21 డిసెం, 2012







గొల్లపూడి మారుతీరావు 

ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, 

సంపాదకుడు, వ్యాఖ్యాత,విలేఖరి. 

తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. 

తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను 

నటుడిగానూ సుపరిచితుడు. 

సినిమాల్లోకి రాకముందు నాటకాలు, 

కథలు, నవలలు రాశాడు. 

రేడియో ప్రయోక్తగానూ, 

అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగానూ, 

ఆంధ్రప్రభ(దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ 

పనిచేశాడు. 

సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన 

డాక్టర్ చక్రవర్తి కి 

ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు 

మరో మూడునందులు అందుకున్నాడు. 

తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన 

పరిశోధనాత్మక రచనలు, నాటకాలు 

ఆంధ్రప్రదేశ్ లోని  విశ్వవిద్యాలయాల్లో 

పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.



సినీ నట జీవితంలో చదువు 

వెనక బడిపోయిన దేమో కానీ 

పుస్తకానికి దూరమయ్యే దుర్దశ 

ఎన్నడూ నా జీవితంలో రాలేదు. 

అన్నరు మారుతీరావ్ గారు.

గ్రంధాలయాన్ని దేవాలయంగా భావించి 

అక్కడే తన తన తొలిరోజులను వెతుక్కున్న 

మారుతీరావ్ గారు
 
ఇంగ్లీషు కధలను కూడబలుక్కుని

చదివి అలవాటు చేసుకుని  



టాగూర్ కథలు, 

గీతాంజలి muse, 

ఆయన Stray Birds, 

Leo Tolstoy 

“The Prisoner of Caucasus”, 

Jules Verne 

“Round the world in 80 days” 

తెలుగులో అనువదిం చే స్థాయిని చేరుకున్నారు. 

ఆయన కడపలో అకాశవాణిలో పనిచేసిన రోజులలో 
మా ఇంటికి వచ్చేవారు


సినిమా సంగతులు 
ఎన్ టీఆర్, ఏన్ ఆర్ అని ఏవేవో సంగతులు చెప్పేవారు

ఒకసారి ఒక సమావేశంలో 
ఏ ఎన్ ఆర్ గారూ నేనూ కలిసాం
పొరపాటున వారి చెప్పులు నేనూ నా చెప్పులు వారు తొడిగేసుకున్నాం
తరువాత నవ్వేసుకున్నాం
ఇలా..
అరవైలలో మారుతీరావ్ గారు రాసిన 
చీకట్లో చీలికలు అనే నవలకు 
మా అయ్య ముందు మాట వ్రాసారట
నిన్న నేను కలిసి నప్పుడు అది ఒక్క కాపీ కూడా 
తన వద్ద లేదనీ
ఎక్కడైనా విచారించమనీ చెప్పారు.
అడగ్గానే సమయం ఇచ్చి 
పుట్టపర్తి వారి అమ్మాయివా అని 
ఎంతో ఆదరంగా మాట్లాడిన మారుతీరావ్ గారికి 
ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు ...