13 ఆగ, 2015

ప్రబంధ నాయికలు.. గిరిక. రూప చిత్రణ..


వీణాధనంవీణా ధనం..

రెండు మూడు తరాల క్రితం 

వీణా వాదనంలో పేరు పొందిన స్త్రీ..

వీణా షణ్ముగ వడివు.. 

వీణాధనం ..

లలితా వెంకట రామన్ 

మొదలైన వారి రికార్డులు 

సంగీత సాధకుల ఇళ్ళలో 

అతి పవిత్రంగా పూజింపబడేవి..

వీణా షణ్ముగ వడివు కుమార్తె మన M.S సుబ్బులక్ష్మి.


ఈమె రికార్డుల విని తమ సాధన చేసేవారు 


సుబ్బులక్ష్మి..రావు సరస్వతీ దేవి తదితరులు


ఆకాలంలో యేవాదనం నేర్పినా 

గాత్రం తోటే నేర్పేవారు..

''వీణాధనం పాడుతూవాయించిన రికార్డులు

మావద్దవున్నా 

అందులోపదాలుస్పష్టంగాతెలిసేవికావు..

అంటే వీణా తంత్రుల మృదు స్వనాలలో 

ఆమెకంఠం కలిసిపోయేదన్నమాట..

పైగా పరవశత్వంతో కూడిన పాటలో 

ఆ  భావ సమ్మోహనంలో 

స్వరం తంత్రీ స్వనంలో మిళితమై పోయేది..

ఇది ప్రముఖ విమర్శకుడు , 

సంగీత విశ్లేషకుడు.. అయిన 

A.V.K. రంగారావు 

రావు సరస్వతీ దేవి కుమారుడు.. 

M.S.సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా 

వ్రాసిన వ్యాసం లోని విషయాలు..

ఆ వీణా దానం గారి గురించి 

పుట్టపర్తి చెప్పిన మాట లివి ..
అతని గిరిక కిన్నెర మీట వీణె బలికింపగ నేర్చినది..

అంతమాత్రమే గాదు
గీతము వాడును
ప్రబంధము లాలపించును
మరియొకరికి ననివారిత చాతురితో జెప్పించును

ఆ గురుత్వము  నామె వల్లకితోనే యారంభించెను
అనఘ కంఠాలప్తి సౌభాగ్యములను  
వ్యాలోలాంగుళి సంజ్ఙ చే వీణెకే నేర్పించుచున్నదట..
అంటూ..

సాధారణముగా గాత్ర పాఠకులకు 
మేళము వల్లకి యీ రెండును 
ఒరవడియైన వాద్యములు
ఆ సంగతులను వారు 
కంఠములో బల్కించుటకు యత్నింతురు..

వారి గమకములు జారులు మొదలైన వాని 
నంది ఇచ్చు వాద్యములవియే 
'వీణాధనం' గారట్లు పాడుచుండెడువారని 
పెద్దలు చెప్పగా విన్నాను

వీణెలో బాడుచున్నప్పుడామె కంఠము 
వేరుగా వినిపించెడిదే గాదట..
ఆ మహా సాధనకై యామె లయ శుధ్ధిని గూడ 
త్యాగము చేసియుండెనని వినికిడి..

నాకా మె పాట విను భాగ్యము పట్టలేదు..
మరి మన గిరిక వీణెకే శృతిశుధ్ధిని నేర్పించుచున్నది రామ రాజ భుషణుని సంగీతాభిరతి 
కావ్యములలో నెచ్చట బట్టినను 
వీణా తంత్రివలె మ్రోయును..
యతి అయ్యము మొదలైన సంగీత పారిభాషికములాతడు శ్లేషగా నుపయోగించును...
ఇలా సాగిపోతుంది.. పుట్టపర్తి ధార..