వరంగల్ వాసి.. వారు పుట్టపర్తి మేఘదూతంపై ఏడెనిమిది వ్యాసాలు వ్రాసారట అంతగా నన్ను ప్రభావితం చేసింది మేఘదూతం నన్ను అని చెప్పారు వారి మాటలను వినండి.. ఆ పైన మేఘదూత కావ్యారంభానికి పుట్టపర్తి వారిలో ప్రేరణ కలిగించిన విద్వాన్ విశ్వం గారి పలుకులను జానుమద్ది హనుమచ్చాస్త్రి గారి మాటలలో చదవండి.. మేఘదూతం ఆ కోవకు చెందినది అన్నారు ముకురాల రా మారెడ్డిగారు. కేవలం పేరులోనే సామ్యం ఉన్న కాళిదాసు మేఘదూతమూ పుట్టపర్తివారి మేఘదూతము వస్తువులో భిన్నమైనవి. ఆ నాళ్ళలో విపరీతమైన ప్రతికూల అనుకూల ప్రతికూల వాదాలనెదుర్కొన్నది పుట్టపర్తివారి మేఘదూతము కాళిదాసు మేఘదూతం లేదా మేఘసందేశం కేవలం 111 శ్లోకాలతో సంస్కృత సాహిత్యంలో కాళిదాసు రచనలలో విశిష్ట స్థానాన్ని పొందింది. అలాంటి ఒక మేఘ దూతాన్ని పుట్టపర్తి వారూ వెలయించారు అందులో శాపానికి గురైన ఒక యక్షుడు సంవత్సరం పాటు కుబేరుని కొలువునుండీ బహిష్కరింపబడి తన స్వతఃస్సిధ్ధ మహిమలు కోల్పోయి చిత్రకూటం వద్ద రామగిరి అరణ్యాలలో తిరుగుతూ అలకాపురిలోని తన ప్రేయసిని తలుచుకుంటూ.. భారంగా కాలం గదుపుతున్న సమయంలో ఒక ఆషాఢ మేఘం అతని కళ్ళ బడింది.. తన ప్రేయసికి తన కబురు చెప్పమంటూ దాని కాళ్ళా వేళ్ళా పడతాడు. "ఓ జలదా! అన్యమార్గము లేక ఈ దూతకార్యము నీకప్పగించుచున్నాను. నా ధూర్తత్వమును మన్నింపుము. నా దయనీయ స్థితిని చూచి నీవీ సందేశమును అందజేతువని ఆశించుచున్నాను. ఆపై నీ ఇచ్చవచ్చిన యెడ నీవు తిరుగవచ్చును. నీకెన్నటికిని ప్రియ వియోగము సంభవించకుండు గాక". మెత్తబడిన మేఘునికి వెళ్ళవలసిన దారిని వివరిస్తాడు మరి .. పుట్టపర్తి వారి కథానాయకుడు ..??
"తన వంటి మానవుల దైన్యమే సుఖశయ్యగా
వారి నిట్టూర్పుగాడుపులు చామరలుగా
వారి కన్న్నీట కరగు దినములపైని నిలచి
మేమూ మానవులమంచు గొంతెత్తి
యార్చు ధనికులజూచి యసురనియన్నాడూ
వాడు మానవుడూ.."
అన్యాయమన్నందుకే అతన్ని కటకటాలపాలు చేసారు అంతప్రయాణమూ చేసి ఆమెను చేరిన మేఘుడిని ఇలా హెచ్చరిస్తున్నాడు యక్షుడు చూ డండి ... ఆయనేమో శాపగ్రస్తుడై చెట్టూ పుట్టా పట్టుకు తిరుగుతున్నాడా..? పైగా ఆమెపై విరహంతో దుఃఖిస్తున్నాడా..? ఓ మేఘాన్ని బ్రతిమాలి తన చెలికి కబురు పంపే ప్రయత్నమా..? పైగా ఆ మేఘునికో షరతు అదేవిటంటే తన ప్రేయసి నిద్ర పోతుంటే లేపొద్దట.. కాస్త దయతో ఆవిడ లేచే వరకూ వేచి వుండాలిట.. ఇదెక్కడిచోద్యం..? "ఆ నా