11 డిసెం, 2013

కృష్ణుని అవతారం అందరికీ అర్థం కాదా..

  
కృష్ణుని యవతారమందర కర్థముగాదు..
ఆతడు పూర్ణపురుషుడు..
అడుగడుగునను 

పరిమితమైన బుధ్ధి నాతడపహాస్యము సేయును.
 

అట్లే భాగవతము గూడ..
యెత్తిన వారి చేతి బిడ్డగాదు
ఒక మాట ఒక బాణము గల రామపరబ్రహ్మము అందరకు నందుబాతులో నుండువాడు.
రామునివలెనే ..రామాయణ రచనయు..

 నొకటే తిన్నని మార్గము నాశ్రయించినది.
 

కృష్ణపరమాత్ముడట్టి సులభుడుగాడు
ఆ జీవితమున నెన్న్నియో యెగుడుదిగుడులు. అతడు మహాయోధుడు..
పిరికివాడు..
పదునారు వేల మంది భార్యలతో కాపురమీడ్చినవాడు
 

ఇన్ని యుండినను బ్రహ్మచారియట..!!
త్యాగభోగముల రెంటిని గడజూచినవాడు..
అతని ధర్మాధర్మముల వింగడింపు మనమనుకొనునది గాదు..
కృష్ణుని పాపపుణ్యములకు 

అడుగడుగునను అతడే భాష్యము చెప్పవలయును
 

కృష్ణుని పరివారములో ..
నాకసమున నెన్ని చుక్కలో యన్ని భేదములు
అతని వంటిదే యతని కథ యైన భాగవతమును..
ప్రాకృత కావ్యములను జదివి యానందించుటకును
కుందపుష్పమాల గ్రుచ్చుటకును ..
కుపితయైన ప్రియురాలినోదార్చుటకును..
తెలిసిన యదృష్టాశాలురు కొందరేనట..
ఒకానొక ప్రాకృత కవి సవాలు..!!
 

అట్లే కృష్ణ భక్తి నెరపుటకును..
భాగవతమును పఠించుటకును అధికారులు కొందరే..