6 జూన్, 2017

వస్తా వట్టిదె .. పో తా వట్టిదే ..

అలెగ్జాండరు ..
ఎన్నో కథలు..
రాజ్యకాంక్షను పెనవేసుకున్న 
పదహారేళ్ళ పసి హృదయం ..
ఒకవైపు యుథ్థోన్మాదం..
మరోవైపు గురువు పయనించిన 
తత్త్వ రహస్యదారులపై ఆసక్తి..

ఎంతమంది మహనీయులను చూసినా..

మరణం చేయి చాచేవరకూ..
ఆ సారసమీరం హృదయాన్ని స్ప్రుశించనేలేదు..

రాచరికపు నెత్తుటిదారులలో పడిపోతున్నప్పుడు

 అతణ్ణి అరిస్టోటిలు పట్టినిలిపినట్లనిపించేది..
ఆయన తన విద్యా బోధకుడు. 
 ప్లేటో ఆరాధకుడు .. 
 గొప్ప తాత్త్వికుడు ప్లేటో.. 


మనిషిమార్గాన్నిమార్చేవి రెండే రెండు..

తల్లి.. గురువు..
గురువు నతడు సొంతం చేసుకునే సరికి..
కాలం జారిపోయింది..
రిక్త హస్తాలే మిగిలాయి..
వాటినేఅతను ప్రపంచానికి చూపాలనుకున్నాడు..


కాస్త మట్టి..

గంగాజలం..
రామాయణ భారతాలు.. 
ఒక గురువు..
భారత దేశం నుంచీ కానుకగా కావాలని  
అరిస్టాటిల్ ఎందుకడిగాడో అర్థమైంది ..
అప్పటికే సమయం మించిపోయింది .. 
జీవితం అతి త్వరగా ముప్ఫయి రెండేళ్ల కే 
ముగిసి పోయింది .. 
ఇది అలెగ్జాండరు  జీవితం .. 
మరాఠీ నుంచీ 
''భారతీయ ఇతిహాసాం తిల్ సాహసోనేరిసావే''
 అనువదించిన పుట్టపర్తి 
మన గురించి ఏం చెబుతారో చూద్దాం.. 
పుట్టపర్తి ఒరిజినల్ మరాఠీ నుంచీ తర్జుమా చేసిన వ్యక్తి 
అంతే కానీ 
మరాఠీగ్రంధానికి  ఇంగ్లిష్ అనువాదం 
దానికి మళ్ళీ తెలుగు అనువాదం .. 
ఇలా కాదు 
మరాఠీ భాష సొగసులు పరిమళాలు 
ఆత్మ జారిపోనివ్వని కథ ఇది .. 
అనువాదాలలోను పుట్టపర్తికి గొప్ప పేరే వుంది .. 
గ్రీ కు చక్రవర్తి దేశమున నలువేపులకును 

జారుల నంపుచుండెను.

జయించిన జయింపవలసిన దేశములలో 

వారు సంచరించి వచ్చి..
యక్కడి స్థితి గతులను చక్రవర్తికి దెలిపెడువారు.

వారు దెచ్చిన వృత్తాంతములలో 

నరణ్యముల నేకాంతవాస మొనర్చు తపస్వులు.. తపోవనములు.. 
నిస్సంగులు..
గ్రామైక రాత్రముగ దిరుగు తత్త్వ చింతకులు .. 
వీరి వర్ణనములు గూడ నుండెడివి.

గ్రీకు చక్రవర్తికి స్వయముగ తత్త్వజ్ఞానమునందభిరుచిగద్దు..

అతడరిస్టోటిలు శిష్యుడు..

భారతదేశమునందలి ఇట్టి 

నిస్సంగులైన పురుషుల విషయమున..
గ్రీకుదేశమునందే యెంతయో యాదరముండెడిది..
భారతదేశమునకు రాకముందే వీరి కీర్తి 
యలగ్జాండరు చెవులకెక్కినది..

గ్రీకు దేశస్తులిట్టి యతులు మొదలైన వారిని 

తమ భాషలో
జిమ్నాసోఫిస్ట్  Gymnosophist  అని పిలచెడివారు..

ఇట్టివారిని ప్రత్యక్షముగ జూచి .. 

వారితో మాటాడవలెనని గ్రీకులకెంతయో ఆశ.

