30 ఏప్రి, 2012

పుట్టపర్తి వారివిమర్శ-పుట్టపర్తి అనూరాధ.



కొందరు విమర్శకులు ..
వ్యాసాలను వర్ణిస్తున్నట్లు వ్రాస్తారు. 
కొందరు వ్యాఖ్యానిస్తున్నట్లు వ్రాస్తారు 
మరి కొందరు 
ఎదుటివారిని ప్రేరేపిస్తున్నట్లు వ్రాస్తారు. 
కొన్ని నిప్పురవ్వల్లాంటి 
కొంగ్రొత్త విశేషాలను 
దేశం మీద క్రుమ్మరిస్తారు. 
ఇలా ఎన్నో రకాలు. 
పుట్టపర్తివారు 
రెచ్చగొట్టే విమర్శలు చేసేవారు. 
వారి విమర్శ 
ఆలోచించే విస్ఫులింగాలను 
సహృదయుల కందిస్తుంది. 
వారి విమర్శ 
ఆనందం కోసం గానీ 
ఆహ్లాదం కోసం గానీ 
చదువుకోం. 
ఒక క్రొత్త చూపుకోసం 
వాటిని చదువు కొంటాం 
నిద్ర పోయే జాతిని 
మేల్కొలుపుతున్నట్లు 
విమర్శ చేయటం 
పుట్టపర్తి వారికే సరిపోతుంది.
 
ఆచార్య జి.వి.సుబ్రమణ్యం.