భవనమున ఇంపైన పలువరస, సన్ననైన నడుము, చకిత హరిణీ నయనములు గలిగి, యౌవన మధ్యస్థ యైన ముద్దులొలుకు వయ్యారపు బొమ్మ యున్నది. ఆమెయే నా ప్రియతమ, నా బహిఃప్రాణము, మద్వియోగ సంతప్త. ఒకవేళ ఆమె గనుక నిద్రిస్తూ ఉంటే దయతో సద్దుమణగి వేచియుండుము. తరువాత మెల్లగా మేలుకొలిపి మందస్వరముతో నా సందేశాన్ని వినిపించు..." పుట్టపర్తి వారి కధానాయకునికీ ఓ ప్రేయసి.. ఆమె నిలా తలచుకొని నిట్టూరుస్తున్నాడు "నిడుద గన్నులదాని.. నిండు జెక్కుల దాని.. నడుము వడకెడు దాని.. పేర్మి పొడవగుదాని.. దానిమ్మ పూవంటి తళుకు బెదవుల దాని.. తన్వంగి దలపోసి తలపోసి నిట్టూర్చు.." ఇంకా అతడెలా ఉన్నాడంటే.. "పవలెల్ల నాకలికి పంచప్రాణములూగి రేలెల్ల ప్రియురాలి బాళి గన్నుల నిల్చి యెడబాటు గుందింప నెపుడు పవలగునంచు కడుపు నిప్పులు గ్రుమ్మ కలుగునా నిశియంచు బ్రతుకు బరువై మరణ మెదలేని దేమంచు.. ఇక ఆ కారాగారం ఎలా వుందీ.. "క్షణమునకు తంబూర సారించు జోరీగ ఇంతింతగా చీకటీగ రక్తము ద్రాగు తలలోన మెదలు పేనులు రాము సేనలై తనువుపై ధూళి పేరినది తనువున్నదే.. పాలకులు దిని చివికి పారవేసిన ముట్టె.." ఈనాటి కారాగారాలూ అలానే వున్నాయ్ పెద్ద మార్పేమీ లేదు కదూ ఇక జైలులో ఆహారం సంగతి చూద్దాం.. "జలజలని పురుగులే చెరలాడు సంగటికి ములుకులే యైన యంబలికి .. నాయువు బట్టి బ్రతికియున్నాడు నిశ్వాసములె పరిధానమై జీవితము నరకమై జెలికాడు ..మంటిపాత్రయి మూల్గు వంటి ఆకారమ్ము.." మూల్గు వంటి ఆకారమ్ము ఎంత హృద్యమైన పోలిక .. ఇంక తన ప్రేయసిని తలుచుకొని ఇలా పొంగిపోతున్నాడు.. "ఆభరణములు లేని దది వింత సొబగయ్యి మల్లెపూవట్లు నా మగువ నవ్వినయపుడు.. పట్టపగలే ఇంట పదివేల దీపాలు వెర్రిబాగుల చాన వెన్న వంటీ మనసు.. దులకింప తోకచుక్కలవంటి కనులతో .. జూచె నా పదివేలు.." అచ్చం నాకయితే మా అమ్మను వర్ణించినట్లే వుంది ఎన్ని కష్టాలలోనూ చిరునవ్వు చెరగనీయని అమ్మ నవ్వితే పట్టపగలే ఇంట పదివేల దీపాలు మరి.. మరి పుట్టపర్తి వారి మేఘ దూతానికి ప్రేరణ ఏమిటి రండి .. హనుమచ్చాస్త్రి గారినడుగుదాం ....
అతని భార్య గర్భవతి.
నెలలు గడిచినా అతన్ని
విడుదలచేయలేదు.
ఒకనాడు చలికి వణుకుతూ,
జైలు గోడల అంచుల క్రిందకి దిగి
వచ్చిన
దట్టమైన మేఘాన్ని చూచి భయంతో
విశ్వంతో తన బాధను వెల్లడించాడు.
ఈ
ఉదంతం విన్న పుట్టపర్తి కళ్లు చెమ్మగిల్లాయి. కాళిదాసు మేఘ సందేశం తళుక్కున
మెరిసింది.