అరణ్యల దపమొనర్చికొను సన్యాసులనెందరినో 

అలగ్జాండరు దనకడకు రప్పించుకొనెను..
కొన్ని యెడల దానే పోయి వారిని జూచెను..
ఇట్టి సన్నివేశముల గురించిన కొన్ని కథలు
గ్రీకు చారిత్రకులు వ్రాసిరి..
వానిలో నొకటి రెండు కథల నిచట నుధ్ధృతీ కరింతును..

ఈ యుదాహరణములతో గ్రీకులు 

భగవంతుని పుత్రుడనుకొన్న యలగ్జాండరు
వ్యక్తిత్వము గూడ మనకు బోధపడగలదు..

గ్రీకు చక్రవర్తి 

యొకనాడొక యతిని గలిసికొన్నాడు..
అతనినితడు
'' నాకీ దిగ్విజయములో సంపూర్ణ యశస్సు లభించునా లేదా..??''
యని ప్రశ్నించెను..
దానికాసన్యాసి యేమియు బదులివ్వలేదు..
అతడొక కృష్ణాజినమునుదెఛ్చి ఇఛ్చి .. 
దీనిని బరచికొని గూర్చుండుమని 
చక్రవర్తితోనన్నాడు.

ఆ కృష్ణాజినమరటియాకువలె 

ముడుచుకొని పోయినది..
దానిని జక్కగా నేలపై బరచి కూర్చొనవలసినదనియతియన్నాడు..

దానిపై యలగ్జాండరో ... 

లేక యతని యాజ్ఞ తో మరియొకరో .. 
కూ ర్చొనుటకై యత్నించెను..

కాని దానిని బరచికొనుటెట్లు..??

ఒకవైపు సరిజేసిన మరియొకవైపునుండీ.. 
యది ముడుతలువడుచు వచ్చును..

వారెంతయోబ్రయత్నించిరి..

దాని ముడు తలుబోగొట్టుటకు సాధ్యము గాలేదు..

ఆయవస్తజూచి యాయతి ఫక్కున నవ్వినాడు..

అపుడాతడనెను..
'' చక్రవర్తీ..!! భారతదేశ దండయాత్రవలన 
నీకు గలుగబోవు లాభమింతే..!!
నీవొకవేపునుండీ ముందుకు సాగిపోవునప్పుడు..
నీచే జితులైన రాజ్యములు మరల నూత్న శక్తిని సంపాదించుకుని నీపై బడును.. 
వారిని జయించుటకు నీవు వెనుదిరిగినప్పుడు.. 
జయింపవలసిన రాజ్జములు నీపై బడును.. 
నీవెట్లును.. భారతదేశ సామ్రాట్టువు కాజాలవు..''

1 జూన్, 2017

వినర ఓ రన్న..

రావణుణ్ణి రాక్షసునిగా చూడటమే 
మనం ఇంతవరకూ  చూసాం..
కానీ అదే రావణుణ్ణి దేవునిగా..
తమ పూర్వీకునిగా చూసే ఆదీవాసీలున్నారు..
రావణునికి ఆలయాలూ వున్నాయి....]
అంతే కాదు రావణునికి రాక్షస ముద్ర వేసి..
చరిత్ర వక్రీకరిచి.. 
సాంస్కృతిక దాడి చేసారన్నది ఆదివాసీల వాదన..

ఇప్పటికీ చాలాచోట్ల రావణుని ఆలయాలున్నాయంటే
రావణుని వారెన ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు..

మధ్యప్రదేశ్ లోని విదేశ జిల్లా..
రావణ్ గ్రామంలోలేని ఆలయం.. రాజస్థాన్ లో జోధాపూర్ సమీపంలోని
స్థానికులు రామ రావణ యుద్ద్ధం తర్వాత.. 
శ్రీలంకనుంచి జోధాపూర్ వఛ్చి స్థిరపడినట్లు చెబుతారు ..

వీరితో పాటూ మరికొన్ని తె గల వారు కుడా
రావణుని వీరునిగా గౌరవిస్తారు ..
కాన్పూర్ లోనూ రావణుని ఆలయం వుంది..

