16 మార్చి, 2013

మాల లైన పూలు


మోచంపేట..
గుడిపాటి అవ్వ గారిల్లు..
ఇంటి బయట పెద్ద పెద్ద అరుగులు
చాపపై గుట్టగా పోసిన పూలు

 ఆడ వాళ్ళందరి తో కలిసి
తులజ ..కస్తూరి ..ఇందిర.. లలిత..
పూలమాలలు కడుతున్నారు
గుసగుసగా మాట్లాడుకుంటూ
ముసి ముసి నవ్వులతో  కలిపి పూలు మాలలవుతున్నాయి
ఆరోజు సాయంత్రం ఇంట్లో భజన
గురువారం

ఎందుకే అట్లా నవ్వుతున్నారు..
గదమాయించారు అయ్య

వయ్యారముగ రారా..
ఊ..
అందుకోండి
పల్లవి పాడి హుంకరించారు అయ్య

అయినా వాళ్ళ ముఖాలలో చిలిపితనాన్ని 
 ఎర్రవడ్డవారి చెక్కిళ్ళు దాచలేక పోయాయి
అందరూ కలిసి


"వయ్యారముగ గ రారా..
శ్రీ హరి.. వయ్యారముగ రారా.."

పాట 
ఆ పూలలో మధువును తాగిన తేటిలా
కొత్తగా హొయలు పోయింది..
పూమాల

లోపల   కృష్ణ చైతన్య ప్రభువు కంఠసీమను
అలంకరించి మురిసి పోయింది..