ప్రబంధ సాహిత్యానికి అభ్యుదయ సాహి త్యానికి సేతువు వంటి వారు పుట్టపర్తి నారాయ ణాచార్యులు. విజయనగర చరిత్ర పట్ల అమితమైన ఆసక్తి కలవారు. 48-49 మధ్య కడపజిల్లా చపాడు గ్రామంలో, పర్ణ కుటీరంలో కొంతకాలం ఉండేవారు. కుందూనదికి వరదరావటంతో పుట్టపర్తి వారు రచించిన 'అస్త సామ్రాజ్యము' (విజయనగర చరిత్ర) అన్న కావ్యంతో పాటు పర్ణకుటీరం కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఎంతో శ్రమకోర్చి రాసిన కావ్యం కొట్టుకుపోవడంతో అమితంగా బాధపడినారు. ఆచార్యుల వారి మిత్రులైన విద్వాన్‌విశ్వం పొద్దుటూరులో ఉన్న పుట్టపర్తి వారిని కలుసుకున్నారు. 'అయ్యా.., ఈ మధ్య పద్య రచన అచ్చుబాటు కావటం లేదు. ప్రజా హృదయంలో నిలిచే కావ్యం రాయాలని ఉంది. సరైన వస్తువేదో సూచించమని ' కోరారు. వెంటనే విశ్వం మాట్లాడుతూ 'మాత్రా ఛందస్సులో రాస్తే బాగుంటుంది ' అన్నారు. తన మనసులోని కథావస్తు ఘట్టాన్ని చెబుతూ, ఒక ఉదంతాన్ని వివరించారు. భారత స్వాతంత్రోద్యమ కాలంలో విశ్వం కడలూరు జైల్లో ఉండగా, శ్రీకాకుళం నుండి, అప్పుడే పెళ్లి చేసుకున్న దళిత యువకడుడొకడు. తెల్లదొరలపై తిరుగుబాటు చేశాడు. ఒక అర్థరాత్రివేళ పోలీసులు వారి ఇంటిపై పడి, అతడి భార్యను కాళ్లతో తన్ని, అతన్ని ఈడ్చుకుని వెళ్లి, ఆపై తప్పుడు కేసు బనాయించి, విశ్వం ఉన్న జైల్లో బంధించారు. అతని భార్య గర్భవతి. నెలలు గడిచినా అతన్ని విడుదలచేయలేదు. ఒకనాడు చలికి వణుకుతూ, జైలు గోడల అంచుల క్రిందకి దిగి వచ్చిన దట్టమైన మేఘాన్ని చూచి భయంతో విశ్వంతో తన బాధను వెల్లడించాడు. ఈ ఉదంతం విన్న పుట్టపర్తి కళ్లు చెమ్మగిల్లాయి. కాళిదాసు మేఘ సందేశం తళుక్కున మెరిసింది. ఈ సంఘటనను తెల్పిన మిత్రుడు కీ||శే|| మల్లెల నారాయణ. ఒక యక్షుడు సేవకావృత్తిని సక్రమంగా నిర్వహించనందున, కుబేర ఆగ్రహంతో ఏడాదిపాటు దూర ప్రాంతానికి తరిమివేశాడు. యక్షుడు భార్య వియోగ దుఃఖంతో ఉన్మాదియై అశ్రమాలు అరణ్యాలు తిరిగాడు. ఒకనాడు ఆషాడమాస మొదటి దినమున, ఒక మేఘఖండం చూచాడు. భార్య వియోగతప్తుడై మేఘంతో తన వేదనను వెల్లడించాడు. ఇది కాళిదాసు రచించిన మేఘ సందేశ కావ్య ఇతివృత్తం. పుట్టపర్తివారు సంస్కృతాంధ్ర కన్నడ కావ్యాలెన్నింటినో అందించిన మహా మేధావి. కాళిదాసు మేఘ సందేశ కావ్యమును తలచుకుని, విశ్వం చెప్పిన ఉదంతా న్ని మాత్రా ఛందస్సులో మేఘ దూతంగా రాశారు. జైల్లో ఉన్న ఖైది ఊచల మధ్య నుండి తన భార్యకు సందేశం పంపదలచి: ''తనవంటి మానవుల దైన్యమే సుఖశయ్యగా /
వారి నిట్టూర్పు గాడ్పులే చామరాలుగా /
వారి
కన్నీట కరుగు దినములపై నిలచి /
మేము మానవులంచు గొంతెత్తి అర్చు/
ధనికుల
జూచి యసురులన్నాడు /
వాడు. ..మానవుడూ''
ఆచార్యుల వారు జైలులోని ఖైదీచేత మేఘంతో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చారిత్రిక కట్టడాలను, నాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులను, రాచరిక పీడనా వ్యవస్థను తెలుపుతూ ''మనుజులను నేగోరలేను.. శిలలైన
మనసులకు నే పాడలేనూ ..
ఈసెరుగనట్టి 'జీసస్సు' రక్తము గ్రోలి..
పాశవమ్ముగా మార్చె- భూమినే ఈ జాతి..!!
నా సుఖుడ..! విన్నావో..! కావో..! ఆ సోక్ర
టీసును చంపిన గాథలేవో.. !
నశ్వరముగానట్టి.. విశ్వమానవ మైత్రి
బోధ సేసిన యట్టి ..బుద్దుడేమాయెనో..??''అని దీనంగా విలపిస్తాడు. ఓ మేఘమా.., ఈ కడలూరు కోటదాటగానే పడమటి భాగాన తిరుపతి కొండలు రాయలసీమ, సర్కారు శ్రీకాకుళం ప్రాంతాలు కనిపిస్తాయి. నీకు కనిపించే కరువు కాటక భూములను గమనించు '' నిండుటాకలి దూయ
మండుటెండలు గాయ
నడపీనుగులవోలే నిలచీ
శిరస్సుపై
గడు ధూళియును దుమ్ము బెరసీ కనబడెడు హరిజనులపై సుంత యా దరము
నీవైన
పరపరా..! వారినోదార్చు వారేలేరు..""అటు చూడవో యి .. ! య
క్కటిక మానగదోయి ..!
