2 జులై, 2016

సంహార తాండవము

సం హార తాండవము
ఈ తాండవము ప్రపంచ లయమును సూచించునని నాట్యశాస్త్రము పేర్కొనినది. 
మాయా వ్యామోహములనుండి 
జీవకోటిని విముక్తము చేసి 
తనలో ఐక్యము చేసుకొను తత్వము కలిగినది 
నటరాజు ప్రదర్శించిన సం హార తాండవము

"శోకమ్ము సంతోషమేకమ్ము నరకంబు
 నాకంబ నేకమ్మనంత మాకాశమ్ము
 పరిగతంబగు భూమి నవనిధులు బిల్వములు
 తరుణ బీజములు గొవ్విరులు, గసి మొగ్గలును  
 జఠరాంధకా రంబు పరిణాహి చంద్రికలు
 పరమ ఋషుల జ్ఞాన భరితులందరుకునే
 డద్వైవైత మద్వైతమని మాటి మాటి
 కద్వయముగా నొత్తి, యఖిల లోకము లా ర్వ.. "

సర్వ ప్రపంచము పరమత్మయందు లీనమై 
అద్వైత స్థితి ననుభవించినట్లు చెప్పబడుట చేత 
నిది సం హార  తాండవము. 
ఇది 
పంచకృత్యములలోని లయభావమును
 సూచించును
 ఈ విధముగా ఈ శివతాండవ కావ్యము 
'తలపైని చదలేటి అలలు తాండవమాడ '
అని సృష్టి భావము ప్రకటించు వర్ణనముతో ప్రారంభించబడి 
సం హార తాండవముతో ముగించబడినది. 
సృష్టి స్థితి తిరోధాన అనుగ్రహ లయాత్మకమైన ప్రంచకృత్యములు ప్రకటించు సప్త తాండవములు 
ఈ కావ్యమునందు వర్ణింపబడినవి. 

సంధ్యాసమయమున నటరాజు నృత్తము చేసినట్లు చెప్పబడి సంధ్యాతాండవముగ కని పించు నీ కావ్యము సప్త తాండవ వర్ణనము కలిగి 
" శివతాండవము" 
అను కావ్య నామమునకు విస్తృతార్థము స్థిరపరచినది
-వఝ ల  రంగాచార్య
శివతాండవము ఒక పరిశీలన.