశోకవనం లో ఉన్నసీత ..
రావణాసురుని ప్రేమను చూచి జాలిపడి..
అతనిని కౌగిలించుకోవడానికి తయారవుతుంది. 
నా మనస్సుకు చాలా నొప్పి కలిగింది. 
మన మనస్సే.. 
మన రచనల్లో అభి వ్యక్త మవుతుంది. 

ఎక్కడో ..ఎవ్వరో..
వ్రాస్తే చదివానో ఘట్టం..
భరతుడు శ్రీరాముని పాదుకలను నెత్తిమీద పెట్టుకుని వచ్చేది. 
చెప్పులు మోసేవాడు ..
వీడేం మనిషి అన్నాడాయన ..
రచయిత మనస్సలాంటిది.
మరి రాముని చెప్పులపైనే ..
దేశికులు "పాదుకా సహస్రము" వ్రాసినారు.
ఆ పాదుకలను మనం పూజిస్తున్నాం.
ఇలా మాట్లాడే వాళ్ళంతా 
ఆటవిక మనస్తత్వులని నాకనిపిస్తుంది. 
వారు మమ్మల్నీ అదే మాటంటారనుకుంటాను. 
అస్తు.. 
నాకేమీ నొప్పి లేదు..
కానీ దీన్నంతా ఆధునికత ..
అని వాదిస్తే మాత్రం మా మనస్సంగీకరించదు.