కడప రామకృష్ణా జూనియర్ కాలేజీలో
పుట్టపర్తి గారు తెలుగు పండితులుగా పైచేస్తున్న రోజులలో ..
ఒకసారి కడపకు శృంగేరి పీఠాధిపతులు వచ్చారు.
ఈయన స్వామి దగ్గరకెళ్ళినా తనతోటి బ్రాహ్మణులు
పుట్టపర్తి గారికి పిలక లేదనీ ..
బొట్టులేదనీ..
సాంప్రదాయక వేషం లేదనీ ..
పీఠాధిపతులకు పరిచయం చేయలేదట..
స్కూలు కరస్పాండెంట్ అయిన శ్రీ రంగనాధం గారు పుట్టపర్తిని పరిచయం చేశారు..
అప్పుడు వెంట వెంటనే
15, 20 శ్లోకాలు పీఠాధిపతుల్ని ప్రశంసిస్తూ సంస్కృతంలోచెప్పారు పుట్టపర్తి
ఆ తర్వాత
స్వామి పుట్టపర్తి వారిని తన రూముకు పిలిపించుకుని
'అధాతో బ్రహ్మ జిజ్ఞాస'
అన్న మొదటి బ్రహ్మ సూత్రంపై చర్చకు దిగారు
గంటన్నరసేపు వాగ్వాదం జరిగింది
స్వాములవారు పుట్టపర్తిని
పెద్ద జరీ అంచు శాలువాను కప్పి ఆశీర్వదించారు..
ఆ తర్వాత మాట్లాడుతూ..
పుట్టపర్తి గారిని క్రాపు తీసేసి పిలక జుట్టు పెట్టుకోమని సూచించారట స్వాములవారు..
పుట్టపర్తికి కోపం వచ్చి
'తాను 24 లక్షల సార్లు గాయత్రిని ..
25 కోట్లు నారాయణమంత్రాని జపించాననీ..
కానీ తనకే దివ్యనుభూతీ కలుగలేదనీ..
వారికేమైనా కలిగివుంటే చెప్పమనీ 'కోరినారట.
తులసీదాసు ను ఉదహరిస్తూ ఒక చరణం చెప్పినారు
అందుకు అగ్రహోదగ్రులైన స్వామి
'తులసీదాసుకేమి తెలుసు ..??
అతడు ముస్లిం కాదా..?' అన్నారట..
'తులసీదాసుకు తెలియనిది.. నీకేమి తెలుసు..?'
అని కోపంగా ప్రశ్నించి పుట్టపర్తి బయటికి వచ్చేశారు
ఆ తర్వాత స్వాములవారు
'పుట్టపర్తి అసాధ్యుడనీ..
అతనిని వప్పించలేకపోయాననీ '
అన్నారట
కానీ ..
కంచి పరమాచార్యుల వారు పుట్టపర్తి ని అధిక్షేపించలేదు
వారి బాహ్యరూపంకన్నా లోపలి వ్యక్తికే విలువనిచ్చారు
శ్రీ. వి. రమాపతిరాజు వ్యాసం పుట్టపర్తి వర్ధంతి సందర్భంగా
ఆంధ్రజ్యోతి , తిరుపతి, 01-09-82.