23 జన, 2013


 అపారమైన భక్తి వైరాగ్యం జ్ఞానం ఉన్నవారు
ఎక్కువగా లోకంలో తిరగడానికి ఇష్టపడరు..
ఎక్కడో అరణ్యాల్లో
ఏ గుహల్లోనో ముక్కు మూసుకుని
తపస్సు చేసుకుంటూవుంటారు..
కానీ ..
అష్టాక్షరీ మంత్ర సాధనా సిధ్ధుడు
పుట్టపర్తి..
జగమంతా తిరిగి..
సాధు సంతుల సాంగత్యంలో 

సాధనా సంపత్తిని ఏరుకుని.
తన విశేషమైన మేధా సంపత్తిని  

ప్రపంచానికి వెదజల్లి
ప్రపంచమనే నాటకరంగం నుంచీ 

పొత్తూరు వెంకటేస్వరరావు గారు చెప్పినట్లు 
ఆముష్మిక మనే ముల్లెను సర్దుకుని వెళ్ళిపోయారు ..
పుట్టపర్తి వారితో కడపలో 

ఎన్నో సభలను పంచుకున్న

 మల్లెమాల వేణుగోపాల రెడ్డిగారు 

అడిగిన వెంటనే పుట్టపర్తి వారిని గురించి 
ఎంతో ఉద్వేగ భరితంగా 
తమ అనుభవాలను పంచుకొని 
వారి వద్ద వున్న మా అయ్యగారి 
కొన్ని జ్ఞాపకాలను పంపినందుకు 
కృతజ్ఞతలు  తెలియజేస్తూ
పుట్టపర్తి అనూరాధ.