30 జులై, 2014

అల్లసాని వారి అల్లిక జిగి బిగి

చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్ధిఁ, 
బొడమిన చెలువ తోఁబుట్టు మాకు
రహి పుట్ట జంత్రగాత్రముల ఱాల్‌ గరఁగించు, 
విమలగాంధర్వంబు విద్య మాకు
ననవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించు, 
పని వెన్నతోడఁ బెట్టినది మాకు
హయమేధ రాజసూయము లనఁ బేర్వడ్డ, 
సవనతంత్రంబు లుంకువలు మాకుఁ  
పదము పదము  లో జాలువారే తెలుగు తేనెలు 

అల్లసాని వారి అల్లిక జిగిబిగి
పరిశోధన పత్రికలో వచ్చిన వ్యాస  భాగమిది

రాయలనాటి కవితాజీవనం లో 
వర్ణన విధానంలో పెద్దన సం యమం  
నా బ్లాగ్ లో ప్రచురింపబడింది
 

దానికి మరో భాగమే ఈ అల్లసాని వారి అల్లిక జిగి బిగి
 

ఇందులో అల్లసాని వారి అల్లిక లోని జిగి బిగులతో పాటు ఎన్నో విలువైన విషయాలు మనకు చెబుతారు పుట్టపర్తి 
అప్పళాచార్యులవారు 
కందుకూరి రుద్రకవి 
అష్టభాషాకవిత్వ కృష్ణావధాన్లు 
శాబ్దిక పాండిత్యంతో వేంకట రామ శాస్త్రులు సహస్రావధని ప్రభాకరశాస్త్రి 
అభినవ వాది విద్యానంద ల పరిచయం మనకు కలుగుతుంది
 

విద్యానగరమున పురుషులేకాదు 
స్త్రీలలో కూడా కవిత్వం పరవళ్ళు తొక్కింది

దేవరాయల కాలంలో వుండిన శారదాదేవి మహా విద్వాంసురాలు 

ఆమెను అరుణగిరినాధుడు బ్రహ్మాండంగా పొగిడాడట
 

అచ్యుత రాయని ఆస్థానమున ఉండిన 
ఓదువ తిరుమలమ్మ చక్కని కవిత్వమును విఠలాలయ వీధులలో పిండినదట..
 

రాయలు పెద్దన్నకు గోకట గ్రామాద్యనేక అగ్రహారములోసగినాడు
అందు రెండు శాసనములు కలవు
ఒకటి సకలేశ్వర లింగ శాసనము ఇది 1518 లోనిది
రెండవది చెన్నకేశవునకు భూదానము ఇది కూడా పై సంవత్సరములోనిదే
 

పెద్దనామాత్యులదే దక్షిణ అర్కాటుజిల్లా విలిపురం తాలుకా అన్నియూరున ఒక శాసనం
అందులో పెద్దన్న వరదరాజాలయం కట్టించి 

భూమిని ధారవోసిరి ఇది1519 నాటిది
అంటూ ఎన్నో శాసనాలను ప్రస్తావిస్తారు 
ఇలాంటి ఎన్నో విశేషాలు కలిగిన ఈ జిగిబిగి  చదివితీరవలసిందే..