24 నవం, 2013

నేను సరస్వతీ పుత్రుణ్ణి..






 









ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది
ఎందుకంటే..
మా అయ్య గురించి ఎంత కమ్మని సమాచారం దొరికింది..
అది ఇంతవరకూ నాతోనే వుంది..
నా ఫోల్డర్ లోనే..
కానీ నా దృష్టే పడలేదు..
ఆంధ్రప్రభ లో పనిచేసిన జి కృష్ణ  
అప్పుడు వ్రాసిన పేపర్ కటింగ్ అది
మొన్న అక్కయ్య నీకోసం అంటూ 
కొన్ని పేపర్ కటింగ్స్ ఇచ్చింది
మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు 
నీకేం తేవాలని అడిగింది
తామర గింజల జపమాల తెచ్చింది 
అయ్య తామర గింజల జపమాల 
కొంతకాలం ఉపయోగించారే 
ఐశ్వర్య ప్రదమట..అంటూ
స్ఫటిక మాల ఇంకొకరికి
సరే..
ఆ జి. కృష్ణ యేం చెప్పారంటే 
పుట్టపర్తి తో తన మూడు అనుభవాలను
ఎంతో నిజాయితీగా తాను పుట్టపర్తిపై వివాదం నడపడానికి ప్రయత్నించి విఫలుడనైనాని చెప్పుకున్నారు

ఇక పుట్టపర్తి గురించి G.క్రిష్ణ చెప్పిన 
మూడు అనుభవాలలో ఒక్కటి మీకు చెబుతా..
తీపిని కాస్త కాస్త తింటే భలేగా వుంటుంది..

ఇప్పుడు నా స్కానర్ అందుబాటులో లేదు
తరువాత 

ఆ పేపర్ కట్టింగ్ ఈ పోస్ట్ కు జతచేస్తా ..
 (ఆంధ్రప్రభ -పేజ్ -4, 26-6-1994-
అప్పుడు-ఇప్పుడు..ఇప్పటికి ఇంతే గదూ ..)
పుట్టపర్తి నారాయణాచార్యులు సాహసి
జంకూ గొంకూ లేకుండా కవితా సరస్వతిని కదపాయించగలడు
సాధించటం కంటే లాలించి వశం చేసుకోగలడు
 ఆయన కవిత్వం ఎంతో వ్యక్తిత్వం కూడాఅంతే
 

ఆయనకు కవిత్వం తప్ప యేమీ రాదు 
ఆయనకు కొన్ని తెలుగేతర భాషలు తప్ప 
వేర యేమీ రాదు
ఆయనకు కావ్యగానం తప్ప మరే ప్రజ్ఞలేదు
వగైరా వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఉన్నారు
 

మొత్తానికి 
ఎవ్వరి దృష్టీ దోషం ఎవ్వరి దృష్టి బలం లేకుండానే 
పైకి వచ్చేశాడు
పైకి వచ్చినవాడు పైన పైపైన తిరగడాయేమిటి
వాటిని బట్టే కదా మన ఆనందాలు
అసూయలు
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారితో నాకు మూడు అనుభవాలు ప్రాప్తిచినాయి
ఒక పర్యాయం ఆయనపై ఒక వివాదం నడుపుదామని యత్నించి విఫలుడనైనాను
యేదో ఒక అంశం పట్టుకుని పత్రికలలో వివాదం చేయవచ్చు
విశ్వనాధ సత్యనారాయణకు వివాదం ఇష్టం
సరిగా చెప్పాలంటే 

ఆయన అనుకూలురకు ప్రతికూలురకు 
వివాదం ఇష్టం లేదు
 

'ఎందువలన ఇష్టం లేదు '
అని వివాదాన్ని నిలిపివేసిన తరువాత 
ఆయనను అడిగాను
'విశ్వనాధ సత్యనారాయణకు ఇష్టం కదా '

అని కూడా ఉదహరించాను
'ఆయన కవి సామ్రాట్టు..

అంటే అది ఒక రాజకీయ పదవి  ..
నేను సరస్వతీ పుత్రుణ్ణి..
నాది వారసత్వం ..'

అని హాయిగా నవ్వి
కాఫీ తెమ్మని నా భార్యను పురమాయించాడు
ఇతను ఓడడు
అంతే..