12 జన, 2012

DK పట్టమ్మాళ్DK పట్టమ్మాళ్ గానమూ అయ్యకు ప్రీతే
ఇంట్లో పెద్దగా పెట్టి వినేవారు అయ్య. 
అయ్యకు కొద్దిగా వినికిడి లోపం వుండేది.
అయ్య చెవినుంచీ చీము కారుండేద
ఆ వైద్యం.. ఈ వైద్యం..
 చేసి అమ్మ ఉపవాసాలు కూడా చేసేదిట నాగేంద్రునికి ప్రతివారం..
అయ్యకు పెద్దగా మాట్లాడితే ..
"ఎందుకలా మొత్తుకుంటావ్..?"
 అని చిరాకు పడేవారు అయ్య..
మెల్లగా మాట్లాడితే ..
"నీలో నీవే ..గొణుక్కుంటావెందుకే..?"
అని గదమాయించేవారు..
అయ్యకు తగిన సౌండులో..

కొన్ని సైగలతో ..
అయ్య పక్కన కూచుని 
అమ్మ చక్కగా మాట్లాడేది..