25 జులై, 2013

పుట్టపర్తి వర్ణించిన విశ్వనాధ





ఇరవై తొమ్మిదేళ్ళ వ్యక్తి
విశ్వనాధ పై అద్భుత వ్యాసం వ్రాసాడు
అప్పటికి విశ్వనాధ నలభై తొమ్మిదేళ్ళ వారు..
విశ్వనాధ ఎంతగా ఆనందపడ్డారంటే
అతన్ని అభినందించడానికి స్వయంగా కదలి వచ్చారు
ఆనాటి నుంచీ ఈనాటి వరకూ
విశ్వనాధ పాండితిని వినిపించే 
ఇంకొక పదునైన వాణి వినరాలేదు
అది విశ్వనాధ వారే స్వయంగా చెప్పిన మాట
ఆయనే మన పుట్టపర్తి .. 

తన్ను తాను నిరూపించుకోవటానికి 
పెద్దలచే వీడు మా సరి వాడు
లేదా మాకంటే అధికుడు అనిపించుకోవటానికి 
కొంత యుధ్ధం తప్పదు మరి..


విశ్వనాధ పుట్టపర్తి గురించి 

ఏవో చెబుతుంటారు కానీ. 


తరువాత దాన్ని ఇద్దరూ పట్టించుకోలేదు.. 
పైగా పుట్టపర్తి విశ్వనాధ మూర్తిమత్వం గురించి 
పరమాద్భుతంగా భారతికి వ్రాసారు

సాహితీ ప్రపంచంలో ఈనాటికీ 
ఈ వ్యాసం ఎంతో విలువ గలిగిందని అంటారు..

ఇందులో విశ్వనాధ వారి గురించి పుట్టపర్తి 
ఇతడాంధ్ర మందమాపోశనమే పట్టినాడు
నన్నయ నుపాసించినాడు
తిక్కనను సేమమడిగినాడు
శ్రీనాధునితో చేయి కలిపినాడు
పోతనను మ్రొక్కికొన్నాడు
రాయలనాటి వాఙ్మయము చదివినాడు
ఆముక్త మాల్యదనామోదించి తెనాలిరాముని వియ్యమందినాడు

అంటారు..

అంతేనా విశ్వనాధను విమర్శించినవారికి
అరివీరభయంకరుడై బదులొసగినాడు పుట్టపర్తి..


ఇంకొక సంఘటన.. 
1953 లో ఆలంపురం లో జరిగిన తెలుగు సభలలో 
"తెలుగు కన్నడముల చుట్టరికము "
పంపని భారతం ఛాయలు 
నన్నయ్య భారతం లో వున్నాయని 
పుట్టపర్తి వ్యాసంతో వెళ్ళారు..

పెద్ద గొడవ జరిగింది
అందరూ విరుచుకు పడ్డారు 
పుట్టపర్తిని 
మారువేషంలో వున్న కన్నడవాడని 
కూడా దూషించారట

సర్వేపల్లి రాధకృష్ణన్ గారు
అందరినీ సావధానంగా కూర్చుని ప్రశాంతంగా 

వినమని సభికులను అర్థించారట.. 


ఆనాటి సభకు సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులు
ఆ సన్నివేశంలో విశ్వనాధ
నేను కన్నడము నేర్చుకొని పంప భారతం చదివి 
నీ వాదానికి జవాబు చెబుతాను అన్నారట.. 


సేకరణ పుట్టపర్తి అభిమాని శ్రీ రామావఝుల శ్రీశైలం 

చిన్న చిన్న అక్షరాలు ఇబ్బంది పెడితే
క్రింద zoom చేసిన వ్యాసభాగలు తేలికగా చదవవచ్చు