కంకరను గొట్టుచున్నాడూ..! పొట్టలో
డొక్క లేర్పడు బి ల్లవాడూ.. ! వాని కను
గ్రుడ్ల లో కన్నీరు -కొంచెముగా దిగజారి ..
కాయగాచిన వాని కరమె గాల్చుచునుండె..''
అంతేకాదు, ఓ మేఘమా ఇంకా కొంచెం దూరంపోతే.. "వాడే కమ్మరిచూడు..!
దౌర్బగ్యముల గూడు..!
కొలమి నూదుచునున్నవాడూ..! తన పొట్ట
కోసమై నవయుచున్నాడూ..! అల్లంత
దూ రాన నదెవాని తొయ్యాలి ని కనుగొమ్ము
జీరాడు చనులతో ..చీరనోచని దాన..!"అంతేకాదు, ఓ మేఘమా, అక్కడే చూడు
"తెలి నవ్వు టం దముల..
జిలికింప మొగముపై
పాలకై ఏడ్చుచున్నాడూ .. బుడతండు
పట్టుతలకెత్తికొన్నాడూ.. ఆ తల్లి
చనుబాల నిచ్చునో..!తన యు రము జీ ల్చిర
క్తంబులే ద్రాపునో..! ధనికు లేమెరుగుదురు..?''అంటూ ముందుకు సాగుతూ చూడమంటాడు "ప్రతిపల్లెలో నీకు..
బాళెగానిది కోట..
పాళె గాడైనట్టి రెడ్డీ- గనుపించు..
ప్రజల సౌఖ్యములడ్డి - రచ్చబం
డలపైని నేడు ''పంచాయతు' లు లేవురా
'పులి జీతములు' రంగు పే కలాట లెగాని''
ఆ రీతిగా పయనిస్తూ : శ్రీశైలం చూచి
''మల్లికార్చున దేవ
మల్లికా
నిభ కటా
క్షాంచలంబుల జలదరించీ - భ్రమరాంభ
ఇంచు నవ్వుల బల్లవించీ - శ్రీశైల
మెదుట గన్పడు నీకు, మదవతీమృది కి
న్నెరులతో - హరులతో -దరులతో సొబగాని" కృష్ణా ప్రాంతములను చూస్తూ
"క్షేత్రయ్య లేనిదే
తెన్గు నకు
రుచియేది..!!
తేనియలు సారించినాడూ.. కృష్ణుడే ..
నట్టువలు ద్రొ క్కిం చినాడూ నాయకీ
భావమూనిన సుకవి పదము మరిగిన స్వామి.. నారదాదుల పాటపై రక్తిగోలువడే..''కోనసీమ వైభవాన్ని చూసిన తర్వాత 'ఆనంద గజపతుల
యశము నిచ్చినతోట
విజయనగరము దోచునీకూ - గంటకం
బము జూడకుండపోబాకు - గీర్వాణి
యామూర లా స్యంబులాడు
నిప్పుడు గూడ
సకల కళలకు నద్ది చదురోయి..! నవజలద.."
మేఘము ఎన్నో నదులు, పురములు చూచి చివరకు శ్రీకాకుళం చేరింది. 'ఏ తెర్వు బ ట్టు నో..
యింతకును మేఘమ్ము..
జవరాలి
జూచునోలేదో - చూచినను
ఈ మాట చెప్పునో లేదో - చెప్పినా
యాభాష లా గువ కర్థమౌనో..లేదో..
కదిలినది మేఘమ్ము ..కాంక్షవితా నమ్ము''
అంటూ తన సంశయాన్ని, అనుమానాన్ని నిష్కపటముగా వెల్లడిస్తాడు. తానే తన కావ్యంతో వాచ్యం చేస్తూ '' సర్వతో ముఖమైన సంస్కారమును గల్గి సాగిపోయెడు నట్టిసత్క (విత్వమువోలే) - మానవ విలువలకు వన్నెపెట్టి కమనీయమైన మేఘదూత కావ్యం రచించిన అభ్యుదయ కవి పుట్టపర్తి. |
14 ఫిబ్ర, 2013
పుట్టపర్తి మేఘదూతంపై శ్రీ గిరిజా మనోహర్
లేబుళ్లు:
వ్యాసాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)