28 మే, 2015

గురు స్మరణ

పుట్టపర్తి శతజయంతి వేడుకలలో నరాల అన్నను మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత కలిశాను
దూరదర్శన్ లో.
ఎంత ఆనందమైందో..
చిన్నప్పుడు చూశేదాన్ని..
ప్రతి సభలో రాజన్న కవి నరాల రామారెడ్డి గురు స్తోత్రం చేసేవారు
ఇద్దరూ పుట్టపర్తిని గురువుగా నమ్మి ఈనాటికీ అదే గురు స్తోత్రాన్ని గావిస్తున్నారు
కానీ రాజన్న మన మధ్య లేడు..
దూరదర్శన్ లో అన్నా బాగున్నారా..
అంటే ప్రెమగా తలనిమిరాడు రామారెడ్డి
బయటకు చెప్పనంటే ఒక సంగతి చెబుతా అన్నారు
చెప్పనన్నా . చెప్పండి.. అని బ్రతిమలాడాను..
ముందు నీవు నీ కెమెరా ఆఫ్ చెయ్..
అన్నాడు
చేయక తప్పలేదు..
ఒకసారి పుట్టపర్తి వారు.. ఒరే.. నీ కవిత్వ కళనంతా ప్రయోగించి పద్యాలు రాసుకురారా.. అన్నారు..
గురువు అలా అనే సరికి కొండంత ఉత్సాహం వచ్చింది..
వెంటనే రెండు మూడు రోజులలో మాంచి పద్యాలు రాసుకుని
అయ్యముందు ఉద్విగ్నంగా వినిపించాను..
ప్రశంసిస్తే పొంగిపోదామని ఆశగా చూశాను

భలే బాగా రాసినావురా ..
నీలో గొప్ప అభివ్యక్తి వుందిరా..
ఆ పేపరీ అన్నారు..
నా ఎదుటనే ఆ పద్యాలను రాజన్నకు ఇచ్చేశారు..
నేను అవాక్కయ్యాను..
యేమి స్వామీ ఇది..
నన్ను రాయమని ..
మీరిట్ల చేయడం యేమన్నా బాగుందా.. అని చిన్నబుచ్చుకున్నాను.

అప్పుడు పుట్టపర్తి పోనీలేరా..
నీవిలాంటివి వంద రాస్తావు
వాడు సభల్లో పాడుతాడుగదా..
అన్నారు..
అంటూ ఈ విషయం రాయొద్దు అనూరాధా..
అన్నారు
రాయను రాయను..అన్నా

అన్నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తున్నా..
అనూరా ధ 

నీ వదనంబునన్ మనసు నిల్పిన..






19 మే, 2015

గుండె గులాబీలైన పుట్టపర్తి లీవ్స్ ఇన్ ద విండ్

 
గుండె గులాబీలైన పుట్టపర్తి లీవ్స్ ఇన్ ద విండ్..
పుట్టపర్తి లీవ్స్ ఇన్ ద విండ్ ను 

-"గుండె గులాబీల" పేరుతో 
 శ్రీ అన్నవరం ఆదిశేషయ్య గారు అప్పట్లో అనువదించారు..
పుట్టపర్తి దీన్ని ఆశీర్వదించారు..
ఆ అనువాదం పై వచ్చిన విశ్లేషణ ఇది..
దీని వెనుక ఎప్పట్లానే శ్రీ శ్రీశైలం గారి తోడ్పాటు.. ఉంది..
అవధరించండి..
పుట్టపర్తి అనూరాధ.










1 మే, 2015

జీర్ణ హృదయ వీణా తంత్రి చివికి పోవ ..

                                

''కావ్యద్వయి''
 పుట్టపర్తి దంపతుల రచన
అయ్య తొలిసారిగా అమ్మ రచనలను ప్రోత్సహించి..
తనతోపాటూ రెండవ మూర్ఛ్చనగా 

అమ్మ స్వరాన్ని వినిపించారు..
ఇందులో ఆకాలంలో వేళ్ళూనుకుంటున్న 

వచన రచనా సరళిని కూడా కొంత ప్రకటించడం జరిగింది..
ఇది నాకు అద్భుతంగా అనిపించింది..
'వింటివా పదము చెల్లె..'
అన్నప్పుడు..
తెలంగాణా వాసుల 'చెల్లె' పదం తీయదనా నికి 

నా కన్నుల్లో నీళ్ళు చిప్పిల్లాయి ..

నా నాలుకకు ఆపరేషన్ జరిగింది.. 
కొన్ని పదాలు పలుకక చెవులకు కష్టం కలిగించవచ్చు..
ఉదాహరణకు వీణను అప్పుడప్పుడు వీనను చేశాను సహృదయంతో క్షమించగలరు..


పుట్టపర్తి అనూరాధ.