ఆ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరిచి
 పూజలు నిర్వహిస్తారు ..
ఇంకా చాల ప్రాంతాలలో రావణుడే ఆరాధ్య దైవం..
వీరు ప్రపంచంలోనే
అతి పెద్ద ఆదివాసీ తెగవారు..
వీరి భాషకు లిపి లేదు..
ఇలా చరిత్రలోఈ హీరోలనుకున్న వాళ్ళు
కాలక్రమంలో విలన్ లుగా మారిపోతే ఆశ్చర్య పడక్కర్లేదు..

తొడకొట్టడాలు ..
మీసం తిప్పడాలు ..
కట్టి దూయతలు వంటి 
భీకర దృశ్యాలతో ప్రేక్షకులను వెర్రెత్తి పోయేలా చేసిన 
గౌతమీపుత్ర శాతకర్ణి  లో 
సత్యమెంత.. ??
చరిత్ర ఎంత .. ??
కల్పనా ఎంత .. ?? 
అని తరచి చూస్తే .. 
గందరగోళమే తప్ప మరేం కాదని 
సినీ పండితుల ఉవాచ.. 

ఇలాంటివే చాణక్యునిపైనా కల్పించారట.. 
ప్రసిధ్ధ వ్యక్తులపై అభూత కల్పనలు 
బయలుదేరడం సహజమే కదా.. 

చంద్రగుప్తుని కండగా నిలచిన చాణక్యునిపై.. 
కథలు .. నాటకాలు.. కావ్యాలు ..  రాయడానికి.. 
ఆకాలంలో చాలామంది ప్రయత్నించి ఉండవచ్చు .. 

ఎందుకంటే .. 
అర్థశాస్త్రవేత్తగా .. రాజనీతిజ్ఞునిగా నందులనంతం చేసి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న పౌరుషవంతునిగా 
ఏంతో మందికి సుపూర్తి ప్రదాత కదా.. 
కొంత మంది వీరత్వాన్ని ఎంచుకుంటే.. 
కొందరు శారీరకంగా ఆయనపై దాడి చేయడానికి కూడా వెనుకాడలేదు.. 

ఒక నాటకకర్త.. 
చాణక్యుని కురూపిగా.. 
వికృత  వానిగా మలచి .. 
 ఆనంద పడినాడట .. 

ఈ విషయాలు .. 
మన పుట్టపర్తి తెనిగించిన మరాఠీ గ్రంధం.. 
'' భారతీయ ఇతిహాశాంతిల్ సాహసోనేరి సావే''
 "స్వర్ణ  పత్రములు ''       లో మనకు కనిపిస్తాయి.. 

శక హూణాది విదేశీ దురాక్రమణదారులందరినీ తరిమికొట్టి 
జాతిని రక్షించిన చంద్రగుప్త విక్రమాదిత్య యశోధర్మాది భారత వీరుల విజయ గాధలను అభివర్ణించే స్పూర్తిప్రదమగు చారిత్రక పరిశోధక గ్రంధం  వీర సావర్కరు మరాఠీ భాషలో రచించిన 
'' భారతీయ ఇతిహాసాంతిల్ సహసోనేరి పానే '' 


ప్రసిధ్ధపురుషులను గురించి గాధలల్లుట సాధారణముగ వాడుక..
ఆ స్థితి యాతనికి దప్పలేదు.
చంద్రగుప్త చాణక్యులు మరణించిన పిదప 
ననేక సంవత్సరములకు వ్రాసిన గ్రంధములలో గట్టుకథలకు లెక్కలేదు..

జైన , బౌధ్ధ, వైదిక గ్రంధములలో నీ గాధలు

 భిన భిన్నములుగ గల్పింపబడెను..

సంస్కృత నాటక మొకటి గలదు..

ఆ నాటక కర్త కళాదృష్టితో గొన్ని గాధలల్లినాడు..
చాణక్యుడు కురూపియట..
అతని వికృత దంతములను గురించి 
నాటకకారులు విపులముగ వర్ణించిరి..

చంద్రగుప్తునాతడొకనాడు ద్రోవలో గలసెను..

నాటికి జంద్రగుప్తుడొకనాడొక గ్రామీణ తరుణుడు మాత్రమే.
వాని సాముద్రిక లక్షణములను చాణక్యుడు గమనించి యాతనిని సామ్రాజ్యాధిపతిగ నొనర్ప దలచెనట..
ఇట్టి వెన్నియో గల్పనలు..
ఈ కల్పనలలో గొన్ని యైతిహాసింక 
సత్య కణికలేమైనను గంపించునాయని జూతముగాక..