16 నవం, 2012

గజ్జెల మల్లారెడ్డి.
                                              
                              గజ్జెల మల్లారెడ్డి.జ్ఞానపీఠ రాలేదని గ్లానిచెంది లాభమేమి,
పట్టువిద్యలోతెరుగని 
బాధవల్ల ఫలితమేమి,
పైరవీలు లేనిది చిరు పదవి రాదు మహాకవీ,
సామర్థ్యానికి నూకలు చెల్లినాయి కళారవీ..  

గజ్జెల మల్లారెడ్డి. 
మాటలకచేరి ఉదయంలో..

గుంటూరు శేషేంద్ర శర్మ
                     
                     పుట్టపర్తి వారి అభిప్రాయం
                       గుంటూరు శేషేంద్ర శర్మ 


మహా భావుకుడు ..
తాను రాసే ప్రతి ముక్కా కూడా ..
సార్థకంగా వుండాలని ఉబలాటపడే మనీషి.

డా. మర్రి చెన్నారెడ్డి


                           డా.మర్ర్రి చెన్నారెడ్డి
ప్రివ్యూ

కవితా భాషా ప్రపంచంలో
 శ్రీ పుట్టపర్తి ప్రముఖ వ్యక్తి.
ఆయన మృతి వల్ల ఏర్పడిన ఖాళీని 
భర్తీ చేయటం కష్టం. 

  -మాజీ ముఖ్యమంత్రి 
డా.మర్రి  చెన్నారెడ్డి.

డా.సి.నా రా య ణ రె డ్డి                      డా.సి.నా రా య ణ రె డ్డి 
ప్రశస్త కవిగా 
ప్రాచ్య పాశ్చాత్త బహుభషావేత్తగా 
అత్యంత మౌలిక సాహిత్య విమర్శకుడుగా 
తెలుగునాట గణుతికెక్కిన 
డా.పుట్టపర్తి నిర్యాణం 
భాషా సాహితీ రంగాలకు తీరని అఘాతం 
1953 నుంచీ నన్ను నోరారా తమ్ముడూ అని లాలించిన అన్న 
ఇవాళ లేడు..
ఎవని పదమ్ములు శివతాండవలయాధి రూపమ్ములు,
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు,
అతడు పుట్టపర్తి సూరి,
అభినవ కవితా మురారి,
అతని చతుర్ముఖతకు 
విస్మితులు కాని విజ్ఞులు లేరి.. 
ఒకటి రెండు బాసలు నాలుకపై తిరుగుట గగనమ్ము,
ఒకటి రెండు కబ్బములు పెకలించుట అబ్బురమ్ము,
పదికి మించు బాసలలో పసిడి నిగ్గు లేరుకొన్న 
పుట్టపర్తి ధిషణకు జేకొట్టగ మనసాయె నాకు..

-డా.సి.నా రా య ణ రె డ్డి 

పుట్టపర్తి మాటలలో నండూరి వారి ఎంకి పాటలు


                         పుట్టపర్తి మాటలలో 
                    నండూరి వారి ఎంకి పాటలు


నండూరి వారి 
ఎంకి పాటలు ..  
ఎప్పుడైనా హాయిగా 
పాడు కోవటానికి పనికి వస్తాయి..

గుంటూరు శేషేంద్ర శర్మ-

పుట్టపర్తి వారి గురించి  గుంటూరు శేషేంద్ర శర్మ-


గొప్ప కవి 
గొప్ప విద్వాంసుడు. 
అన్నింటికంటే 
మానవత్వం తొణికిసలాడే మహా వ్యక్తి. 

-గుంటూరు శేషేంద్ర శర్మ

.