20 నవం, 2015

కర్మఫలం
అయ్యా నీవు పూర్వజన్మలో ఎవరు
అని అడిగాను ఒకరోజు
అప్పటికి మా అమ్మ పోయింది .. 
అయ్యా  నిర్లిప్తతలో ఉన్నారు .. ఒక విధం గా .. 
నన్ను నిదానంగా చూశారు అయ్య
నా వంటి మూర్ఖురాలికి ..
అజ్ఞానికి ..
చెప్పాలనిపించిందో..  
అప్రయత్నంగా చెప్పారో .. మరి.. 

'అళియ రామరాయలు' అన్నారు 
ఆ జవాబుకు నా  రియాక్షన్ ఏమీ లేదు ..  
మా ఇంట్లో గత జన్మలు పునర్జన్మలు.. 
కర్మ లు బంధాలు .. 
ముక్తి మార్గాలు 
అన్నీ కామన్ వర్డ్స్ .. 
ఆ ప్రశ్న ఎంత బరువైందో .. 
జవాబు ఎంత విలువైనదో .. 
దాని అర్థమేమో నాకు తెలియదు అప్పుడు
అది నిజమా కాదా అన్న ఆలోచనా లేదు
అడిగాను ..చెప్పారు అంతే..

మల్లాది గారి జన్మ కర్మ చదువుతున్నాను.. 
అది నిజంగా ఒక కష్టమైన సబ్జెక్ట్ .. 

నిజమే కదా 
ఒక ఆవు పూజలందు కుంటుంది 
ఒక ఆవు చీత్కారాలకు గురి అవుతుంది 

ఒక పూవు నేలపై 
ఒక పూవు పూజకై 

ఏమిటీ వింత .. 
ఒకరికి మేడలూ .. ఒకరికి పేవ్ మెంట్లు . 

పాపాత్ముడు సుఖాలలో .. 
మంచివాడు  నిట్టూర్పులలో .. 

వారి వారి పూర్వజన్మ పాపకర్మ వల్లనే వారికా జీవితం 
అందరూ దీనికి త్వరగా కనెక్ట్ అవుతారు
పుట్టినప్పటినుంచీ మన మెండ్ సెట్ అలా తయారు చేసారు మనవాళ్ళు

దీనికి నాస్తికు దీన్ని అంగీకరించడానికి చస్తే ఒప్పుకోరు
అంతా మీ భ్రమ అంటారు
కనపడని శక్తిని..
అది తమమీద చేసే పెత్తనాన్ని ఒప్పుకోవటం
వారి మితిమీరిన అజ్ఞానానికి అహంకారానికి ప్రతీక.

నాస్తిక భౌతికవాదులు అంటే శాస్త్రవేత్తలు
వీరికి ప్రతిదానికి ఋజువులూ నిరూపణలూ కావాలి
అందరికీ ఒకే మెదడు పెట్టినా 
కొందరే మేధావులుగా తయారవుతున్నారన్న 
కొన్ని ప్రశ్నలకు వీరు జవాబేం చెబుతారో కానీ
వీరు నిరూపణలు కోరే కొద్దీ..
అందుకు సవాలు విసిరే మరో పది ప్రశ్నలు 
వెన్నడుతూనే వుంటాయి..
ఇవి అసుర లక్షణాలని గీత లో కృష్ణుని ఉవాచ

కర్మ సిద్ధాంతం ప్రకా రం .. 
గోడకి కొట్టిన బంతిలా మనం చేసిన కర్మ 
మనవేపు వేగంగా వస్తుంది
కర్మలు మనం చేసే ఫోన్ కాల్స్ వంటివి
భగవంతుని రికార్డు ల్లో ఎప్పటికప్పుడు 
అవి నమోదైపోతూనే వుంటాయి

తగిన సమయంలో 
తగిన శరీరం ఇచ్చి 
మనన్ని మన కర్మ ఫలాన్ని అనుభవించేలా చేసే వాడు  ఆ దైవం .. 
కర్మ ఫల ప్రదాత.

కర్మ ఫలాన్ని యోగులైనా అయోగు లైనా 
అనుభవింపక తప్పదు. 
ఇదే ఎన్నోసార్లు చెప్పేవారు పుట్టపర్తి 
ఈ కర్మ ప్రస్థానం  లో 
మా అయ్యా నేను ఏ మలుపులో కలుసుకున్నామో 

ఏ మలుపులో విడి పోయమో .. 
నాకు తెలియదు కాని 
ఈ కలయిక ఎప్పటికీ అద్భుతమే నాకు ..