5 జులై, 2012


కలడందురు దీనులయెడ..
కలడందురు పరమ యోగి గణముల పాలన్ 
కలడందురన్ని దిశలను..
కలడు కలండనెడు వాడు కలడో ..?లేడో?
 

ఆలోచన కరెట్టే..
చిన్న తేడా ఒకటి చేసింది చివరన..
దీనంగా ప్రార్థన చేసిన వారిని రక్షించేందుకు 
ఒకడున్నాడని అంటుంటారు.
తన ఇంద్రియ పటాటోపాన్ని 
తనకు తాను నిగ్రహించుకోలేక
ఈశ్వరుని స్వరూపమునందు 
శరణాగతి పొందిన వారికీ 
అదే రక్షణ..
 

మనసును వెనక్కు తిప్పి జ్ఞానమార్గములో  
యోగిగా నిలబడిన వారికీ 
ఒకటే రక్షణ..

ఒకడున్నాడు అన్నారు..
వున్నాడు వున్నాడు అంటారు కానీ
వున్నాడు వున్నాడు అనేవాడు..
వున్నాడో లేడో..
సంశయాత్మా వినశ్యతి..
 చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు..
 
క్రిందిది..
ఆంధ్ర జ్యొతిలో ప్రచురితమైన
పుట్టపర్తివారి పద్యవ్యాఖ్య
శాంతిపర్వం లోని తిక్కన్న పద్యానికి..